![National Pollution Control day Observed on December 2nd](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/2/pollution-main.jpg.webp?itok=exgpZIAK)
ఈరోజు (డిసెంబర్ 2) జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. 1984, డిసెంబర్ రెండున జరిగిన భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ, అటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 1984లో యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుండి విడుదలైన విషపూరిత వాయువు వేలాది మంది ప్రాణాలను బలిగొంది.పెరుగుతున్న కాలుష్యం వల్ల కలిగే సమస్యలపై అవగాహన కల్పించేందుకు కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కాలుష్య ఉద్గారాల పెరుగుదల ఒక్క భారతదేశం మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు. ప్రపంచమంతా కాలుష్య నియంత్రణ దిశగా పోరాడుతోంది. కాలుష్య నిర్మూలన అనేది ఏ ఒక్కరి వల్లనో, ఏ ఒక్క ప్రభుత్వం వల్లనో అయ్యే పని కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు ప్రతిఒక్కరూ తగిన చర్యలను తీసుకుంటేనే కాలుష్యం అనేది అదుపులోకి వస్తుంది.
పర్యావరణానికి హాని కలిగించేది ఏదైనా కాలుష్యమనే చెప్పుకోవచ్చు. మనుషులు భరించలేని ధ్వనులను ధ్వని కాలుష్యం అని, ఫ్యాక్టరీలు, వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలను గాలి కాలుష్యం అని, పరిశ్రమల వ్యర్థ జలాలు, మురుగు నీటిని నదులు, కాలువల్లోకి మళ్లించడం ద్వారా ఏర్పడేదాన్ని నీటి కాలుష్యంగా చెప్పుకోవచ్చు. ప్రజలకు కాలుష్యంపై అవగాహన కల్పించడం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ లక్ష్యం. కాలుష్యం తగ్గినప్పుడు భూమి వేడెక్కకుండా ఉంటుంది. దీంతో అన్ని జీవరాశులు, మానవులు తమ మనుగడను సాగించగలుగుతాయి.
రద్దీ నగరాల్లో వాహనాలను సరి-బేసి విధానాలతో నడిపించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, వ్యర్థజలాల నిర్వాహణ తదితర కార్యక్రమాలు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దోహపదపడతాయి. ఇదేవిధంగా ఘన వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్వహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. క్లీన్ డెవలప్‌మెంట్ మెకానిజం ప్రాజెక్ట్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం
Comments
Please login to add a commentAdd a comment