కర్కశమో లేక కసాయితనమో గానీ కొందరూ తల్లుల చేసే కృత్యాలు అత్యంత ఘోరంగా ఉంటాయి. ముఖ్యంగా కొందరూ తల్లల ప్రవర్తన అర్థంకాని రీతిలో ఉంటుంది. అది ఒక మానసిక రుగ్మత మరైదైన గానీ..వారి నైజానికి అభం శుభం తెలియని చిన్నారుల బలవుతున్నారు. అచ్చం అలానే యూఎస్‌లోని ఓ తల్లి క్షమించరాని ఘాతుకానికి పాల్పడింది.
యూఎస్‌లోని 31 ఏళ్ల క్రిస్టెల్ కాండెలారియో 16 నెలల పసికందుని ఇంట్లోనే పది రోజులుగా 16 నెలల చిన్నారి జైలిన్‌ని ఒంటరిగా వదిలేసింది. అది కూడా సెలవులపై బయటకు వెళ్లడం కోసం.. ఆ చిన్నారి బాగోగులను గాలికి వదిలేసి.. డెట్రాయిట్‌లో గడిపొచ్చింది. చివరికి ఆ మహా తల్లి హాయిగా తిరిగి వచ్చి ఇంటికి వచ్చి చూడగా ఆ చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉంది. డీ హైడ్రెషన్‌కి గురయ్యి ఉంది. ఆ తర్వాత తాపీగా సాయం కోసం హెల్ప్‌లైన్‌కి కాల్ చేసింది. దీంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు ఆ చిన్నారిని నిశితంగా గమనించారు. ఆ చిన్నారి ఒంటిపై ఒక్క గాయం కూడా లేదని గుర్తించారు.
ఐతే ఆ చిన్నారి ఉన్న పరుపు మూత్రం, మలంతో కలుషితమై ఉన్నట్లు గమనించారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో కాండెలారియో ఇలా చిన్నారిని ఒంటరిగా వదిలేయడం మొదటిసారి కాదని తేలింది. కాండెలారియో ఇంటి చుట్టుపక్కల వాళ్లు ఆమె ఇలా చాలాసార్లు చేసిందని, అలాగే ఇలా చేయొద్దని చెప్పామని వారు చెబుతున్నారు. చిన్నారి జైలిన్ చనిపోవడానికి తల్లి నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
(చదవండి: ఎవ్వరూ మాట్లాడని కేరళ కథ! యావత్ సమాజం సేవ చేసేలా..!)
Comments
Please login to add a commentAdd a comment