టోఫెల్ పరీక్ష వివరాలు? | TOFEL test details | Sakshi
Sakshi News home page

టోఫెల్ పరీక్ష వివరాలు?

Published Thu, Aug 14 2014 2:50 AM | Last Updated on Sat, Aug 11 2018 7:28 PM

టోఫెల్ పరీక్ష వివరాలు? - Sakshi

టోఫెల్ పరీక్ష వివరాలు?

ఎంఎస్సీ (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీల వివరాలను తెలపండి?
 -సూర్య, నిజామాబాద్.ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో పీజీ చేసిన వారికి ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేట్ కంపెనీలు/ఆర్గనైజేషన్స్‌లో విస్తృత స్థాయిలో అవకాశాలుంటాయి. ఈ క్రమంలో టెక్స్‌టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, డిస్టలరీలు, మైన్స్, తదితర పరిశ్రమలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి.
 
 ఆయా పరిశ్రమలు కాలుష్య స్థాయిని పర్యవేక్షించడానికి ఆర్ అండ్ డీ విభాగంలో వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి. సస్టెయినబిలిటీ డెవలప్‌మెంట్, పొల్యూషన్ కంట్రోల్ వంటి అంశాల్లో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ కూడా ఎన్విరాన్‌మెంటలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ పరంగా ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అర్బన్ ప్లానింగ్, వాటర్ రీసోర్సెస్, అగ్రికల్చరల్, వంటి ఏజెన్సీలు/సంస్థల్లో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి.
 
 అందిస్తున్న యూనివర్సిటీలు:
 ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
 ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
 వెబ్‌సైట్: www.osmania.ac.in
 శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
 ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
 వెబ్‌సైట్: www.svuniversity.in
 ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
 ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 
 సీబీఐలో సబ్-ఇన్‌స్పెక్టర్ స్థాయి పోస్టులను ఏవిధంగా భర్తీ చేస్తారు?
 -చరణ్, షాద్‌నగర్.సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)లో 50 శాతం సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నేరుగా భర్తీ చేస్తుంది. 25 శాతం పోస్టులను డిపార్ట్‌మెంట్‌లో ఐదేళ్లు రెగ్యులర్ సర్వీస్‌లో పని చేసే అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్స్(ఏఎస్‌ఐ)లను సీనియారిటీ, ఫిట్‌నెస్ ప్రాతిపదికన, మిగతా 25 శాతం పోస్టులను డిపార్ట్‌మెంటల్ పోటీ పరీక్షల ద్వారా భర్తీ చేస్తుంది. సీబీఐలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్‌‌డ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది. రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌టైప్), కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఉంటాయి. వయసు 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు.వివరాలకు: htpp://sss.nic.in
 రైల్వే శాఖలో డాక్టర్ల ఉద్యోగాలను ఏవిధంగా భర్తీ చేస్తారు?
 -వేణు, ఆదిలాబాద్.
 
 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే కంబైన్‌‌డ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎంఎస్‌ఈ) ద్వారా రైల్వే శాఖలో డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తుంది. అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీర్స్ హోదా కల్పిస్తారు. హోదాలో జూనియర్ స్కేల్ పోస్ట్ ఇన్ సెంట్రల్ హెల్త్ సర్వీసెస్, మెడికల్ ఆఫీసర్ ఇన్ ది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఇన్ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పోస్టుల భర్తీ కూడా సీఎంఎస్‌ఈ ద్వారానే చేపడతారు. సీఎంఎస్‌ఈలో రెండు దశలు ఉంటాయి. అవి.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్).
 
 ఈ రెండు దశలకు కలిపి మొత్తం 600 మార్కులు కేటాయించారు. ఇందులో రాత పరీక్షకు 500మార్కులు, ఇంటర్వ్యూకు 100 మార్కు లు. రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1, 2.. రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో ఒక్కో పేపర్‌కు 250 మార్కుల చొప్పున కేటాయించారు. పేపర్-1లో.. జనరల్ ఎబిలిటీ (30 ప్రశ్నలు), జనరల్ మెడిసిన్ (70 ప్రశ్నలు), పిడియాట్రిక్స్ (20 ప్రశ్నలు) అంశాలు ఉంటాయి. పేపర్-2లో సర్జరీ (40 ప్రశ్నలు). గైనకాలజీ అండ్ ఆబ్‌స్టెట్రిక్స్ (40 ప్రశ్నలు), ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ (40 ప్రశ్నలు) అంశాలనిస్తారు. ప్రతి పేపర్‌కు సమయం: రెండుగంటలు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు అభ్యర్థులను పిలుస్తారు.
 
  నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీలకు 1:2 చొప్పున రాత పరీక్ష నుంచి అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూలో విజయం సాధించినవారిని ప్రతిభ, ఖాళీల ఆధారంగా వివిధ విభాగాల్లో నియమిస్తారు. సీఎంఎస్‌ఈ అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదువుతున్న వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చివరి సంవత్సరం చదువుతున్న వారు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్ అందించడం తప్పనిసరి. వివరాలకు: www.upsc.gov.in,
 
 
 టోఫెల్ పరీక్ష వివరాలను తెలపండి?
 రేవతి, మెదక్.అమెరికాలో విద్యనభ్యసించాలనుకునే నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ విద్యార్థుల ఆంగ్ల భాష సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన పరీక్షల్లో టోఫెల్ ఒకటి. ఈ పరీక్షను అమెరికాకు చెందిన ఇంగ్లిష్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సంస్థ నిర్వహిస్తుంది. కేవలం అమెరికాలోనేకాకుండా 130 దేశాల్లోని కాలేజీలు/యూనివర్సిటీలు టోఫెల్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. రీడింగ్ (60-80 నిమిషాలు, 35-56 ప్రశ్నలు), లిజనింగ్ (60-90 నిమిషాలు, 34-51 ప్రశ్నలు), స్పీకింగ్ (20 ప్రశ్నలు, 6 టాస్క్‌లు), రైటింగ్ (50 నిమిషాలుు, 2 టాస్క్‌లు). ఇంటర్నెట్ ఆధారితంగా ఈ పరీక్షను సంవత్సరానికి 50 సార్లకుపైగా నిర్వహిస్తారు. మన దేశంలో హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రధానకేంద్రాల్లో టోఫెల్ టెస్టింగ్ సెంటర్లు ఉన్నాయి. ఆయా కేంద్రాలకు కేటాయించిన పరీక్ష తేదీలను పరిగణనలోకి తీసుకుంటూ ఆన్‌లైన్/ఫోన్/ఈ-మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. టోఫెల్ స్కోర్ రెండేళ్లపాటు చెల్లుబాటవుతుంది. వివరాలకు: www.ets.org

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement