సెంట్రల్ యూనివర్సిటి: దేశంలో హరిత భవనాల నిర్మాణమే నినాదంగా మారాలని ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ మనూ సింగ్ తెలిపారు. హైదరాబాద్‌లో 12వ అంతర్జాతీయ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభంకానున్న సందర్భంగా సీఐఐ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మెట్రో రైల్ మనూ సింగ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ బిల్డింగ్ మూమెంట్ యజ్ఞంలా సాగుతుందని తెలిపారు.
అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలు వేగవంతమైన హరిత భవన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. అభివృద్ధికి సూచకంగా హరిత భవనాలు, నిర్మాణాలు నిలుస్తాయని తెలిపారు. వివిధ రంగాలలో అభివృద్ధి సాధించడం ఎంత ముఖ్యమో, హరిత భవనాలను నిర్మించడం అంతే ముఖ్యం అన్నారు. నివాసిత ప్రాంతాలలో విరివిగా చెట్లు నాటడం కాలుష్యాన్ని నివారించడమేనన్నారు. నగరాల్లో గ్రీన్ బిల్డింగ్‌లను నిర్మించడం సవాలుగా మారిందని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. చర్చా కార్యక్రమంలో ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రేమ్ సింగ్ జైన్, గుజరాత్ కాలుష్య నియంత్రయ బోర్డు చైర్మన్ మిస్త్రీ, క్యారియర్ ఇండియా అసిస్టెంట్ డెరైక్టర్ దీరజ్ బద్వా తదితరులు పాల్గొన్నారు.
12వ వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్‌కు వేదికైన హైదరాబాద్...
12వ అంతర్జాతీయ హరిత భవన సదస్సుకు హైదరాబాద్ వేదికైంది. గురువారం నుండి 6వ తేది వరకు కొనసాగే ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 5000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో పలు సమస్యాత్మక అంశాలను చర్చించనున్నారు. సదస్సు మూడు రోజుల పాటు కొనసాగనుంది.
హరిత భవనాల నిర్మాణమే నినాదం కావాలి
Published Thu, Sep 4 2014 1:26 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement