అంకురా ఆస్పత్రి వైద్యులు ప్రాణ ప్రదాతలుగా నిలిచారు. అరుదైన ఆపరేషన్ చేసి మూడు నెలల పసికందుకు ప్రాణం పోశారు. ఇటీవల మూడు నెలల పసికందును.. పక్కనే ఆడుకొంటున్న తోబుట్టువుల వద్ద కుటుంబ సభ్యులు పడుకోబెట్టారు. ఆ సమయంలో పసికందు ఓ పన్నీసును మింగేసింది. ఊపిరి పీల్చుకోవడంతో పాటు ఇతర సమస్యలు తలెత్తడంతో అత్యవసర చికిత్స కోసం తల్లిదండ్రులు అంకురా ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రికి వచ్చిన వెంటనే అంకురా ఆస్పత్రి కన్సల్టెంట్ పీడియాట్రిక్ గ్యాస్టోఎంటరాలజిస్ట్, హెపాటాలజిస్ట్ డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠి పరీక్షలు నిర్వహించారు. రేడియోగ్రాఫిక్ పరీక్షల్లో పిన్నీసు కడుపులో గుచ్చుకున్నట్లు నిర్ధారించారు. ఇది ప్రాణాంతకంగా మారి పసికందుకు ప్రమాదమని భావించారు.
వెంటనే డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠిల వైద్యుల బృందం పసికందు పొట్ట భాగంలో క్లిష్టమైన ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స చేశారు. మినిమల్ ఇన్వాసివ్ టెక్నిక్ ను ఉపయోగించి రెండు సెంటీమీటర్ల పిన్నీసును తొలగించారు. పసికందు ప్రాణాన్ని కాపాడారు.
ఈ సందర్భంగా అంకురా హాస్పిటల్ ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రన్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ వున్నం మాట్లాడుతూ.. గృహోపకరణాలతో చిన్న పిల్లలకు ప్రమాదం పొంచిఉందని ఈ సంఘటన గుర్తు చేస్తుంది. ప్రాణాంతక పరిస్థితులను నివారించడంలో తల్లిదండ్రుల అవగాహన, వేగంగా స్పందించడం చాలా అవసరమని తెలిపారు. అంకురా హాస్పిటల్ సంరక్షణను అందించడమే కాకుండా రోగుల భద్రతకు కట్టుబడి ఉందని అన్నారు.
మూడు నెలల పసికందుకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠి మాట్లాడుతూ.. మేము ఎండోస్కోపీ ద్వారా పిన్నీసును విజయవంతంగా తొలగించాం. తీవ్రమైన సమస్యలను నివారించడానికి సకాలంలో చర్య అవసరం. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఈ విధానం ద్వారా బాధితులకు ఓపెన్ సర్జరీ అవసరాన్ని తగ్గించడమే కాకుండా ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. వెంటనే కోలుకోవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment