Pollution control
-
Pollution Control Day: భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ..
ఈరోజు (డిసెంబర్ 2) జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. 1984, డిసెంబర్ రెండున జరిగిన భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ, అటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 1984లో యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుండి విడుదలైన విషపూరిత వాయువు వేలాది మంది ప్రాణాలను బలిగొంది.పెరుగుతున్న కాలుష్యం వల్ల కలిగే సమస్యలపై అవగాహన కల్పించేందుకు కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కాలుష్య ఉద్గారాల పెరుగుదల ఒక్క భారతదేశం మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు. ప్రపంచమంతా కాలుష్య నియంత్రణ దిశగా పోరాడుతోంది. కాలుష్య నిర్మూలన అనేది ఏ ఒక్కరి వల్లనో, ఏ ఒక్క ప్రభుత్వం వల్లనో అయ్యే పని కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు ప్రతిఒక్కరూ తగిన చర్యలను తీసుకుంటేనే కాలుష్యం అనేది అదుపులోకి వస్తుంది.పర్యావరణానికి హాని కలిగించేది ఏదైనా కాలుష్యమనే చెప్పుకోవచ్చు. మనుషులు భరించలేని ధ్వనులను ధ్వని కాలుష్యం అని, ఫ్యాక్టరీలు, వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలను గాలి కాలుష్యం అని, పరిశ్రమల వ్యర్థ జలాలు, మురుగు నీటిని నదులు, కాలువల్లోకి మళ్లించడం ద్వారా ఏర్పడేదాన్ని నీటి కాలుష్యంగా చెప్పుకోవచ్చు. ప్రజలకు కాలుష్యంపై అవగాహన కల్పించడం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ లక్ష్యం. కాలుష్యం తగ్గినప్పుడు భూమి వేడెక్కకుండా ఉంటుంది. దీంతో అన్ని జీవరాశులు, మానవులు తమ మనుగడను సాగించగలుగుతాయి.రద్దీ నగరాల్లో వాహనాలను సరి-బేసి విధానాలతో నడిపించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, వ్యర్థజలాల నిర్వాహణ తదితర కార్యక్రమాలు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దోహపదపడతాయి. ఇదేవిధంగా ఘన వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్వహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ప్రాజెక్ట్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించవచ్చు.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
కంపు చుట్టూ మా బతుకులు కనువిప్పని ప్రభుత్వాలు
-
ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు
ఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన కాలుష్యానికి తోడు పొగ మంచు అలుముకుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పొగ మంచు ప్రభావంతో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్ -3 టెక్నాలజీ లేని విమానాలపై పొగ మంచు ప్రభావం పడుతోంది. ఢిల్లీ వాయు నాణ్యత 328 పి.ఎం.తో వెరీ పూర్ కేటగిరికి చేరింది. కాలుష్యం, పొగ మంచుతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తెలుత్తుతున్నాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. చలితీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు చేశారు. వృద్ధులు, చిన్నపిల్లలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని పేర్కొన్నారు. CAT III లేని విమానాలు ప్రభావితం కావచ్చని విమానయాన అధికారులు తెలిపారు. సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్‌ను సంప్రదించాలని కోరారు. అసౌకర్యం ఏర్పడనున్న నేపథ్యంలో విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అటు.. పొగ మంచు కారణంగా 30 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదీ చదవండి: నేడు కేంద్ర అఖిలపక్ష భేటీ -
ఢిల్లీ వాసులకు అలర్ట్!
ఢిల్లీ: దేశ రాజధానిలో అనధికార ఎమర్జెన్సీ నడుస్తోంది. కొద్ది రోజులుగా కాలుష్యం ఏమాత్రం తగ్గకపోవడంతో ఢిల్లీ సర్కారు జీఆర్‌ఐపీ-3 నిబంధనలను కఠినతరం చేసింది. కనీసం మార్నింగ్, ఈవెనింగ్ జాగింగ్‌కు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బాణసంచా కాల్చొద్దని హెచ్చరికలు చేసింది. ఢిల్లీలో ఓ వైపు కాలుష్యం తీవ్ర స్థాయిలో కమ్ముకుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ వైపు నుంచి భారీగా పొగ వస్తోంది. మరో వైపు చలి వాతావరణంతో నగరంపై పొగ నిలిచిపోయింది. ఇదే సమయంలో దీపావళి కావడంతో కాలుష్యం వీపరీతంగా పెరిగిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. "బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయొద్దు. దోమలను చంపేందుకు కాయిల్స్, అగరబత్తులు కాల్చొద్దు. కలప, ఆకులు, పంట వ్యర్ధాలు దహనం చేయొద్దు. తరచూ కళ్లను నీటితో శుభ్రం చేసుకోవాలి. గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే వైద్యులను సంప్రదించాలి." అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంతటి స్థాయిలో కాలుష్యం పెరిగిపోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఢిల్లీకి పర్యాటకుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. పాఠశాలలు, విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఆన్ లైన్ క్లాసులు జరుపుతున్నాయి. అవసరం లేకుండా బయట తిరగొద్దని డాక్టర్ల సూచిస్తున్నారు. ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు -
Delhi Pollution: ఆ భారం మాపైకి నెట్టేయకండి
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని నియంత్రించే విషయంలో కోర్టుపైకి భారం నెట్టేసే ప్రయత్నాలు మానుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీలో మళ్లీ సరి–బేసి ట్రాఫిక్ విధానం తేవడంపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, తామెలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని స్పష్టం చేసింది. సరి–బేసి విధానంతో తమకు ఎటువంటి సంబంధం లేదని, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే ట్యాక్సీలకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని తామెన్నడూ తెలపలేదని పేర్కొంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. సరి–బేసి విధానం కాలుష్యాన్ని తగ్గించడంలో అంతగా పనిచేయదని అమికస్ క్యూరీకి చెప్పామని గుర్తు చేసింది. ‘‘మీరేం చేయాలో చెప్పడానికి మేమిక్కడ లేం. ఆ విధానం కొనసాగించొద్దు అని మేం చెప్తే, సుప్రీంకోర్టు ఆదేశించినందువల్లే కాలుష్యం ఎక్కువైందని మీరంటారు’’ అని పేర్కొంది. ఢిల్లీలో వాయు నాణ్యత మెరుగు పడినందున సరి–బేసి విధానం అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. -
ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా చక్కని ఉపాయం
ఢిల్లీ: దేశ రాజధానిలో ప్రజలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీ సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో సమస్య తీవ్రతరమౌతోంది. గాలిలో కాలుష్య స్థాయిలు పెరగడంతో సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని మందలించింది. కాలుష్యాన్ని తగ్గించడానికి వెంటనే ఏదైనా పరిష్కారాన్ని కనుగొనాలను సూచించింది. ఇదే క్రమంలో కాలుష్యాన్ని తగ్గించడానికి చక్కటి పరిష్కారం ఉందని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్(ఎక్స్) లో పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యాన్ని రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానంతో తగ్గించవచ్చని చెప్పారు. " ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానం ఉపయోగపడుతుంది. పంటవ్యర్థాల దహనానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఈ పద్ధతి సూచిస్తుంది. అంతేకాకుండా నేలసారం కూడా పెరుగుతుంది.' అంటూ ఇందుకు సహకరించేవారి పేర్లను కూడా ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. To heal Delhi’s pollution, Regenerative Agriculture MUST be given a chance. It provides a remunerative alternative to stubble burning while simultaneously increasing soil productivity. @VikashAbraham of @naandi_india stands ready to help. Let’s do it! pic.twitter.com/XvMPAghgdQ — anand mahindra (@anandmahindra) November 7, 2023 ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. గాలి పూర్తిగా కలుషితం కావడంతో దేశ రాజధానిలో నవంబర్ 10 వరకు పాఠశాలలకు సెలవులు కూడా ఇచ్చారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 13 నుంచి 20 వరకు వాహనాలకు సరి-భేసి విధానాన్ని కూడా అమలుపరచనుంది. ప్రస్తుతం పంజాబ్‌లో పంట కోతలు అయిపోయి.. ఆ వ్యర్ధాలను దహనం చేసే సమయం కావడం వల్ల ఢిల్లీలో పరిస్థితి తీవ్రతరమౌతోంది. పునరుత్పత్తి వ్యవసాయం(Regenerative Agriculture) : పునరుత్పత్తి వ్యవసాయం అనేది వ్యవసాయం చేసే విధానాల్లో ఓ పద్ధతి. పురుగు మందులు, ఎరువులు, భారీ పనిముట్లు వాడకుండా సాగు చేస్తారు. గ్రీన్ హౌజ్ ఉద్గారాలను తగ్గించే విధానాలను ఎంచుకుంటారు. జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తూ పర్యావరణ అనుకూలంగా వ్యవసాయం చేస్తారు. పంట కోతలను కాల్చివేయకుండా వాటినే ఎరువుగా వాడుకునే విధానాలను అనుసరిస్తారు. ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ పద్ధతినే ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా సూచించారు. ఇదీ చదవండి: కాలుష్యంపై మీకు ఏం పట్టింపు లేదా..? -
ఢిల్లీలో మళ్లీ సరి–బేసి విధానం
న్యూఢిల్లీ: ప్రజారోగ్యానికి గొడ్డలిపెట్టులా మారిన కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో మళ్లీ సరి–బేసి విధానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకూ సరి–బేసి విధానం అమలు చేయనున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం ప్రకటించారు. నవంబర్ 20 తర్వాత ఈ విధానాన్ని పొడిగించే అంశంపై అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వాయు నాణ్యత తగ్గిపోవడం, కాలుష్యం వల్ల చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే 8వ తరగతి వరకూ ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించాలని సూచించారు. బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే పది, పన్నెండో తరగతి విద్యార్థులకు మినహాయింపు ఉంటుందన్నారు. -
ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం
ఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరింది. ఢిల్లీలోని ముంద్ఖా ప్రాంతంలో గురువారం గాలినాణ్యతా ప్రమాణాలు తీవ్ర స్థాయికి చేరాయి. నాణ్యతా ప్రమాణాల సూచీలో అత్యధికంగా 616 పాయింట్లకు పడిపోయిందని అధికారులు తెలిపారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. బుధవారం ఉష్ణోగ్రత అత్యధికంగా 32.7 డిగ్రీలుగా నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ఢిల్లీ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) రాత్రి 7 గంటలకు 357 వద్ద నమోదైంది. దీంతో ఢిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అటవీ శాఖకు హైకోర్టు ఆదేశించింది. కలుషిత గాలి పీల్చడం వల్ల అస్తమా రోగుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యత సూచిలో 0-50 ఉంటే ఆరోగ్యమైన గాలి ఉన్నట్లు, 50-100 ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్లు భావిస్తారు. 101-200 ఉంటే మధ్యస్థంగా, 201-300 పేలవంగా ఉన్నట్లు గణిస్తారు. 301-400 ఉంటే అత్యంత పేలవంగా, 401-500 ఉంటే తీవ్ర స్థాయిలో గాలి నాణ్యతా ప్రమాణాలు ఉన్నట్లు భావిస్తారు. ఇదీ చదవండి: లిక్కర్ కేసులో నేడు ఈడీ ఎదుటకు సీఎం కేజ్రీవాల్ -
పోర్టు పరిసరాల్లో కాలుష్యానికి చెక్
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా విశాఖపట్నం పోర్టు అథారిటీ, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. పోర్టు చైర్మన్ డా.అంగముత్తు గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ రాజశేఖర్‌రెడ్డి ఈ ఒప్పంద పత్రాలపై శనివారం సంతకాలు చేశారు. విశాఖ నగరంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు పోర్టు పరిసర ప్రాంతాలలో గాలి కాలుష్యాన్ని తగ్గించటం, కార్బన్ ఉద్గారాలను నిలువరించడమే ఈ ఎంవోయూ ముఖ్య ఉద్దేశమని చైర్మన్ డా.అంగముత్తు తెలిపారు. ఒప్పందంలో భాగంగా విశాఖపట్నం పోర్టు పరిసరాలలో గ్రీన్ బెల్ట్‌ను అభివృద్ధి చేయడం, పోర్టుకు వెళ్లే ప్రధాన జంక్షన్లలో రోడ్డు డివైడర్ల వద్ద పచ్చదనాన్ని పెంపొందించడం, పోర్టు కార్యాలయాలలో అవసరమైన మేరకు ల్యాండ్ స్కేపింగ్ చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం తదితర పనులను ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చేస్తుందని ఎండీ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. పోర్టు డిప్యూటీ చైర్మన్ దూబే, చీఫ్ ఇంజినీర్ వేణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అసలు పుట్టేవాళ్లే తక్కువ.. మళ్లీ నియంత్రణ గోల ఏంటి?
వాషింగ్టన్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మరోసారి తప్పులో కాలేశారు. బాల్టిమోర్ లోని కొప్పిన్ స్టేట్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనం పొల్యూషన్(కాలుష్యం) తగ్గించుకుంటే భావితరాలు బాగుంటాయని చెప్పడానికి బదులు మనం పాపులేషన్(జనాభా) తగ్గించుకుంటే బాగుంటుందని నోరు జారారు. ఈ ప్రసంగం తాలూకు వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో కమలా హారిస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొప్పిన్ స్టేట్ యూనివర్సిటీ వారు నిర్వహించిన వాతావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(58) ముఖ్య అతిధిగా విచ్చేశారు. అయితే కార్యక్రమం పట్ల కొంచెమైనా అవగాహన లేకుండా హాజరైన ఆమె వైట్ హౌస్ వర్గాలు ఇచ్చిన స్క్రిప్తును యధాతధంగా చదివేశారు. వారిచ్చిన స్క్రిప్టులో మొదట పాపులేషన్ అని రాసి దాన్ని సరిచేస్తూ పక్కన బ్రాకెట్లో మళ్ళీ పొల్యూషన్ అని రాశారు. అయినా కూడా కమలా హారిస్ ప్రసంగ ప్రవాహంలో పొల్యూషన్ కి బదులు పాపులేషన్ అని చదివి కొత్త తలనొప్పని తెచ్చుకున్నారు. ప్రసంగం ఆమె మాటల్లో.. ఎలెక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తూ స్వచ్ఛమైన ఇంధన శక్తిపై పెట్టుబడి పెట్టి "జనాభాను తగ్గిస్తే" భావితరాలు స్వచ్ఛమైన వాయువును పీల్చుకుంటారని, పారిశుద్ధ్యమైన మంచినీరు తాగుతారని అన్నారు. ఇంధన శక్తిపై పెట్టుబడి పెట్టి జనాభాను తగ్గించడమేమిటని అక్కడివారు చాలాసేపు జుట్టు పీక్కున్నారు. చాలాసేపు సస్పెన్స్ తర్వాత గానీ వారికి అర్ధం కాలేదు.. కమలా హారిస్ పొరపాటుగా చదివారని.. ఆమె ఉద్దేశ్యం తగ్గించాల్సింది జనాభాని కాదు కాలుష్యాన్నని. తరవాత వైట్ హౌస్ వర్గాలు ఆమె ప్రసంగానికి సంబంధించిన కాపీని ప్రెస్ కు రిలీజ్ చేశారు. అందులో పాపులేషన్ పదాన్ని కొట్టేసి పొల్యూషన్ అని స్పష్టంగా రాశారు. అలవాటులో పొరపాటుగా ఆమె అదే చదివేశారు. ఇంకేముంది విమర్శకులు వారి అసంతృప్తిని వ్యక్తం చేయడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. అసలు పుట్టేవాళ్లే తక్కువగా ఉంటే.. జనాభా తగ్గించమంటే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా అప్పుడప్పుడూ అర్ధజ్ఞానంతో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. విషయపరిజ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ పదేపదే వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో కూడా ఆమె ఓ సారి కార్మికుల యూనియన్, పౌర హక్కుల నాయకుల సభలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) గురించి ప్రస్తావిస్తూ ఏఐ అంటే అది రెండక్షరాలు, యాంత్రిక సాయంతో అభ్యసించేదని అర్ధం అని చెప్పి తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో అద్భుతం.. తెగిన తలను అతికించారు.. -
ప్రకృతి వనం... ఆక్సి‘జనం’
సాక్షి, మేడ్చల్ జిల్లా: నగరీకరణ శరవేగంగా పెరుగుతోంది. దీంతోపాటే కాలుష్యమూ పెచ్చుమీరుతోంది. దీంతో తలెత్తుతున్న అనారోగ్య సమస్యలతోపాటు ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురవుతున్న మానసిక ఒత్తిళ్లు సరేసరి. వీటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు చక్కటి సాంత్వన కల్పిస్తున్నాయి ప్రకృతి వనం, లంగ్స్ స్పేస్. హరితహారంలో భాగంగా ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌తోసహా శివారు పట్టణాలు, సెమీఅర్బన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే లక్షలాది మొక్కలు నాటిన సర్కారు పల్లె, పట్టణ ప్రకృతి వనాలను పెంచుతోంది. వీటిలో వాకింగ్ పాత్‌లు, చిల్ట్రన్ కార్నర్స్ ఏర్పాటుచేయడంతోపాటు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ప్రత్యేక ఏర్పాటుచేస్తోంది. 80 లక్షల వాహనాలు... ఎన్నో పరిశ్రమలు గ్రేటర్ పరిధిలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. సుమారు 80 లక్షల మేర ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగతో ‘సిటీ’జన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగలబెట్టడంతో కాలుష్య తీవ్రత మరింత పెరుగుతోంది. వీటికితోడు పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి. ఫలితంగా పీల్చే గాలిలో సూక్ష్మధూళికణాలు చేరి సమీప ప్రాంతాల్లోని ప్రజల ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి. ఘనపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాల (పీఎం2.5) మోతాదు 40 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది. పుర, పంచాయతీల్లో వనాలు పుర, పంచాయతీల్లో అర ఎకరం నుంచి 4 ఎకరాల పరిధిలో ప్రకృతి వనాలను ఏర్పాటుచేశారు. గ్రేటర్ శివారు (మేడ్చల్ జిల్లా + రంగారెడ్డి జిల్లా)లోని 29 పురపాలక సంఘాల్లో 595 పట్టణ ప్రకృతి వనాలున్నాయి. వీటిని పురపాలక సంఘాలు నిర్వహిస్తున్నాయి. అలాగే, 619 పంచాయతీల పరిధిలో 946 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ పథకం నిధులు వెచ్చించి ఎకరాకు 2,500 మొక్కల చొప్పున పెంచారు. లంగ్స్ స్పేస్ ఎక్కడెక్కడ? హైదరాబాద్ శివారుల్లో ఏడు అర్బన్ లంగ్స్ స్పేస్లున్నాయి. ►మేడిపల్లి ఫారెస్టు బ్లాకులో 100 ఎకరాల్లో శాంతివనం ►దూలపల్లి ఫారెస్టు బ్లాకులోని ప్రశాంత వనం ►నారపల్లిలోని భాగ్యనగరం నందన వనం ►బహుదూర్‌పల్లి ఫారెస్టు బ్లాకులోని 50 ఎకరాల్లో ►నాగారం ఫారెస్టు బ్లాకులోని 70 ఎకరాల్లో.. ►నారపల్లి–పర్వతాపూర్ ఫారెస్టు బ్లాకులోని 60 ఎకరాల్లో.. ►కండ్లకోయలోని ఆక్సిజన్ పార్కు హైదరాబాద్‌లో ఏడాదికి సగం రోజులకుపైగా కాలుష్యం నమోదవుతున్న ప్రాంతాలు ►బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ మరిన్ని అభివృద్ధి చేస్తాం నగర శివారుల్లో పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, లంగ్స్ స్పేస్‌లను మరింత అభివృద్ధి పరుస్తాం. ఇందుకోసం ప్రభుత్వ భూములను కూడా గుర్తిస్తున్నాం. పెరుగుతున్న జనాభా, నగరీకరణ నేపథ్యంలో వీటి అవసరం ఎంతో ఉంది. పెరుగుతున్న కాలుష్యం కట్టడికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. – డా.ఎస్. హరీశ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ స్వచ్ఛమైన గాలి.. ప్రకృతి వనాలు, లంగ్ స్పేస్‌లు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. కాలుష్యం బారి నుంచి రక్షిస్తున్నాయి. సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్నాం. రోజంతా అక్కడే ఉండాలనిపిస్తుంది. – కె. ఆంజనేయులు, పోచారం గొప్ప ఉపశమనం.. నారపల్లి–పర్వతాపూర్‌లోని 60 ఎకరాల్లో ఉన్న అర్బన్ లంగ్స్ స్పేస్ పిల్లలతోపాటు పెద్దలనూ ఆహ్లాదపరుస్తోంది. నగరానికి సమీపంలో ఉండటం వల్ల ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు వస్తారు. ఆటపాటలతో అందరూ ఆనందంలో మునిగితేలుతారు. –పి. రవికిరణ్, పీర్జాదిగూడ -
వాహనదారులకు అలర్ట్.. ఆ సర్టిఫికెట్ లేకపోతే నో పెట్రోల్, డీజిల్
వాహనాదారులకు ఢిల్లీ ప్రభుత్వం షాకిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ కీలక నిరయం తీసుకుంది. బంకుల్లో పెట్రోల్, డీజిల్ కావాలంటే తప్పనిసరిగా పొల్యూషన్ సర్టిఫికెట్(పీయూసీ) ఉండాలనే నిబంధన విధించింది. వివరాల ప్రకారం.. ఢిల్లీలో ప్రతీ శీతాకాలం గాలి కాలుష్య తీవ్రత బాగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం.. పీయూసీ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది. పీయూసీ సర్టిఫికెట్ లేకుండా బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ను పోయరని స్పష్టం చేసింది. అక్టోబర్ 25 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గోపాల్‌రాయ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 29న పర్యావరణం, రవాణా, ట్రాఫిక్ అధికారులతో సమావేశం సందర్భంగా కాలుష్య నియంత్రణకు ప్రణాళిక, విధివిధానాలను చర్చించినట్టు తెలిపారు. కాగా, పీయూసీ సర్టిఫికెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ తర్వలోనే విడుదలవుతుందని వెల్లడించారు. అంతేకాకుండా అక్టోబర్ 6వ తేదీ నుంచి యాంటీ డస్ట్ క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్కడ నిర్మాణ స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కాలుష్యాన్ని అరికట్టనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో, కాలుష్య నియంత్రణ కొంత మేరకు సాధ్యమవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Vehicle owners will not be provided fuel at petrol pumps in Delhi without showing a valid pollution under control certificate from October 25, Environment Minister Gopal Rai said @AapKaGopalRai #Petrol #Environment https://t.co/yz1zlIw4Sz — The Telegraph (@ttindia) October 1, 2022 -
మార్పును ఎదుర్కొనేలా మారాలి!
వాతావరణ మార్పు సమస్య, కనిపిస్తున్న వాస్తవం. ఇదో అతిపెద్ద ప్రపంచ సమస్య అనేదీ అంతే నిజం. కానీ ఏ ఒక్క దేశమో దీన్ని ఎదుర్కోలేదు. అలాగని ఏ దేశమూ దీన్ని విస్మరించలేదు కూడా! ఈ ఏడాది ఈజిప్టులో జరగనున్న కాప్–27, ఇండోనేసియాలో నిర్వహించనున్న జీ–20 సదస్సులో ఇది చర్చకు రానుంది. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న తరుణంలో ఈ చర్చ ఎటుపోతుందో తెలీదు. అయితే భారత్ మాత్రం తన వాగ్దానం మేరకు 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నాకు చేర్చాల్సి ఉంది. ఈ దీర్ఘకాలిక లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం శిలాజేతర ఇంధనాల ఉత్పత్తిని పెంచడం, పర్యావరణ అనుకూల హైడ్రోజన్ వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రజారవాణా వ్యవస్థను విస్తృతం చేయడం, మెరుగైన డిజైన్ల ద్వారా ఇళ్లల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం లాంటి స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి, వాతావరణ మార్పుల ప్రభావం. పైగా ఇది ఏ ఒక్క దేశానికో సంబంధించిన సమస్య కాదు. అందరి సహకారం లేకపోతే ఏమాత్రం పరిష్కరించలేని సమస్య కూడా. ప్రపంచస్థాయిలో మూకుమ్మడి ప్రయత్నంతోనే గట్టెక్కగల ఈ సమస్య... ఈ ఏడాది ఈజిప్టులో జరగనున్న ‘కాప్–27’ సమావేశాలతోపాటు, నవంబరులో ఇండోనేసియాలో నిర్వహించనున్న జీ–20 సదస్సు సమావేశాల్లోనూ చర్చకురానుంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, అభివృద్ధి చెందిన దేశాలు... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, యూరప్‌లో పెరిగిన గ్యాస్ ధరలు, ద్రవ్యో ల్బణ నియంత్రణ చర్యలు ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయేమో అన్న అందోళనల మధ్య నలుగుతున్న తరుణంలో ఈ ముఖ్యమైన అంశం మళ్లీ చర్చకు రావడం! అమెరికా – చైనాల మధ్య రాజకీయాలు నిత్యం రగులుతూండటం కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఈ పరిస్థి తుల నేపథ్యంలో వాతావరణ మార్పుల సమస్య నుంచి గట్టెక్కేందుకు భారత్ అనుసరించాల్సిన వ్యూహమేమిటి? వైఖరేమిటి? ఇక్కడ రెండు ముఖ్యమైన అంశాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటిది: జీ–20, కాప్–27 సదస్సుల్లో వాతావరణానికి సంబంధించి మన వ్యూహ మేమిటో ఎలా వివరిస్తామన్నది. రెండోది: వాతావరణ మార్పుల నిర్వహణ కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధనిక దేశాలు నిధులివ్వాలన్న అంశంపై మన వైఖరి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించేందుకు భారత్ లక్ష్యాలేమిటన్నది గత ఏడది గ్లాస్గోలో జరిగిన కాప్–26 సదస్సులో ప్రకటించాం. దీని ప్రకారం 2070 నాటికి కర్బన ఉద్గారాలను శూన్య స్థితికి చేర్చాలి. స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలతో ఎక్కువయ్యే కర్బన ఉద్గారాలను 2005 నాటి స్థాయిలో 45 శాతం వరకూ తగ్గిం చాలి. విద్యుదుత్పత్తి మొత్తంలో 2030 నాటికి శిలాజేతర ఇంధనాల ద్వారా జరిగే ఉత్పత్తి (సౌర, పవన) సగం ఉండాలి. 2030 నాటికి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 450 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యం కీలకమైంది. ఈ లక్ష్యాన్ని అందుకునేలా సరఫరా సంబంధిత సమస్యలను అధిగమిం చేందుకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో విద్యుత్తుతో నడిచే వాహనాల వినియోగం పెంచాలి. రైల్వే లైన్ల విద్యు దీకరణ వేగంగా చేపట్టాలి. ఉక్కు, ఎరువులు, పెట్రో రసాయనాల తయారీలో పర్యావరణ అనుకూల హైడ్రోజన్ వాడకాన్ని పెంచాలి. అంతేకాకుండా... మెరుగైన డిజైన్లు, పదార్థాల వాడకంతో భవనాల ద్వారా అయ్యే విద్యుత్తు ఖర్చును (లైట్లు, ఏసీల వంటివి) కూడా తగ్గించాల్సి ఉంటుంది. వీటన్నింటికీ తోడుగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తృతం చేయడం ద్వారా మాత్రమే మనం కాప్–26లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చగలం. విజయం సాధించాలంటే చాలా రంగాల్లో కృషి జరగాలి. కేంద్ర ప్రభుత్వంలోని అనేక మంత్రిత్వ శాఖలు పరస్పర అవగాహనతో ముందుకు సాగాలి. ఈ విషయాల్లో కీలకమైన ప్రైవేట్ రంగం అవస రమూ చాలానే ఉంటుంది. 2070 వరకూ తీసుకోబోయే ప్రతి విధా నాన్ని విడమర్చి చెప్పాల్సిన అవసరం లేకపోయినా, రాగల పదేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో చెప్పడం ద్వారా అంతర్జాతీయ వేదికలపై విశ్వాసం పొందవచ్చు. ఈ వివరాలు యూఎన్ఎఫ్సీసీకి మనమిచ్చే ‘నేషనలీ డిటర్మైండ్ కాంట్రిబ్యూషన్స్’ ప్రణాళికలో లేకున్నా ఫర్వాలేదు. కానీ ఈ పదేళ్ల లక్ష్యాలు దీర్ఘకాలిక లక్ష్యాల సాధన దిశలో సక్రమంగానే ప్రయాణిస్తున్నామా, లేదా? అన్నది తెలుసు కునేందుకు ఉపయోగపడతాయి. ఈ లెక్కన రాగల పదేళ్లలో మనం అందుకోవాల్సిన లక్ష్యాలను ఒక్కటొక్కటిగా చూస్తే: 1) 2070 నాటికి కర్బన ఉద్గారాలను శూన్యస్థితికి తీసుకు రావడమంటే, బొగ్గు వినియోగాన్ని పూర్తిగా పరిహరించడమనే అర్థం. కాబట్టి విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచేందుకు శిలాజేతర ఇంధనా లను మాత్రమే వాడాలి. నిర్మాణంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రా లను పరిగణనలోకి తీసుకుని బొగ్గు పతాక వినియోగం ఎప్పటికన్న అంశంపై నిర్ణయం జరగాలి. దశలవారీగా సుమారు 50 గిగా వాట్ల మేర బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని నిలిపివేయాలి. 2) కర్బన ఉద్గారాలు ఏ రోజుకు పతాక స్థాయికి చేరవచ్చునో కూడా ఒక తేదీ నిర్ణయించుకోవచ్చు. 3) విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందిప్పుడు. సంప్రదా యేతర ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తిని పెంచేందుకు ఇది పెద్ద అవరోధం. డిస్కమ్‌లను ఆదుకునేందుకు నాలుగోసారి ప్రయత్నం జరుగుతోంది. ఇందుకోసం మల్టీ డెవలప్మెంట్ బ్యాంకుల సాయం తీసుకోవచ్చు. దీనివల్ల నియమ నిబంధనల ఏర్పాటు విషయంలో ఆర్థిక సంస్థలకు కొంత స్వాతంత్య్రం ఉంటుంది. ఇది రాష్ట్రాలకు కొంత నమ్మకం కల్పించి పంపిణీ వ్యవస్థలో కొంత భాగాన్ని ప్రైవేట్ పరం చేసేలా ప్రోత్సాహం లభిస్తుంది. 4) సంప్రదాయేతర వనరులు ముడి చమురు మాదిరిగా వాడుకుంటే తరిగిపోయే ఇంధనం కాదు. కాబట్టి మొత్తం విద్యుదు త్పత్తిలో వీటివాటా ఎంత పెరిగితే అంత మేలు. ఇందుకోసం గ్రిడ్ నిర్వహణ, విద్యుత్తు నియంత్రణల్లో ఎన్నో కొత్త ఆవిష్కరణలు జర గాలి. కేంద్రస్థాయి విద్యుత్తు నియంత్రణ సంస్థలు రాష్ట్రస్థాయి సంస్థ లతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. గ్రిడ్ ఫ్లెక్సిబిలిటీ లక్ష్యంగా నియమ నిబంధనల్లో మార్పులకు ప్రాధాన్యం ఇవ్వాలి. 5) పర్యావరణ అనుకూల హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచేందుకు శిలాజ ఇంధనాల స్థానంలో దీన్ని వాడే పరిశ్రమలకు తగిన రాయితీలు కల్పించి సహకారం అందించవచ్చు. 6) 2030 నాటికల్లా కర్బన ఉద్గారాలను శూన్యస్థాయికి చేరుస్తామని భారతీయ రైల్వే ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందుకోసం దేశంలో రైళ్లన్నీ విద్యుత్తుతోనే నడవాల్సి ఉంటుంది. అది కూడా సంప్రదాయేతర, కర్బన ఉద్గారాలుండని పద్ధతుల్లో ఉత్పత్తి చేసే విద్యుత్తును వాడాల్సి ఉంటుంది. అంటే దశలవారీగా ప్రస్తుత డీజిల్ ఇంజిన్లను తొలగిం చడం లేదా విద్యుత్తుతో పనిచేసేలా చేయడం అవసరం. 7) ద్విచక్ర వాహనాలు, కార్లు, త్రిచక్ర వాహనాల్లో విద్యుత్తుతో పనిచేసేవాటి భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు వేటికి అవే ప్రత్యేకంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా బ్యాటరీ ఛార్జింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. స్టేషన్ల ఏర్పాటును వేగ వంతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను ప్రకటించవచ్చు. కార్బన్ న్యూట్రల్ ఆర్థిక వ్యవస్థకు మళ్లేందుకు కావాల్సిన నిధులను సమీకరించడం ఎలా అన్నది ఇప్పటికీ తెగని వివాదం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధనిక దేశాలు సాయం చేస్తాయని యూఎన్ఎఫ్సీసీ చర్చల్లో ఒక అవగాహనైతే కుదిరింది. 2015 నాటి ప్యారిస్ ఒప్పందంలో 2020 నాటికి ఏటా వంద బిలియన్ డాలర్లు ధనిక దేశాలు చెల్లించాలన్న తీర్మానమూ ఉంది. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుంచి రావాల్సిన ఈ మొత్తం ఇప్పటివరకూ అంద లేదు. 2025 నాటికైనా అందేలా చూడాలని గత ఏడాది కాప్ సమా వేశంలో విజ్ఞప్తి చేశారు. కాప్–26లో నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోవాలంటే ధన సహాయం అన్నది కీలకం. కానీ అభివృద్ధి చెందిన జీ–7 దేశాలు ఇప్పటివరకూ నిధుల ఊసెత్తడం లేదు. ఇండో నేసియాలో జరిగే జీ–20 సమావేశాల్లోనైనా దీనిపై ఒక గట్టి నిర్ణయం జరగడం అవసరం. వచ్చే ఏడాది జీ–20 నిర్వహణ బాధ్యతలు భారత్ చేతిలో ఉంటాయి. ఆ తరువాత బ్రెజిల్, దక్షిణాఫ్రికాల వంతు. అభివృద్ధి చెందుతున్న ఈ దేశాల నేతృత్వంలోనైనా ధనిక దేశాలు వాతావరణ మార్పుల సమస్యను అధిగమించేందుకు అవసరమైన నిధులు అందజేస్తాయని ఆశించాలి. నిధుల ఫలితం ఎలా ఉన్నా మన రోడ్‌మ్యాప్ మనం సిద్ధం చేసుకోవాలి. – మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ఉత్కర్ష్ పటేల్ వ్యాసకర్తలు వరుసగా ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ చైర్మన్; ‘సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్’ అసోసియేట్ ఫెలో (‘ద మింట్’ సౌజన్యంతో) -
Pudami Sakshiga:అడవి సృష్టికర్త "దుశర్ల సత్యనారాయణ"
-
కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!
పంచభూతాలపైన అందరికీ సమాన హక్కు, సమాన బాధ్యత ఉండాలి. మనిషి మనుగడకు కీలకమైన గాలి కలుషితమైనాక జీవి మనుగడ ప్రశ్నార్థకమే కదా. శీతాకాలంలో భారతీయ నగరాల్లో జీవించడం ప్రమాదకరం. ఇవాళ ఢిల్లీ వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఇది ఏ ఒక్క నగరానికో సంబంధించిన సమస్య కాదు. గ్లాస్గోలో జరిగిన కాప్ 26 శిఖరాగ్ర సమావేశ నేపథ్యంలో, విషపూరిత వాయు కాలుష్య స్థాయులను నియంత్రించడంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత ఉంది. చైనా, అమెరికా, ఐరోపా కూటమి తర్వాత భారత్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద కార్బన్ డయాక్సైడ్ ఉద్గారకం. 2070 నాటికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను నికర సున్నాకి తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నికర సున్నా ఉద్గారాలు అంటే మానవ నిర్మిత గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలన్నీ వాతా వరణం నుండి తొలగించబడి, తద్వారా భూమి సహజ వాతావరణ సమతుల్యతను తిరిగిపొందడం. యూకే ఆధారిత నాన్–ప్రాఫిట్ క్లీన్ ఎయిర్ ఫండ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రకారం, వాయు కాలుష్యం భారతీయ వ్యాపారాలకు సాలీనా తొంభై ఐదు బిలియన్ డాలర్ల నష్టం చేకూరుస్తోంది. దేశ జీడీపీలో దాదాపు మూడు శాతం వాయు కాలుష్య పర్యవసానాల్ని ఎదుర్కోవడానికి ఖర్చవుతుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా రూపొందాలనే భారతదేశ ఆకాంక్షను ఈ పరిణామాలు అడ్డుకునే ప్రమాదం లేకపోలేదు. (చదవండి: క్రిప్టో కరెన్సీ నియంత్రణకు సమయం ఇదే!) మానవుల శ్రేయస్సు, తద్వారా ఆర్థికవ్యవస్థపై వాయుకాలుష్య ప్రతికూల ప్రభావాల దృష్ట్యా, వాయు కాలుష్య నిర్వహణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎయిర్ క్వాలిటీ సూచిక రెండు వందల ఒకటి నుంచి మూడువందల పాయింట్ల మధ్య ఉంటే ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ వ్యాధీలేని సాధారణ మానవులు సైతం అనారోగ్య సమస్యలుఎదుర్కొనే అవ కాశం ఉంటుంది. మూడువందల పాయింట్లు మించితే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి ఉంటుంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సుమారు ఐదు వందలు పాయింట్లు తాకడం గమనార్హం. ‘శీతాకాల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా ఢిల్లీలో ధూళి నియంత్రణ, పూసా బయో– డికంపోజర్‌ను ఉపయోగించడం, స్మోగ్ టవర్లను ఏర్పాటు చేయడం, గ్రీన్ వార్ రూమ్‌లను బలోపేతం చేయడం, వాహనాల ఉద్గారాలను తనిఖీ చేయడంపై దృష్టి సారించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు కొయ్యకాళ్ళు కాల్చడం వల్ల సమస్య మరింత జఠిల మైంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అక్టో బర్ 24 నుంచి నవంబర్ 8 వరకు ఢిల్లీ కాలుష్య కారకాల్లో సగం వాహనాలే ఉన్నాయని పేర్కొంది. (చదవండి: తీరప్రాంత రక్షణలో మన ఐఎన్ఎస్ విశాఖపట్టణం) ఈ సంవత్సరం కర్ణాటక, ఢిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌ఘఢ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు దీపావళి బాణసంచా పేల్చడంపై ఆంక్షలు విధించాయి. దేశంలోని అన్ని నగరాలు నవంబర్ మాసంలో వాయు కాలుష్య కోరల్లో చిక్కుకొని నివాస యోగ్యం కాని ప్రాంతాలుగా మారుతున్నాయి. పర్యావరణ ప్రమాదాలకు గురయ్యే అవకాశం వున్న నగరాలు మొత్తం ఆసియాలోనే ఉండటం గమనార్హం. వరదలతో సతమతమవుతున్న జకార్తా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది. చెన్నై, ఆగ్రా, కాన్పూర్, జైపూర్, లక్నో, ముంబై వాయు కాలుష్య పరంగా అత్యంత కలుషితమైన నగరాలు. (చదవండి: చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం) పంటవ్యర్థాలతో వాయుకాలుష్యానికి ఆస్కారం లేకుండా ‘టకాచార్’ వంటి యంత్రాల ద్వారా ఉపయో గకరమైన ఇంధనంగా మలచవచ్చు. దీంతో వాయు నాణ్యత, రైతుల ఆదాయం పెరగటమేకాక నిరుద్యో గులకు ఉపాధి దొరకుతుంది. కాలుష్య నియంత్రణ ప్రణాళికకు తోడ్పడే వ్యవస్థీకృత జ్ఞానం అభివృద్ధి చెంద వల్సి వుంది. నాన్–బయోడీగ్రేడబుల్ వ్యర్థాల రీసైక్లింగ్, అప్ సైక్లింగ్‌ను ప్రోత్సహించాలి. బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను బయోగ్యాస్‌గా మార్చడానికి బలమైన కార్యాచరణ కావాలి. కాప్ 26లో ఉద్ఘాటించిన విధంగా 2030 నాటికి భారతదేశం తన శక్తి అవసరాల్లో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చుకోగలిగితే తప్పకుండా వాయు ఉద్గారాలను గణనీయంగా నియంత్రించ గలుగుతుంది. వాయు కాలుష్య నియంత్రణ అనేది ఒక వ్యయం కాదు, దేశ భవిష్యత్తుకు అవసరమైన పెట్టుబడి. – డా. సృజన కత్తి ఐసీఎస్ఎస్ఆర్ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్, పాండిచ్చేరి విశ్వవిద్యాలయం -
గ్లోబల్ ‘వార్నింగ్’! నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి వాటి వల్ల మనకు చాలా ముప్పు అని ఏళ్లుగా వింటునే ఉన్నాం.. నేడు (ఏప్రిల్ 22) ప్రపంచ ధరిత్రీ దినోత్సవం. ఈ సందర్భంగా ఓసారి మన ధరిత్రిపై ఓ లుక్కేద్దామా.. దాని ప్రస్తుత పరిస్థితి ఏంటో తరచి చూద్దామా.. పెనంపై కాల్చినట్లు.. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మొదట్లో కాస్త మెల్లగా మార్పు వచ్చినా.. గత ముప్పై నలభై ఏళ్లుగా వేడి వేగం అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను రికార్డు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి (అంటే సుమారు 250 ఏళ్ల నుంచి) పరిశీలిస్తే.. టాప్–20 అత్యంత వేడి సంవత్సరాల్లో 19 సంవత్సరాలు 2001–2021 మధ్య నమోదైనవే. ఇప్పటివరకూ భూమ్మీద నమోదైన అత్యంత వేడి సంవత్సరంగా 2020 నిలిచింది. 1981 నుంచి సగటున ఏటా 0.18 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. అంతకు ముందటితో పోలిస్తే ఇది రెండింతలు పెరుగుదల. మంచు మరుగుతోంది.. భూమి మీద మంచు కప్పి ఉండే ప్రాంతాల విస్తీర్ణం ఏటా పడిపోతోంది.భూమి ఉత్తర అర్ధభాగంలో మంచు ఏర్పడటం బాగా తగ్గిపోయిందని ఉపగ్రహ పరిశీలనలో గుర్తించారు. నిత్యం మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలో ఏటా 15 వేల కోట్ల టన్నులు, గ్రీన్‌ల్యాండ్‌లో 27,800 కోట్ల టన్నుల మంచు కరిగిపోతోంది. హిమాలయాలు సహా ప్రపంచవ్యాప్తంగా పర్వ తాలపై హిమనీనదాలు వేగంగా తరిగిపోతున్నాయి. సముద్రం పోటెత్తుతోంది.. భూమ్మీద మంచు కరిగిపోతుండటంతో ఏటా సముద్ర జలాల ఎత్తు పెరిగి.. భూభాగం మునిగిపోతోంది. సముద్రాలు 2006 నుంచి సగటున ఏటా 3.6 మిల్లీమీటర్ల మేర ఎత్తు పెరుగుతున్నాయి. అంతకుముందటితో పోలిస్తే ఇది రెండింతలు కావడం గమనార్హం. ఈ శతాబ్దం ముగిసే సమయం అంటే.. 2100 నాటికి సముద్ర జలాలు 35 సెంటీమీటర్లు, అంతకన్నాపైగా పెరుగుతాయని అంచనా. గత శతాబ్దంలో పెరిగింది 20 సెంటీమీటర్లే. నీళ్లు నిప్పులా మండుతున్నాయి.. భూమ్మీద 70 శాతం ఉపరితలం సముద్రాలదే. భూమిపై అదనంగా పెరిగిపోతున్న వేడిలో 90 శాతం వరకు సముద్రాల్లోకి చేరుతోంది. సముద్రాల్లో పైన సుమారు 100 మీటర్ల మేర నీటిపొర గత 40 ఏళ్లలో 0.33 డిగ్రీల సెల్సియస్ వేడెక్కింది. అంతా కార్బన్‌డయాక్సైడే.. వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. 1958 నాటితో పోలిస్తే ఇప్పుడు 25 శాతం ఎక్కువగా ఉంది. 60 ఏళ్లతో పోల్చితే ఏటా కార్బన్ డయాక్సైడ్ పెరిగే శాతం ఇప్పుడు 100 రెట్లు పెరిగింది. సముద్రంపై యాసిడ్ దాడి.. వాతావరణంలో పెరిగిపోతున్న కార్బన్‌డయాౖMð్సడ్‌లో రోజు సగటున 2 కోట్ల టన్నుల మేర సముద్రాలు పీల్చుకుంటున్నాయి. దీనితో సముద్ర జలాల్లో ఆమ్లత్వం పెరిగిపోతోంది. పారిశ్రామిక విప్లవం వచ్చాక అంటే సుమారు గత 70, 80 ఏళ్లలో సముద్ర ఉపరితల జలాల ఆమ్లత్వం (యాసిడిటీ) 30 శాతం పెరిగింది. ఇది అంతకుముందటితో పోలిస్తే 100 రెట్లు ఎక్కువ. దీనివల్ల సముద్ర ప్రాణుల మనుగడపై ప్రభావం పడుతోంది. -
విశాఖలో బీఎస్–6 ఇంధన ఉత్పత్తి
సాక్షి, విశాఖపట్నం: కాలుష్య నియంత్రణకు సంబంధించి విశాఖపట్నం ప్రముఖ పాత్ర పోషించనుంది. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు అవసరమైన భారత్ స్టేజ్–6 (బీఎస్–6) ఇంధనం ఉత్పత్తి చేసేందుకు విశాఖ కేంద్రంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లు విశాఖకు చేరుకున్నాయి. బీఎస్–6 వాహనాలు వినియోగించాలని ఏడాది కిందటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీఎస్–4 వాహనాలతో పోలిస్తే.. బీఎస్–6 వాహనాల నుంచి వచ్చే కాలుష్యం చాలా తక్కువ. బీఎస్–6 పెట్రోల్ వాహనం నుంచి నైట్రోజన్ ఆక్సైడ్ 25 శాతం వరకు తక్కువ వెలువడుతుంది. దీనికి కారణం.. ఆయా వాహనాలకు అనువైన పెట్రోల్ తయారు చేయడమే. బీఎస్–6కి అవసరమైన ఇంధన వనరుల ఉత్పత్తికి విశాఖ కేంద్రం కానుంది. కాలుష్య ఉద్గారాల్ని తగ్గించేలా బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనాలు ఉత్పత్తి చేసే వ్యవస్థకు హెచ్‌పీసీఎల్ కొద్ది రోజుల్లో శ్రీకారం చుట్టనుంది. విశాఖలో హెచ్‌పీసీఎల్ విస్తరణలో ఆధునిక ప్రాజెక్టులో భాగంగా.. బీఎస్–6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేపట్టనుంది. ఇందుకుగాను రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణలో అత్యంత కీలకమైన భారీ రియాక్టర్లు విశాఖకు చేరుకున్నాయి. అత్యంత కీలకమైన మూడు ఎల్సీ మ్యాక్స్ (లుమ్మస్ సిటీస్ మ్యాక్స్) రియాక్టర్లను విశాఖ రిఫైనరీలో ఏర్పాటు చేస్తారు. ఎల్ అండ్ టీ సంస్థ వీటిని తయారుచేసి గుజరాత్లో హెచ్‌పీసీఎల్ ప్రధాన కార్యాలయానికి అప్పగించింది. ఇప్పటికే రెండు రియాక్టర్లను సముద్రమార్గం ద్వారా విశాఖ తీసుకొచ్చారు. త్వరలో మూడో రియాక్టర్ వచ్చిన తరువాత వీటిని అమరుస్తారు. 67.817 మీటర్ల పొడవు, 12.2 మీటర్ల వెడల్పుతో ఉన్న ఒక్కో రియాక్టర్ బరువు 2,105 టన్నులు. ప్రపంచంలోనే అతిపెద్దవైన ఈ మూడు రియాక్టర్లు దేశంలో తొలిసారి ఆర్.యు.ఎఫ్. (రిసిడ్యూ అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ) క్రూడ్ ఆయిల్ నుంచి బీఎస్–6 డీజిల్‌ను తీసేందుకు ఉపయోగపడనున్నాయి. సల్ఫర్ అత్యధికంగా ఉండే ముడి చమురును కూడా.. బీఎస్–6 ప్రమాణాలకు అనువైన అధిక నాణ్యత కలిగిన పెట్రోల్, డీజిల్‌గా మార్చే ప్రక్రియను ఇక్కడ చేపడతారు. త్వరలోనే పనులు ప్రారంభం విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లు హెచ్‌పీసీఎల్‌కు చేరుకున్నాయి. త్వరలో మూడో రియాక్టర్ కూడా రానుంది. వీటి ద్వారా బీఎస్–6 వాహనాలకు అవసరమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేసి.. హెచ్‌పీసీఎల్ మరో ముందడుగు వేయనుంది. చమురు ఉత్పత్తుల్ని మెరుగుపరచడమే కాకుండా ఫీడ్ స్టాక్ పెంచేందుకు కూడా ఈ రియాక్టర్లు ఉపయోగపడతాయి. – రతన్‌రాజ్, హెచ్‌పీసీఎల్ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
ఈ సైకిల్.. స్పీడ్ 80 మైలేజీ 90
సాక్షి, చిత్తూరు: కాలుష్య నివారణకు ఉపయోగపడే ఈ (ఎలక్ట్రిక్ ) బైసైకిల్‌ను సొంతంగా రూపొందించారు చిత్తూరు జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అమర్నాథ్. దామలచెరువు మండలానికి చెందిన కృష్ణమూర్తి, షకీల దంపతుల కుమారుడు అమర్నాథ్ సిక్కిం నీట్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన తను ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు. రూ.80 వేలు వెచ్చించి పర్యావరణహిత ఈ–బైసైకిల్‌ను తయారు చేశారు. దీని వివరాలను అమర్నాథ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. మొదట గేర్ సైకిల్‌ను కొనుగోలు చేసి, గేర్లు తొలగించానన్నారు. ఆన్లైన్లో పలు వెబ్సైట్లు, కంపెనీల నుంచి విడిభాగాలు, బ్యాటరీ కోనుగోలు చేశానన్నారు. మొదటిసారి ప్రయోగం కాబట్టి ఖర్చు ఎక్కువ అయిందని, కంపెనీలు సహకారం అందిస్తే మరింత తక్కువ ధరకే వినియోగదారులకు వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. ఈ బైసైకిల్ ప్రత్యేకతలు.. ►మోటార్‌కు 72 వాట్స్ డీసీ పవర్ చార్జింగ్ కనెక్షన్ ►గంటకు 80 కిలోమీటర్ల వేగం ►రెండు గంటలు చార్జింగ్ చేస్తే 90 కిలోమీటర్లు నడుస్తుంది ►బ్యాటరీ చార్జింగ్ అయిపోతే ఫెడల్ సాయంతో తొక్కే సౌలభ్యం -
కాలుష్య నివారణకు కేజ్రీ నిర్ణయం: స్విచ్ ఢిల్లీ
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత కలుషిత నగరంగా దేశ రాజధాని న్యూఢిల్లీ ఉంటోంది. కాలుష్య నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ‘స్విచ్ ఢిల్లీ’ అనే కొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ఢిల్లీ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్ స్విచ్ ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. బడా కంపెనీలు, స్ధానిక సంక్షేమ సంఘాలు, మార్కెట్ సంఘాలు, మాల్స్, సినిమా హాళ్ల నిర్వాహకులు తమ ప్రాంగణాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. యువత తమ తొలి వాహనంగా ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు. ‘స్విచ్ ఢిల్లీ’ కార్యక్రమంతో ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాలను వివరించనున్నారు. ఈ వాహనాల వాడకంతో కాలుష్యం ఎలా తగ్గుతోందని చెబుతుందని సీఎం అరవింద్ తెలిపారు. పాత పెట్రోల్, డీజిల్ వాహనాల బదులు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని సూచించారు. కాలుష్య రహిత ఢిల్లీ ఏర్పాటుకు సహకరించాలని పిలుపునిచ్చారు. 2020లో ఎలక్ట్రిక్ వాహన విధానం తీసుకురావడంతో ఢిల్లీలో 6 వేల ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజలు కొనుగోలు చేశారని సీఎం కేజ్రీవాల్ వివరించారు. మరింత ప్రోత్సహించేందుకు ఢిల్లీవ్యాప్తంగా 100 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం టెండర్లను జారీ చేసిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ తెలిపారు. आइए प्रदूषण के ख़िलाफ़ एक जंग मिलकर लड़ें, अपने वाहनों को Electric vehicle पर Switch करें। pic.twitter.com/QNLCdDWYHq — Arvind Kejriwal (@ArvindKejriwal) February 4, 2021 -
‘కాలుష్య’ వాహనాలపై కొరడా
సాక్షి, అమరావతి: కాలుష్య నియంత్రణ పాటించని వాహనాలపై కొరడా ఝుళిపించేందుకు రవాణా శాఖ సమాయత్తమైంది. నిబంధనలు, ప్రమాణాలు పాటించని వాహనాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్ కార్డులు సస్పెన్షన్ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు రవాణా అధికారులు రంగంలోకి దిగారు. రవాణా అధికారులు నిర్వహించే పొల్యూషన్ టెస్ట్‌లలో ఫెయిలైయితే వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేయనున్నారు. వాహనాల యజమానులు ఎప్పటికప్పుడు కాలుష్య పరీక్షలు చేయించుకోవాలని రవాణా శాఖ సూచించింది. పొల్యూషన్ పరీక్షలు చేయించి ప్రతి వాహనదారుడు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ పొందాలి. కార్లు, ఇతర వాహనాలకు కార్బన్ మోనాక్సైడ్ 0.3 శాతం, హైడ్రో కార్బన్ 200 పీపీఎంలోపు ఉండాలి. కాలుష్య ఉద్గారాలు ఇంతకు మించి ఉంటే రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది. కాలం చెల్లిన వాహనాలపైనా అధికారులు దృష్టి సారించారు. -
మన గాలి వెరీ'గుడ్'
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు తొలిసారిగా హరిత జోన్ (గ్రీన్‌జోన్)లో స్థానం సంపాదించాయి. నెలకు పైగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గి పలు నగరాలు, పట్టణాల్లో గాలి నాణ్యత పెరిగింది. గతంలో ఏ కాలంలోనైనా (ముఖ్యంగా వేసవిలో) ఈ స్థాయిలో మెరుగైన వాయునాణ్యత రికార్డయిన దాఖలాల్లేవు. లాక్‌డౌన్‌తో వాహనాలు, పరిశ్రమలు, ఇతర త్రా రూపాల్లోని కాలుష్యం తగ్గి పోవడంతో మొదటిసారి రెండు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాలు, పట్టణాలు ‘గ్రీన్‌జోన్’లో స్థానం పొందాయి. హైదరాబాద్, అమరావతి, విశాఖ, రాజమండ్రి వంటి నగరాలు మెరుగైన పాయింట్లు సాధించా యి. తాజాగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన గణాంకాల ప్రకారం.. పలు నగరాల్లో వాయు నాణ్యతలో గణనీయమైన మార్పులొచ్చాయి. గత వర్షాకాలంలో నమోదైన వాయు నాణ్యత స్థాయిలో ఈ నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం గాలి నాణ్యత నమోదైందంటే లాక్డౌన్ ఎంత మార్పు తెచ్చిందో అర్థం చేసుకోవచ్చు. వాయు నాణ్యత 0–50 పాయింట్లుగా ఉంటే దానిని గ్రీన్‌జోన్‌గా పరిగణిస్తారు. దక్షిణాది నగరాలే ‘గుడ్’: లాక్డౌన్ కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు వాయు నాణ్యతసూచీలో ‘గుడ్’ కేటగిరీ సాధించడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల తో పాటు దక్షిణాదిలోని నగరాలు కూడా ఈ కోవలోకే చేరాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో వాయునాణ్యత పరిస్థితి కొంత బాగుపడినా, మొత్తంగా దక్షిణాది నగరాలతో పోలిస్తే ఉత్తరాది నగరాలు ఇంకా మెరుగైన స్థితి సాధించలేదు. దేశవ్యాప్తంగా.. గతేడాది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం బారినపడిన 20 నగరాల్లో మన దేశంలోని 14 నగరాలు నిలవగా, ఇప్పుడు సుదీర్ఘ లాక్‌డౌన్‌తో ఈ పరిస్థితిలో గణనీయ మార్పు వచ్చింది. మునుపెన్నడూ లేనివిధంగా నగరాలు, పట్టణాల్లో ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. న్యూమోనియా వంటి వ్యాధులతో పోరాడేందుకు స్వచ్ఛమైన వాయువు దోహదపడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. గత నెలలో వాయునాణ్యతను పరీక్షించినపుడు దాదాపు సగం నగరాలు మాత్రమే ‘శాటిస్ఫాక్టరి’ కేటగిరీలో ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా 103 నగరాల్లో 90శాతానికి పైగా నగరాల్లో వాయు నాణ్యత మెరుగుపడి, ‘గుడ్’ కేటగిరిలోకి చేరినట్టు సీపీసీబీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నగరాల్లో ‘గాలి’ మారింది.. బుధవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 3.15కి సమీర్ యాప్ ద్వారా ఏక్యూఐ డేటాను సీపీసీబీ అప్డేట్ చేసింది. అందులోని లెక్కల ప్రకారం.. 25 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి టాప్‌లో నిలిచింది. హైదరాబాద్‌లో మొత్తంగా వాయునాణ్యత 47 పాయింట్లుగా నమోదైంది. ఇంకా నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఇక్రిశాట్ కాలనీ వద్ద 38 పాయిం ట్లు, హైదరాబాద్ వర్సిటీ వద్ద 42, ఎర్రగ డ్డ సమీపంలో 46, బొల్లారం ఇండస్ట్రియ ల్ ఏరియా వద్ద 48, శివార్లలోని ముత్తంగి చెరువు సమీపంలో 51, జూ పార్కు వద్ద 55 పాయింట్లుగా వాయునాణ్యత నమోదైంది. దక్షిణాది నగరాలు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బుధవారం నమోదైన వాయు నాణ్యత స్థాయిలివీ.. గాలికీ ఓ లెక్కుంది! వాయు నాణ్యత (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్– ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ‘సమీర్ యాప్’ ద్వారా ఆన్లైన్ లో వెల్లడిస్తుంటుంది. ఏక్యూఐ 50 పాయింట్ల లోపు ఉంటే స్వచ్ఛమైన గాలి ప్రజలకు అందుతున్నట్టు లెక్క. 50 – 100 పాయింట్లు నమోదైతే గాలి నాణ్యతగా ఉన్నట్టు. అంతకుమించి తే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. -
మ.. మ.. మాస్క్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మాస్కులకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు నగరాల్లో కాలుష్యాన్ని తట్టుకునేందుకు, డస్ట్ ఎలర్జీ ఉన్నవారు, సిమెంట్, ఫార్మా కంపెనీల్లో పని చేసేవారు మాత్రమే మాస్కులు వినియోగించేవారు. కానీ, ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స చేసే వైద్యులు, 24 గంటల పాటు గస్తీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, గ్రామం నుంచి పట్టణం దాకా పౌరులందరూ మాస్కులు ధరిస్తున్నారు. ఇందులో అభివృద్ధి చేసిన విధానం, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్‌లను అడ్డుకునే సామర్థ్యాన్ని బట్టి అనేక రకాలు ఉన్నాయి. బెంగళూరుకు చెందిన వర్సో హెల్త్ కేర్.కామ్ అందించిన వివరాల ప్రకారం.. ఏ మాస్క్ దేనిని ఎంత మేర అడ్డుకుంటుందో చూద్దామా..? -
ప్రత్యామ్నాయ పంటలతోనే ఢిల్లీ కాలుష్యానికి చెక్
న్యూఢిల్లీ: గాలి కాలుష్యంతో వారం రోజులుగా ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం ఉత్తర భారతంలో కాలుష్య పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ, పంజాబ్, హరియాణా ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పి.కె. మిశ్రా రెండు రోజులుగా జరిపిన వరుస సమావేశాలనంతరం ప్రధాని మొత్తంగా పరిస్థితుల్ని సమీక్షించారు. శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి పొరుగున ఉన్న పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాలను కాల్చడమే కారణమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో రైన్‌ఫెడ్ ఏరియా అథారిటీ (ఎన్ఆర్ఏఏ), కొన్ని ప్రతిపాదనలు చేసింది. కేవలం వరిపైనే ఆధారపడకుండా వివిధ రకాల ఇతర పంటల్ని పండించడానికి రైతుల్ని మళ్లిస్తే పంట వ్యర్థాల్ని కాల్చడం తగ్గుతుందని ఎన్ఆర్ఏఏ సీఈవో అశోక్ దాల్వాయ్ పేర్కొన్నారు. తద్వారా ఢిల్లీ వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయొచ్చునని తెలిపారు. వరి దేశంలో అన్ని చోట్లా పండుతుందని అలాంటప్పుడు వరి పంటకి బదులు గోధుమ వంటి ఇతర పంటలవైపు రైతుల్ని మళ్లించడానికి ప్రోత్సాహకాల్ని ఇస్తే పంట వ్యర్థాల దహనం తగ్గుతుందని అన్నారు. తక్కువ కాల వ్యవధిలో చేతికొచ్చే వరిలో ఇతర రకాల్ని పండించడానికి రైతులు మొగ్గుచూపేలా చర్యలు తీసుకుంటే సెప్టెంబర్ నాటికల్లా పంట చేతికొస్తుందని, అప్పుడు శీతాకాలంలో పంట వ్యర్థాల్ని కాల్చడమనే సమస్య ఉత్పన్నం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పంట వ్యర్థాల్ని ఎరువులుగా మార్చాలి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగెల్ పంట వ్యర్థాల్ని పొలాల్లో ఎరువులుగా మారిస్తే ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూచించారు. çహరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పంట వ్యర్థాల్ని కాల్చడమనేది కాలుష్యానికి 20 శాతం మాత్రమే కారణమని, వాటిని తగులబెట్టకుండా రైతులకు ప్రత్యామ్నాయాల్ని చూపిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది రైతులకు పంట వ్యర్థాలను నిర్వీర్యం చేసే 15 వేల మిషన్లను ఇప్పటి వరకు పంపిణీ చేశామన్నారు. ఇక పంజాబ్‌లో వరి పంట నుంచి వచ్చే గడ్డిని కాల్చే బదులుగా దానిని సేకరించి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఆవుల మేతకు తరలించాలని అఖిల భారత కిసాన్ యూనియన్ సమన్వయ కర్త యుధ్వీర్ సింగ్ ప్రభుత్వానికి సూచించారు. పెరిగిన వాయు వేగం.. తగ్గిన ఢిల్లీ కాలుష్యం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గాలి వేగం గంటకి 40 కి.మీ.లకు పెరగడంతో కాలుష్యం తగ్గుముఖం పట్టింది. గాలిలో నాణ్యత సూచి మంగళవారం 365 నుంచి మధ్యాహ్నం 331కి తగ్గింది.. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో గ్రేటర్ నోయిడా, ఫరీదాబాద్ గుర్గావ్, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా పరిస్థితి కాస్త మెరుగైంది. ‘పశ్చిమాదిన ఏర్పడిన మహా తుపాను పరిస్థితులు, వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే రెండు మూడు రోజుల్లో వాయవ్య భారతంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీ, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజా»Œ ,æహరియాణా, రాజస్తాన్, యూపీలో ఈదురుగాలులతో వర్షాలు కురవడం వల్ల కాలుష్యం తగ్గే అవకాశం ఉంది’అని వాతావరణ శాఖ తెలిపింది. -
ఇంట్లోనూ సురక్షితంగా లేరు
న్యూఢిల్లీ: ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సుప్రీంకోర్టు మండిపడింది. తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని, వారి ఆయుర్దాయం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలతో కూడిన డివిజన్ ఇలాంటి వాతావరణంలో మనుషులెవరైనా జీవించగలరా అని ప్రశ్నించింది. ప్రజలు ప్రాణాలు కోల్పేయే పరిస్థితి వచ్చినా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరైనది కాదని మండిపడింది. ఇళ్లల్లో సురక్షితంగా లేకపోవడం అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల జీవించే హక్కుని కాలరాసినట్టేనని ఘాటుగా విమర్శించింది. ఈ పరిస్థితి కంటే ఎమర్జెన్సీ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలూ బాధ్యత వహించాలి పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లు పంట వ్యర్థాలను కాల్చడం నిలిపివేయాలని ఆదేశించింది. పంట వ్యర్థాలు తగులబెట్టడమే కాలుష్యానికి కారణమైతే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి గ్రామ పంచాయతీల వరకు అందరూ బాధ్యత వహించాలని పేర్కొంది. బాధ్యత వహించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల గిమ్మిక్కుల మీద ఉన్న శ్రద్ధ మరి దేని మీద లేదని విమర్శించింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో అన్ని రకాల నిర్మాణాలను, కూల్చివేతలను, చెత్తను కాల్చడాన్ని తమ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ నిపుణుల్ని కోర్టులో ప్రవేశపెట్టాలని సుప్రీం ఆదేశంతో కోర్టుకు హాజరైన పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణ మండలి (ఈపీసీఏ) చైర్మన్ భూరేలాల్ పొరుగు రాష్ట్రాల్లో తగలబెడుతున్న పంట వ్యర్థాల కారణంగానే ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోందని ఆయా రాష్ట్రాల ప్రధానకార్యదర్శులని పిలిచి మాట్లాడాలని సూచించారు. నాలుగైదు రోజులతో పోల్చి చూస్తే ఢిల్లీలో కాలుష్యం కాస్తో కూస్తో తగ్గింది. కానీ గాలి నాణ్యత సూచీ మాత్రం తీవ్రస్థాయిలోనే ఉంది. సోమవారం ఉదయం గాలి నాణ్యత సూచి 438కి తగ్గింది. అయినప్పటికీ ఈ కాలుష్యాన్ని తీవ్రంగానే పరిగణించాల్సి ఉంటుంది. కారు పూల్‌లో సీఎం ముఖ్యమంత్రి కేజ్రీవాల్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, కార్మిక మంత్రి గోపాల రాయ్‌తో కలిసి కారు పూల్ విధానంతో ఒకే కారులో సచివాలయానికి వచ్చారు. ఇక ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తన ఇంటి నుంచి సైకిల్‌పై సెక్రటేరియెట్‌కి వచ్చారు. కాగా, బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయ్ గోయెల్ సరిబేసి కార్ల ప్రయాణం నిబంధనల్ని అతిక్రమించారు. సోమవారం సరి సంఖ్యలో ఉన్న కార్లను మాత్రమే బయటకు తీసుకురావాలి. కానీ గోయెల్ బేసి సంఖ్యలో ఉన్న కారులో ప్రయాణించడంతో పోలీసులు ఆయనను ఆపి రూ.4వేల జరిమానా విధించారు. ఈ కార్ల విధానాన్ని తప్పుపట్టిన గోయెల్ ఇదంతా కేజ్రివాల్ చేస్తున్న ఎన్నికల స్టంట్ అని వ్యాఖ్యానించారు. బాబోయ్ ఢిల్లీలో షూటింగ్ ఢిల్లీలో షూటింగ్ చేయడం అత్యంత కష్టంగా మారిందని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కాలుష్యంలో అందరూ ఎలా ఉంటున్నారో ఆలోచిస్తే దడ పుడుతోందన్నారు. ‘వైట్ టైగర్’ షూటింగ్ కోసం ఢిల్లీలో ఉన్నపుడు తన ముఖానికి మాస్క్ ధరించిన ఫొటోని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ముఖం అంతా కప్పి ఉంచే మాస్క్‌లు, ఎయిర్ ప్యూరిఫయర్లు ఉండటంతో మనం బతికిపోయాం. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో నిలువ నీడ లేని వారి పరిస్థితి ఏమిటి ? ఢిల్లీవాసులందరూ సురక్షితంగా ఉండాలని అందరూ ప్రార్థించండి’ అని ప్రియాంక తన పోస్టులో పేర్కొన్నారు. మాస్క్‌తో ప్రియాంక చోప్రా -
పర్యావరణ విధ్వంసాన్ని ఉపేక్షించం
సాక్షి, అమరావతి : పర్యావరణ విధ్వంసాన్ని సహించేది లేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మన పర్యావరణాన్ని, ప్రకృతిని సంరక్షించుకోకపోతే, భవిష్యత్ తరాలు ఎలా బతకగలుగుతాయనే ఆలోచన చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో మనం దేశానికి మార్గదర్శకంగా నిలవాలని, ఇందులో భాగంగా అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్న వివిధ దేశాల్లోని పద్ధతులను అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై నెలలోగా అత్యుత్తమ విధానాలను సూచిస్తూ ప్రతిపాదనలు రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రతిపాదనలకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లులు పెట్టి చట్టం తీసుకు వద్దామని చెప్పారు. దేశానికే మార్గదర్శకంగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ విధానం ఉండాలని స్పష్టీకరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్రంలో అడవుల పెంపకం, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యత సర్కారుదే పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని, ఆ మేరకు గ్రీన్ ట్యాక్స్ విధిస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుత కాలుష్య నియంత్రణ బోర్డు, సంబంధిత వ్యవస్థల్లో సమూల ప్రక్షాళన చేయాలని సూచించారు. విశాఖపట్నం కాలుష్యంతో అల్లాడుతోందని, దీనిని నియంత్రించకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు విశాఖ నగరంలో పెద్దపీట వేయాలని సూచించారు. పరిశ్రమలు ఏమైనా వస్తున్నాయంటే.. రెడ్ కార్పెట్ వేస్తామని, అయితే వాటి నుంచి ఎలాంటి కాలుష్యం వస్తుందనే దానిపై మనం ఆలోచించడం లేదన్నారు. వాతావరణానికి, పర్యావరణానికి ఎలాంటి భంగం కలుగుతుందనే దానిపై దృష్టి పెట్టడం లేదని, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మాత్రమే ఆలోచిస్తున్నామన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ పట్ల సమగ్ర అవగాహన, పరిజ్ఞానం, అంకిత భావం ఉన్న వారు ఈ వ్యవస్థల్లో ఉండాలని చెప్పారు. పరిశ్రమలు నడుపుతున్న వారికి వేధింపులకు గురవుతున్నామనే భావన రానీయకూడదని సూచించారు. ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా ఆలోచించి ఉత్తమ విధానాలను మనం అనుసరించాలని అన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా మొక్కల పంపిణీ గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికీ నాలుగు మొక్కలు పంపిణీ చేయాలని, చెట్లను పెంచడంలో వారి సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు గ్రామ వలంటీర్లందరికీ మొక్కలు అందుబాటులో ఉంచాలన్నారు. మొక్కలను పెంచడానికి కాల్వ గట్లను పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచించారు. అనంతపురం, కడప ప్రాంతాల్లో అడవులను పెంచడంపై దృష్టి సారించాలని, తద్వారా ఆ ప్రాంత నైసర్గిక స్వరూపాన్ని మార్చాల్సిందిగా సీఎం సూచించారు. పంట కాల్వలను కాపాడుకోవాలని, అవి కాలుష్యానికి గురవ్వకుండా నిరోధించాలని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో కాల్వలను పరిరక్షించేందుకు ‘మిషన్ గోదావరి’ పేరుతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. దీనిపై సరైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆక్వా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయాలని.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇ–వేస్ట్ కోసం కాల్ సెంటర్ ఇ–వేస్ట్ కోసం కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. లక్ష టన్నుల వ్యర్థాలు ఫార్మా కంపెనీల నుంచి వస్తే అందులో సుమారు 30 శాతం మాత్రమే శుద్ధి చేస్తున్నారని, మిగతా 70 శాతం వాతావరణంలోకి వదిలేస్తున్నారని సీఎం తెలిపారు. హేచరీ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇచ్చారన్నారు. ఇవాళ ఏపీ నుంచి పెద్ద ఎత్తున సముద్రపు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని, ఇందులో మనం దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హేచరీ జోన్‌గా ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలకు ఎలా అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు. ఫార్మా కంపెనీల కోసం ఇప్పటికే మనం ఫార్మా సిటీలను ఏర్పాటు చేశామని, అక్కడే వాటిని పెట్టుకునేలా వారికి అనుతులు ఇచ్చి ఉండాల్సిందన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, మురుగు నీటి పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని, మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాతే విడిచి పెట్టాలని సూచించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్‌పై ఫ్రెంచి ప్రతినిధి బృందంతో చర్చించానని తెలిపారు. అటవీ శాఖ వద్ద ఉన్న ఎర్ర చందనాన్ని ఏకమొత్తంగా అమ్మే పద్ధతిలో కాకుండా విడతలుగా అమ్మితే ప్రభుత్వానికి మేలు జరుగుతుందని చెప్పారు. వాల్యూ యాడ్ చేసి విక్రయిస్తే ప్రభుత్వానికి మరింత మేలు జరుగుతుందని సూచించారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా చైనా, జపాన్ సంస్థలతో చర్చలు జరపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.