TOFEL test details
-
దాగుడు మూతలతో మాస్ కాపీయింగ్
సాక్షి,హిమాయత్‌నగర్: అంతర్జాతీయ విద్యాసంస్థల్లో సీటు పొందేందుకు ఉద్దేశించిన టోఫెల్, జీఆర్ఈ ఆన్లైన్ టెస్టుల్లో ‘దాగుడు మూతల’ పంథాలో మాస్ కాపీయింగ్ చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. దాదాపు రెండేళ్లుగా ఈ దందా చేస్తున్న చేస్తున్న నిందితులను డెకాయ్ ఆపరేషన్ ద్వారా పట్టుకున్నట్లు జాయింట్ సీపీ డాక్టర్ గజరావ్ భూపాల్ మంగళవారం తెలిపారు. మండల శ్రావణ్ కుమార్, మండల సాయి సంతోష్ పి.కిశోర్, ఎ.కిరణ్‌కుమార్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సూత్రధారి, ప్రధాన నిందితుడు గుణశేఖర్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలిపారు. డీసీపీ స్నేహ మెహ్రా, ఏసీపీ కేవీఎం ప్రసాద్, ఇన్స్పెక్టర్లు నవీన్, హరి భూషణ్ రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హస్తినాపురం కేంద్రంగా వ్యవహారం... టోఫెల్, జీఆర్ఈ టెస్టుల్లో అధిక స్కోరు వచ్చేలా తాము సహాయ సహకారాలు అందిస్తామంటూ నగరానికి చెందిన గుణశేఖర్ సోషల్ మీడియా ద్వారా కోవిడ్ సీజన్ నుంచి ప్రచారం చేస్తున్నాడు. దీనికి సంబంధించి కొందరు విద్యార్థులు గుణశేఖర్‌ను సంప్రదించగా.. ఒక్కో విద్యార్థి నుంచి రూ.20 వేలు చొప్పున తీసుకున్నాడు. ఇలా దాదాపు ఇతనొక్కడే వంద మంది విద్యార్థులకు మాస్ కాపీయింగ్‌కు సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. తమతో ఒప్పందం చేసుకున్న వారికి టెస్టు మరో గంటలో ఉందనగా హస్తినాపురంలోని ఎగ్జామ్ రూమ్ అడ్రస్ చెప్పేవాడు. అక్కడికి వచ్చిన స్టూడెంట్‌తో పాటు తాను ఏర్పాటు చేసిన టెస్టు టేకర్‌ను లోపలికి పంపేవాడు. కెమెరా 360 డిగ్రీస్ తిప్పుతున్న సమయంలో టెస్టు టేకర్ స్టూడెంట్ వెనుక దాక్కునేవాడు. టెస్టు ప్రారంభం అయ్యాక సుమారు 20 నిమిషాల వరకు ప్రశ్నలను టెస్ట్ టేకర్ వాట్సప్ ద్వారా పంపేవాడు. ఆన్సర్స్‌ను తిరిగి అదే వాట్సప్ నంబర్‌కు వచి్చన తర్వాత కనుసైగలు, చేతి వేళ్లతో సమాధానాలు స్టూడెంట్‌కు చెప్పి రాయించే వాడు. రాయ్‌పూర్ ఎన్ఐటీ స్టూడెంట్స్‌తో జవాబులు.. గుణశేఖర్‌కు పరిచయం ఉన్న వైజాగ్‌కు చెందిన ఆదిత్య, నగరానికి చెందిన శ్రావణ్ రాయ్‌పూర్‌లోని ఎన్ఐటీలో చదువుతున్నారు. వీరికి టోఫెల్, జీఆర్ఈలకు సంబంధించిన ఆన్సర్స్ చెప్పడంలో మంచి ప్రతిభ ఉంది. తొలి రోజుల్లో బంధువులకు, స్నేహితులకు సాయం చేయాలని చెప్పి వారి నుంచి ఆన్సర్స్ రాబట్టేవాడు. కొన్నాళ్లకుæ ఇదో దందాగా తెలుసుకున్న వారిద్దరూ గుణశేఖర్‌కు వస్తున్న రూ.20 వేలలో నుంచి కొంత డబ్బును కమీషన్‌గా తీసుకుంటూ ఈ మాస్ కాపీయింగ్‌లో భాగస్వాములయ్యారు. గత ఏడాది డిసెంబర్లో గుణశేఖర్ అమెరికా వెళ్లాడు. అతను వాడే సిమ్‌కార్డును ఇక్కడే ఉంటున్న శ్రావణ్‌కు ఇచ్చాడు. దానికి సంబంధించిన వాట్సాప్‌ను మాత్రం అతడు అక్కడ తన ఫోన్ ద్వారా వాడుతున్నాడు. అక్కడి నుంచే కథ నడుపుతూ... సోషల్ మీడియాలో యాడ్స్ చూసి రెగ్యులర్ కాల్స్ చేసిన వారితో మాట్లాడే శ్రావణ్ అర్ధగంట తర్వాత వాట్సప్ కాల్ చేయమనే వాడు. ఈ కాల్స్‌ను అమెరికాలో ఉన్న గుణశేణర్ ఆన్సర్ చేసే వాడు. విద్యార్థి వివరాలు, ఏ దేశానికి వెళ్లేది, టెస్టుకు సంబంధించిన వివరాలు తీసుకునేవాడు. గుణశేఖర్ చెప్పిన వాటికి ఒప్పుకున్న స్టూడెంట్‌కు టెస్టు రోజున గంట ముందు హస్తినాపురంలోని ఎగ్జామ్ రూమ్ అడ్రస్ చెప్పేవారు. గుణశేఖర్ అమెరికా నుంచి వాట్సప్ ద్వారా మానిటరింగ్ చేస్తుండగా, ఆదిత్య రాయ్‌పూర్ నుంచి ఆన్సర్స్‌ను ఇక్కడ టెస్టు కండక్ట్ చేయించే శ్రావణ్‌కు వాట్సప్ ద్వారా పంపేవాడు. ఇలా 2020 ఏప్రిల్ నుంచి ఈ దందా చేస్తున్నట్లు, వందల మందిని మాస్ కాపీయింగ్ ద్వారా స్కోర్ సాధించి విదేశాలకు పంపినట్లు తేలింది. ఈ కేసులో శ్రావణ్‌తో పాటు టెస్ట్ టేకర్స్‌గా వ్యవహరించి ఇతడికి సహకరించిన కిరణ్, సాయి సంతోష్ కిషోర్‌లను అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ఆదిత్య, గుణశేఖర్ కోసం గాలిస్తున్నామని గజరావ్ భూపాల్ తెలిపారు. (చదవండి: జీహెచ్ఎంసీకి పైసా పరేషాన్.. గండం గట్టెక్కేనా?) -
HYD: టోఫెల్లో మాస్ కాపీయింగ్‌పై దర్యాప్తు!
సాక్షి, హైదరాబాద్: టోఫెల్లో మాస్ కాపీయింగ్ వ్యవహారం పోలీసుల చెంతకు చేరింది. ఆధారాలతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు అందింది. రూ. 25 వేలు ఇస్తే టోఫెల్లో టాప్ స్కోర్ ఇస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. అంతర్జాతీయ విద్యాసంస్థల్లో సీటు పొందెందుకు రాసే టోఫెల్లో మాస్ కాపీయింగ్ పాల్పడుతున్నట్లు తేలింది. ఒక్కో విద్యార్థి నుండి రూ. 25 వేలు లంచం తీసుకుని.. పరీక్ష గదిలోనే వాట్సాప్ ద్వారా ఆన్సర్స్ లీక్ చేస్తోంది ముఠా. హైదరాబాద్ సైబర్ క్రైం పీఎస్ లో ఈటీఎస్( ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఇండియా ) ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. -
ఇంటి నుంచే జీఆర్ఈ, టోఫెల్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా విదేశీ విద్యకోసం నిర్వహించే జీఆర్ఈ, టోఫెల్ అర్హతా పరీక్షలను చైనా, ఇరాన్లో మినహా విద్యార్థులు ఇంటి నుంచే రాయవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) వెల్లడించింది. పరీక్షా కేంద్రాల్లో నిర్వహించాల్సిన జీఆర్ఈ, టోఫెల్‌లను కోవిడ్ కారణంగా రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే పరిస్థితులు ఏర్పడే వరకూ ఇంటివద్దనుంచే పరీక్షలు రాసేందుకు అవకాశం ఇస్తున్నట్లు టోఫెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీకాంత్ గోపాల్ వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి, ప్రోక్టార్ యూ అనే రిమోట్ పద్ధతుల ద్వారా పరీక్షలను పర్యవేక్షిస్తామని తెలిపారు. జీఆర్ఈలో జవాబు పత్రాన్ని తిరిగి సరిచేసుకునే అవకాశమూ, టోఫెల్లో రీడింగ్, లిజనింగ్ స్కోర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. జూన్‌లో రాసే పరీక్షలకు రిజస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. -
టోఫెల్ పరీక్ష వివరాలు?
ఎంఎస్సీ (ఎన్విరాన్మెంటల్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీల వివరాలను తెలపండి? -సూర్య, నిజామాబాద్.ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో పీజీ చేసిన వారికి ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేట్ కంపెనీలు/ఆర్గనైజేషన్స్‌లో విస్తృత స్థాయిలో అవకాశాలుంటాయి. ఈ క్రమంలో టెక్స్టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, డిస్టలరీలు, మైన్స్, తదితర పరిశ్రమలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆయా పరిశ్రమలు కాలుష్య స్థాయిని పర్యవేక్షించడానికి ఆర్ అండ్ డీ విభాగంలో వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి. సస్టెయినబిలిటీ డెవలప్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ వంటి అంశాల్లో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ కూడా ఎన్విరాన్‌మెంటలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ పరంగా ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అర్బన్ ప్లానింగ్, వాటర్ రీసోర్సెస్, అగ్రికల్చరల్, వంటి ఏజెన్సీలు/సంస్థల్లో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. అందిస్తున్న యూనివర్సిటీలు: ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్ ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా వెబ్సైట్: www.osmania.ac.in శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా వెబ్సైట్: www.svuniversity.in ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా వెబ్సైట్: www.andhrauniversity.edu.in సీబీఐలో సబ్-ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టులను ఏవిధంగా భర్తీ చేస్తారు? -చరణ్, షాద్‌నగర్.సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)లో 50 శాతం సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నేరుగా భర్తీ చేస్తుంది. 25 శాతం పోస్టులను డిపార్ట్మెంట్లో ఐదేళ్లు రెగ్యులర్ సర్వీస్‌లో పని చేసే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్(ఏఎస్ఐ)లను సీనియారిటీ, ఫిట్నెస్ ప్రాతిపదికన, మిగతా 25 శాతం పోస్టులను డిపార్ట్మెంటల్ పోటీ పరీక్షల ద్వారా భర్తీ చేస్తుంది. సీబీఐలో ఎస్ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది. రాత పరీక్ష (ఆబ్జెక్టివ్టైప్), కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఉంటాయి. వయసు 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు.వివరాలకు: htpp://sss.nic.in రైల్వే శాఖలో డాక్టర్ల ఉద్యోగాలను ఏవిధంగా భర్తీ చేస్తారు? -వేణు, ఆదిలాబాద్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే కంబైన్డ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎంఎస్ఈ) ద్వారా రైల్వే శాఖలో డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తుంది. అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీర్స్ హోదా కల్పిస్తారు. హోదాలో జూనియర్ స్కేల్ పోస్ట్ ఇన్ సెంట్రల్ హెల్త్ సర్వీసెస్, మెడికల్ ఆఫీసర్ ఇన్ ది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఇన్ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పోస్టుల భర్తీ కూడా సీఎంఎస్ఈ ద్వారానే చేపడతారు. సీఎంఎస్‌ఈలో రెండు దశలు ఉంటాయి. అవి.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్). ఈ రెండు దశలకు కలిపి మొత్తం 600 మార్కులు కేటాయించారు. ఇందులో రాత పరీక్షకు 500మార్కులు, ఇంటర్వ్యూకు 100 మార్కు లు. రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1, 2.. రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో ఒక్కో పేపర్‌కు 250 మార్కుల చొప్పున కేటాయించారు. పేపర్-1లో.. జనరల్ ఎబిలిటీ (30 ప్రశ్నలు), జనరల్ మెడిసిన్ (70 ప్రశ్నలు), పిడియాట్రిక్స్ (20 ప్రశ్నలు) అంశాలు ఉంటాయి. పేపర్-2లో సర్జరీ (40 ప్రశ్నలు). గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ (40 ప్రశ్నలు), ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ (40 ప్రశ్నలు) అంశాలనిస్తారు. ప్రతి పేపర్‌కు సమయం: రెండుగంటలు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు అభ్యర్థులను పిలుస్తారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీలకు 1:2 చొప్పున రాత పరీక్ష నుంచి అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూలో విజయం సాధించినవారిని ప్రతిభ, ఖాళీల ఆధారంగా వివిధ విభాగాల్లో నియమిస్తారు. సీఎంఎస్ఈ అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదువుతున్న వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చివరి సంవత్సరం చదువుతున్న వారు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్ అందించడం తప్పనిసరి. వివరాలకు: www.upsc.gov.in, టోఫెల్ పరీక్ష వివరాలను తెలపండి? రేవతి, మెదక్.అమెరికాలో విద్యనభ్యసించాలనుకునే నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ విద్యార్థుల ఆంగ్ల భాష సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన పరీక్షల్లో టోఫెల్ ఒకటి. ఈ పరీక్షను అమెరికాకు చెందిన ఇంగ్లిష్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సంస్థ నిర్వహిస్తుంది. కేవలం అమెరికాలోనేకాకుండా 130 దేశాల్లోని కాలేజీలు/యూనివర్సిటీలు టోఫెల్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. రీడింగ్ (60-80 నిమిషాలు, 35-56 ప్రశ్నలు), లిజనింగ్ (60-90 నిమిషాలు, 34-51 ప్రశ్నలు), స్పీకింగ్ (20 ప్రశ్నలు, 6 టాస్క్‌లు), రైటింగ్ (50 నిమిషాలుు, 2 టాస్క్‌లు). ఇంటర్నెట్ ఆధారితంగా ఈ పరీక్షను సంవత్సరానికి 50 సార్లకుపైగా నిర్వహిస్తారు. మన దేశంలో హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రధానకేంద్రాల్లో టోఫెల్ టెస్టింగ్ సెంటర్లు ఉన్నాయి. ఆయా కేంద్రాలకు కేటాయించిన పరీక్ష తేదీలను పరిగణనలోకి తీసుకుంటూ ఆన్లైన్/ఫోన్/ఈ-మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. టోఫెల్ స్కోర్ రెండేళ్లపాటు చెల్లుబాటవుతుంది. వివరాలకు: www.ets.org