సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీసీ స్టడీసర్కిళ్లలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ పొందగోరు అభ్యర్థులకు ఈ నెల 16న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు బీసీ స్టడీసర్కిల్ డెరైక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. పరీక్షకు హాజరుకానున్న తెలంగాణ అభ్యర్థులు tsbcstudycricles. cgg.gov.in,. ఆంధ్ర అభ్యర్థులు apbc welfare.cgg.gov.in వెబ్‌సైట్‌లలో హాల్‌టికెట్‌లను గురువారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.