Bhopal Gas case
-
Bhopal Gas Tragedy: ప్రపంచం మరువలేని విషాదమిది..
భోపాల్: 1984, డిసెంబరు 3.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ప్రపంచం మరువలేని విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు నేటికి 40 ఏళ్లు.. ఇన్నేళ్లు దాటినా ఈ దుర్ఘటన ఆనవాళ్లు ఈనాటికీ వెంటాడుతూనే ఉన్నాయి.యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుంచి విషపూరిత వాయువు మిథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) లీక్ అయిన ఘటన భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. ఆ రోజు రాత్రి భోపాల్‌లోని జనం గాఢ నిద్రలో ఉండగా మృత్యువు విషవాయువు రూపంలో రెక్కలు విప్పి, లెక్కలేనంతమందిని కబళించింది. నాటి భయానక దృశ్యాలు నేటికీ చాలామంది కళ్లముందు మెదులుతుంటాయి.ఆ రోజు ఏం జరిగింది?భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ సంస్థలో నాడు పనిచేసిన ఒక అధికారి తన అనుభవాన్ని వివరిస్తూ.. ‘1984, డిసెంబర్ 3 మాకు ఎప్పటిలానే తెల్లారింది. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి, ఫ్యాక్టరీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తున్నాను. ఆ సమయంలో ఫ్యాక్టరీ నుండి విడుదలైన విష వాయువు నగరాన్ని కమ్మేసిందని నాకు తెలియదు. మేం బస్సు కోసం ఎదురుచూస్తుండగా అక్కడున్న ఒక వ్యక్తి.. గ్యాస్ లీక్ అయ్యిందని, దాని వల్ల చాలా మంది చనిపోయారని చెప్పడంతో షాక్ అయ్యాను’ అని తెలిపారు.సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ అనుభవంలో..భోపాల్‌కు చెందిన సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ గోపాల్ జైన్ తన ఇంటికి వచ్చిన ఒక బంధువు చేతిపై హఠాత్తుగా వచ్చిన ఎర్రని వాపును చూసి షాక్ అయ్యారు. పాత భోపాల్ ప్రాంతమంతా పొగతో కమ్ముకుందని ఆ మహిళ అతనికి చెప్పింది. ఉదయం హమీదియా హాస్పిటల్ చుట్టూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో అతనికి జరిగినదేమిటో అర్థం అయ్యింది. నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్న జైన్ మాట్లాడుతూ ‘ఉదయం నేను ఆసుపత్రికి చేరుకున్నప్పుడు, అక్కడి పరిస్థితి భయానకంగా ఉంది. మృతదేహాలు కుప్పలుగా పడివున్నాయి. అక్కడ గుమిగూడిన జనం తమవారి కోసం వెదుకుతున్నారు. యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుండి గ్యాస్ లీక్ అయిన కారణంగా ఈ దారుణం చోటు చేసుకున్నదని తెలిసింది’ అని అన్నారు.నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ దుర్ఘటనలో 5,474 మంది ప్రాణాలు కోల్పోగా, ఐదు లక్షల మందికి పైగా జనం గ్యాస్ విషపూరిత ప్రభావాలకు గురయ్యారు. ఈ ఘటన జరిగి నాలుగు దశాబ్దాలు గడిచినా దాని నాటి గాయం ఇంకా మానలేదు. గ్యాస్ లీకేజీ కారణంగా వేలాది మంది జనం అనారోగ్యం పాలయ్యారు. నాటి విషవాయువు ప్రభావం తరతరాలుగా వెంటాడుతూనే ఉంది. ఇది కూడా చదవండి: లండన్‌లో రేడియో జాకీగా రాణిస్తున్న హైదరాబాదీ -
Pollution Control Day: భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ..
ఈరోజు (డిసెంబర్ 2) జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. 1984, డిసెంబర్ రెండున జరిగిన భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ, అటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 1984లో యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుండి విడుదలైన విషపూరిత వాయువు వేలాది మంది ప్రాణాలను బలిగొంది.పెరుగుతున్న కాలుష్యం వల్ల కలిగే సమస్యలపై అవగాహన కల్పించేందుకు కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కాలుష్య ఉద్గారాల పెరుగుదల ఒక్క భారతదేశం మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు. ప్రపంచమంతా కాలుష్య నియంత్రణ దిశగా పోరాడుతోంది. కాలుష్య నిర్మూలన అనేది ఏ ఒక్కరి వల్లనో, ఏ ఒక్క ప్రభుత్వం వల్లనో అయ్యే పని కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు ప్రతిఒక్కరూ తగిన చర్యలను తీసుకుంటేనే కాలుష్యం అనేది అదుపులోకి వస్తుంది.పర్యావరణానికి హాని కలిగించేది ఏదైనా కాలుష్యమనే చెప్పుకోవచ్చు. మనుషులు భరించలేని ధ్వనులను ధ్వని కాలుష్యం అని, ఫ్యాక్టరీలు, వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలను గాలి కాలుష్యం అని, పరిశ్రమల వ్యర్థ జలాలు, మురుగు నీటిని నదులు, కాలువల్లోకి మళ్లించడం ద్వారా ఏర్పడేదాన్ని నీటి కాలుష్యంగా చెప్పుకోవచ్చు. ప్రజలకు కాలుష్యంపై అవగాహన కల్పించడం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ లక్ష్యం. కాలుష్యం తగ్గినప్పుడు భూమి వేడెక్కకుండా ఉంటుంది. దీంతో అన్ని జీవరాశులు, మానవులు తమ మనుగడను సాగించగలుగుతాయి.రద్దీ నగరాల్లో వాహనాలను సరి-బేసి విధానాలతో నడిపించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, వ్యర్థజలాల నిర్వాహణ తదితర కార్యక్రమాలు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దోహపదపడతాయి. ఇదేవిధంగా ఘన వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్వహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ప్రాజెక్ట్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించవచ్చు.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
గ్యాస్ లీక్ బాధితుల పట్ల శాపంగా మారిన కరోనా
భోపాల్ : భారతదేశ చరిత్రలో పెను విషాద దుర్ఘటనగా నిలిచిన భోపాల్ గ్యాస్ ఉద్ధంతం నేడు కరోనా బాధితుల పట్ల శాపంగా మారింది. కరోనా వైరస్ కారణంగా భోపాల్ గురువారం 12 మంది మృతి చెందారు. అయితే వీరంతా భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులే కావడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని ప్రజల్లో కరోనా లక్షణాలు కనిపించిన వారిని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. తాజా మరణాలపై వైద్య అధికారులు స్పందిస్తూ.. గ్యాస్ బాధితులపై కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా చూపుతోందన్నారు. దీని కారణంగానే 12 మంది మృతిచెందారని నిర్ధారించారు. గ్యాస్ బాధితులు మరణాలకు కరోనానే కారణమని తేల్చి వారుంటున్న ప్రాంతాల్లో కరోనా ప్రబలకుండా ముందుజాగ్రత్తలు చేపట్టారు. (గ్యాస్ లీక్.. కారణం అదే!) నాటి విషవాయువు ఘటన నుంచి బయటపడిన తమ వారిని కరోనా బలి తీసుకుందని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా 1984 డిసెంబర్ 2న భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుమందుల ప్లాంట్‌లో మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీక్ కావడం మూలంగా వేలమంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. లక్షల సంఖ్యలో బాధితులుగా మిగిలారు. వారిలో ఇప్పటికీ చాలామంది చికిత్స పొందుతూనే ఉన్నారు. వారిపై తాజాగా కరోనా ప్రభావం చూపడం అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. (మూడో తరాన్నీ వీడని 35 ఏళ్ల విషాదం.) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సుష్మ వ్యాఖ్యలు అర్థరహితం
రాజీవ్‌కు 30 ఏళ్ల కిందే న్యాయవ్యవస్థ క్లీన్చిట్: రాహుల్ న్యూఢిల్లీ: బోఫోర్స్ స్కాం, భోపాల్ గ్యాస్ కేసుల్లో తన తండ్రి రాజీవ్ గాంధీకి భారత న్యాయవ్యవస్థ 30 ఏళ్ల క్రితమే క్లీన్చిట్ ఇచ్చిందని... బీజేపీ మాత్రం ఆయనపై బురద చల్లడం మానడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ విషయంలో సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి నరేంద్రమోదీ నుంచి దేశాన్ని రక్షించేం దుకు తానున్నానని వ్యాఖ్యానించారు. ఎన్డీయే ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం పార్లమెంటు ఆవరణలో తమ పార్టీ ఎంపీలతో కలసి చేపట్టిన ఆందోళనలో రాహుల్ మాట్లాడారు. ‘‘నల్లధనానికి, రాజకీయ వ్యవస్థకు మధ్య లలిత్ ఒక కీలకమైన లింక్. ఈ నెట్‌వర్క్‌ను సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వసుంధర రాజే కాపాడుతున్నారు’’ అని అన్నారు. లలిత్‌మోదీ అంశంలో ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు. మోదీ దమ్మున్న వ్యక్తి అని తాను భావించానని.. కానీ ఆయనకు దమ్ము లేదని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. భూసేకరణ బిల్లుపైనా పట్టుదలగా ఉన్నట్లు కనిపించి, వెనక్కితిరిగి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్ ఆక్రమిస్తోంది: దేశంలో విద్యాసంస్థలన్నింటినీ తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం గురువారం రాష్ట్రపతి ప్రణబ్‌ను కలసి నిరసన తెలిపింది.