సెట్‌లన్నీ ఆన్‌లైన్‌లోనే
మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం: రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షలను ఈ విద్యాసం వత్సరం నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించను న్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఏయూ సెనేట్ మందిరంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించడం జరుగుతుందన్నారు. రానున్న విద్యాసం వత్సరం నుంచి ఎంసెట్ నిర్వాహించా లా? వద్దా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోం దన్నారు. దీనికి పరిష్కారం చూపే విధంగా త్వరలో దీనిపై ప్రత్యేక నిపుణుల కమిటీని నియమిస్తామన్నారు. ఈ సందర్భంగా పలు సెట్లకు కన్వీనర్ల వివరాలను ప్రకటించారు. ఎంసెట్‌ను జేఎన్‌టీయూ కాకినాడ నిర్వహించనుండగా.. కన్వీనర్‌గా ఆచార్య సీహెచ్ సాయిబాబు వ్యవహరిస్తారు.