సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణ మరిన్ని ప్రాంతాలకు విస్తరించ నుంది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. కేవలం మున్సిపల్ ప్రాంతాలకే కాకుండా ప్రతీ పట్టణ, స్థానిక సంస్థలలో నూ, నోటిఫైడ్ టౌన్‌షిప్ లు, రైల్వే, ఎయిర్‌పోర్ట్, డిఫెన్స్ సంస్థలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలకు కూడా వర్తింపచేస్తూ నిబంధనలను సవరించారు. రాష్ట్రంలో వెలువడే ఘన వ్యర్థాల నిర్వహ ణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అటవీ, పర్యావరణ శాఖ ఆదేశించింది. గతంలోని మున్సిపల్ ఘన వ్యర్థాల (మేనేజ్‌మెంట్, హాండ్లింగ్) నిబంధనలు, 2000ను ఉపసం హరిస్తూ గత ఏప్రిల్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2016ను కేంద్ర పర్యావరణ శాఖ సవరించింది. అందుకు అనుగుణంగా ఈ వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రధానంగా దృష్టి నిలిపారు. ఈ వ్యర్థాలను రికవరీ, రీ యూస్, రీసైకిల్ చేసేందుకు చర్యలు చేపడుతు న్నారు. ఈ నిబంధనల నిర్వహణలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ శాఖలు, స్థానిక సంస్థల యంత్రాంగాలు, కాలుష్య నియంత్రణ మండళ్లకు వేర్వేరు బాధ్యతలను అప్పగించారు.
ఘనవ్యర్థాల సేకరణకు వివిధ స్థాయిల్లో బాధ్యతలు
ఎక్కడి నుంచైతే ఈ వ్యర్థాలు వస్తాయో అక్కడే వాటిని విడదీసి, మూడుస్థాయిల్లో తడి (బయో డీగ్రేడబుల్), పొడి (ప్లాస్టిక్, పేపర్, చెక్క, మెటల్ తదితరాలు), డొమస్టిక్ హాజర్డాస్ వేస్ట్ (డైపర్స్, నాప్‌కిన్స్, ఖాళీ కంటెయినర్లు, తదితరాలు)మూడు విడివిడి బిన్లలో నింపి ఈ వ్యర్థాలను సేకరించే వారికి అందజేయాల్సి ఉంటుంది. ఈ ఘన వ్యర్థా లు ఎక్కడ నుంచి అయితే వస్తాయో దీనికి సంబంధించిన వారు అక్కడే వాటిని పడేయ డం, కాల్చివేయడం లేదా పాతిపెట్టడం, బహిరంగ ప్రదేశాల్లో విసిరేయకుండా, డ్రైనేజీల్లో లేదా పక్కనే ఉన్న నీటి వనరులు, కాలువల్లో పడేయడం వంటివి చేయకుండా జాగ్రత్తలు పాటించాలని నిర్దేశించింది. అయిదువేల చదరపు మీటర్లకు పైబడి ఉన్న అన్ని గేటెడ్ కమ్యూనిటీస్, సంస్థలు , హోటళ్లు, రెస్టారెంట్లు, రెసిడెంట్ వెల్పేర్, మార్కెట్ అసోసియేషన్లు, తదితరాలు ఈ ఘనవ్య ర్థాలను తమ తమ స్థాయిల్లోనే స్థానికసంస్థల సహకారంతో విడదీసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆదేశించింది.
విస్తరించనున్న ఘన వ్యర్థాల నిర్వహణ
Published Wed, Feb 22 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM
Advertisement
Advertisement