
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో వాహనాల సరి–బేసి విధానాన్ని ఏ ప్రాతిపదికన అమలు చేసేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) అంగీకరించింది. సరి సంఖ్య నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు ఒకరోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు రోడ‍్లపైకి రావచ్చని జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ఎన్జీటీ కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ద్విచక్రవాహనదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు కూడా ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని కోరింది. చెత్తను తీసుకెళ్లే వాహనాలు, అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌లకు మాత్రమే ఈ నిబంధన నుంచి ఎన్‌జీటీ మినహాయింపు ఇచ్చింది. కాలుష్యం లెవల్ 300 దాటితే తప్పనిసరిగా సరి- బేసి విధానం తీసుకురావాలని ఆదేశించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు సరి-బేసి విధానాన్ని అమలు చేయనున్నారు.
కాగా సరి, బేసి విధాన అమలులో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని గ్రీన్ ట్రిబ్యునల్ తలంటింది. 15 ఏళ్లు నిండిన పాత కాలం నాటి వాహనాలను కూడా ప్రభుత్వం రద్దు చేయాలని సూచించింది. నగరాన్ని మింగేస్తున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఈ విధానాన్ని పాటించాల్సిందేనని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment