
భోపాల్ : భారతదేశ చరిత్రలో పెను విషాద దుర్ఘటనగా నిలిచిన భోపాల్ గ్యాస్ ఉద్ధంతం నేడు కరోనా బాధితుల పట్ల శాపంగా మారింది. కరోనా వైరస్ కారణంగా భోపాల్ గురువారం 12 మంది మృతి చెందారు. అయితే వీరంతా భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులే కావడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని ప్రజల్లో కరోనా లక్షణాలు కనిపించిన వారిని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. తాజా మరణాలపై వైద్య అధికారులు స్పందిస్తూ.. గ్యాస్ బాధితులపై కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా చూపుతోందన్నారు. దీని కారణంగానే 12 మంది మృతిచెందారని నిర్ధారించారు. గ్యాస్ బాధితులు మరణాలకు కరోనానే కారణమని తేల్చి వారుంటున్న ప్రాంతాల్లో కరోనా ప్రబలకుండా ముందుజాగ్రత్తలు చేపట్టారు. (గ్యాస్ లీక్.. కారణం అదే!)
నాటి విషవాయువు ఘటన నుంచి బయటపడిన తమ వారిని కరోనా బలి తీసుకుందని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా 1984 డిసెంబర్ 2న భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుమందుల ప్లాంట్‌లో మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీక్ కావడం మూలంగా వేలమంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. లక్షల సంఖ్యలో బాధితులుగా మిగిలారు. వారిలో ఇప్పటికీ చాలామంది చికిత్స పొందుతూనే ఉన్నారు. వారిపై తాజాగా కరోనా ప్రభావం చూపడం అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. (మూడో తరాన్నీ వీడని 35 ఏళ్ల విషాదం.)
Comments
Please login to add a commentAdd a comment