గ్లోబల్‌ ‘వార్నింగ్‌’! నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం | Global Warning: World Earth Day | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ ‘వార్నింగ్‌’! నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

Published Thu, Apr 22 2021 4:07 AM | Last Updated on Thu, Apr 22 2021 4:08 AM

Global Warning: World Earth Day - Sakshi

వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌ ఇలాంటి వాటి వల్ల మనకు చాలా ముప్పు అని ఏళ్లుగా వింటునే ఉన్నాం.. నేడు (ఏప్రిల్‌ 22) ప్రపంచ ధరిత్రీ దినోత్సవం. ఈ సందర్భంగా ఓసారి మన ధరిత్రిపై ఓ లుక్కేద్దామా.. దాని ప్రస్తుత పరిస్థితి ఏంటో తరచి చూద్దామా.. 
పెనంపై కాల్చినట్లు..

  • కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మొదట్లో కాస్త మెల్లగా మార్పు వచ్చినా.. గత ముప్పై నలభై ఏళ్లుగా వేడి వేగం అందుకుంది. 
  • ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను రికార్డు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి 
  • (అంటే సుమారు 250 ఏళ్ల నుంచి) పరిశీలిస్తే.. టాప్‌–20 అత్యంత వేడి సంవత్సరాల్లో 
  • 19 సంవత్సరాలు 2001–2021 మధ్య నమోదైనవే. 
  • ఇప్పటివరకూ భూమ్మీద నమోదైన అత్యంత వేడి సంవత్సరంగా 2020 నిలిచింది. 
  • 1981 నుంచి సగటున ఏటా 0.18 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. అంతకు ముందటితో పోలిస్తే ఇది రెండింతలు పెరుగుదల. 

మంచు మరుగుతోంది..

  • భూమి మీద మంచు కప్పి ఉండే ప్రాంతాల విస్తీర్ణం ఏటా పడిపోతోంది.భూమి ఉత్తర అర్ధభాగంలో మంచు ఏర్పడటం బాగా తగ్గిపోయిందని ఉపగ్రహ పరిశీలనలో గుర్తించారు. 
  • నిత్యం మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలో
  • ఏటా 15 వేల కోట్ల టన్నులు, గ్రీన్‌ల్యాండ్‌లో 27,800 కోట్ల టన్నుల మంచు కరిగిపోతోంది. 
  • హిమాలయాలు సహా ప్రపంచవ్యాప్తంగా పర్వ తాలపై హిమనీనదాలు వేగంగా తరిగిపోతున్నాయి. 

సముద్రం పోటెత్తుతోంది..

  • భూమ్మీద మంచు కరిగిపోతుండటంతో ఏటా సముద్ర జలాల ఎత్తు పెరిగి.. భూభాగం మునిగిపోతోంది. సముద్రాలు 2006 నుంచి సగటున ఏటా 3.6 మిల్లీమీటర్ల మేర ఎత్తు పెరుగుతున్నాయి. అంతకుముందటితో పోలిస్తే ఇది రెండింతలు కావడం గమనార్హం. 
  • ఈ శతాబ్దం ముగిసే సమయం అంటే.. 2100 నాటికి సముద్ర జలాలు 35 సెంటీమీటర్లు, అంతకన్నాపైగా పెరుగుతాయని అంచనా. గత శతాబ్దంలో పెరిగింది 20 సెంటీమీటర్లే. 

నీళ్లు నిప్పులా మండుతున్నాయి..

  • భూమ్మీద 70 శాతం ఉపరితలం సముద్రాలదే. భూమిపై అదనంగా పెరిగిపోతున్న వేడిలో 90 శాతం వరకు సముద్రాల్లోకి చేరుతోంది.  
  • సముద్రాల్లో పైన సుమారు 100 మీటర్ల మేర నీటిపొర గత 40 ఏళ్లలో 0.33 డిగ్రీల సెల్సియస్‌ వేడెక్కింది. 

అంతా కార్బన్‌డయాక్సైడే.. 

  • వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. 1958 నాటితో పోలిస్తే ఇప్పుడు 25 శాతం ఎక్కువగా ఉంది. 
  • 60 ఏళ్లతో పోల్చితే ఏటా కార్బన్‌ డయాక్సైడ్‌ పెరిగే శాతం ఇప్పుడు 100 రెట్లు పెరిగింది. 

సముద్రంపై యాసిడ్‌ దాడి..

  • వాతావరణంలో పెరిగిపోతున్న కార్బన్‌డయాౖMð్సడ్‌లో రోజు సగటున 2 కోట్ల టన్నుల మేర సముద్రాలు పీల్చుకుంటున్నాయి. దీనితో సముద్ర జలాల్లో ఆమ్లత్వం పెరిగిపోతోంది. 
  • పారిశ్రామిక విప్లవం వచ్చాక అంటే సుమారు గత 70, 80 ఏళ్లలో సముద్ర ఉపరితల జలాల ఆమ్లత్వం (యాసిడిటీ) 30 శాతం పెరిగింది. ఇది అంతకుముందటితో పోలిస్తే 100 రెట్లు ఎక్కువ. దీనివల్ల సముద్ర ప్రాణుల మనుగడపై ప్రభావం పడుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement