న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా విదేశీ విద్యకోసం నిర్వహించే జీఆర్‌ఈ, టోఫెల్ అర్హతా పరీక్షలను చైనా, ఇరాన్‌లో మినహా విద్యార్థులు ఇంటి నుంచే రాయవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) వెల్లడించింది. పరీక్షా కేంద్రాల్లో నిర్వహించాల్సిన జీఆర్‌ఈ, టోఫెల్‌లను కోవిడ్ కారణంగా రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే పరిస్థితులు ఏర్పడే వరకూ ఇంటివద్దనుంచే పరీక్షలు రాసేందుకు అవకాశం ఇస్తున్నట్లు టోఫెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీకాంత్ గోపాల్ వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి, ప్రోక్టార్ యూ అనే రిమోట్ పద్ధతుల ద్వారా పరీక్షలను పర్యవేక్షిస్తామని తెలిపారు. జీఆర్‌ఈలో జవాబు పత్రాన్ని తిరిగి సరిచేసుకునే అవకాశమూ, టోఫెల్‌లో రీడింగ్, లిజనింగ్ స్కోర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. జూన్‌లో రాసే పరీక్షలకు రిజస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment