ఆరు సూత్రాలు | The six principles | Sakshi
Sakshi News home page

ఆరు సూత్రాలు

Published Wed, Jun 10 2015 3:51 AM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

ఆరు సూత్రాలు

ఆరు సూత్రాలు

కాలుష్య నియంత్రణపై కేఎస్‌పీసీబీ మార్గదర్శకాలు
అగ్నిహోత్రంలో ఔషధ మూలికల వినియోగం
మద్యంపై గ్రీన్‌ట్యాక్స్ ఇంధన వాడకంపై పరిమితులు
సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోనున్న  ప్రభుత్వం

 
బెంగళూరు : రోజు రోజుకూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారించే దిశగా కర్ణాటక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (కేఎస్‌పీసీబీ)అడుగులు వేస్తోంది. రాష్ట్ర రాజధానితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే  దిశగా ఓ మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. ఈ మార్గదర్శకాల అమలులోని సాధ్యాసాధ్యాలను చర్చించి ఓ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
ప్రజల అభిప్రాయాల నుంచే...
 ఈ మార్గదర్శకాలను రూపొందించేందుకు ఆరు నెలలుగా కేఎస్‌పీసీబీ ఆధ్వర్యంలో బెంగళూరుతో పాటు హుబ్లీ, మైసూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లో సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశాల్లో కేఎస్‌పీసీబీ అధికారులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు, స్థానికులు ఇలా అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేశారు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ కాలుష్యం నివారణకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి వంటి అంశాలను వారి నుంచే సేకరించారు. ఈ సూచనలు, సలహాలన్నింటినీ క్రోడీకరిసూ కేఎస్‌పీసీబీ ఓ తుది నివేదికను తయా రు చేసింది.

 ప్రధానమైన ఆరు సూచనలు......
 వాతావరణ కాలుష్య నివారణకు ఈ నివేదికలో కేఎస్‌పీసీబీ ప్రధానంగా ఆ రు సూచనలు చేసింది. వాటిలో ‘అగ్నిహోత్ర’, ‘మద్యంపై గ్రీన్‌ట్యాక్స్’, ‘ఇం ధన పరిమితి విధింపు’, ‘రహదారుల పైన నీటి చిలకరింపు’, ‘ప్రభుత్వ ఉ ద్యోగుల విద్యుత్ వినియోగంపై ఆం క్షలు’, ‘తక్కువ మైలేజీ వాహనాలపై ని షేధం’ ప్రధాన మైనవి కాగా మరో 47 సూచనలను నివేదికలో పొందుపరి చారు.

 ఏ సూచన వల్ల ఏఏ ఉపయోగం....
 అగ్నిహోత్ర : ఇది వైదిక కార్యక్రమాల్లో ఒకటిగా చెప్పబడే కార్యక్రమం. అగ్నిహోత్రలో భాగంగా హోమగుండంలో ఔషధ మూలికలను వేసి హోమగుం డాన్ని వెలిగిస్తారు. తద్వారా వచ్చే పొగ ఆయా పరిసరాల్లోని హానికర వాయువులను తొలగిస్తుంది. ఈ కారణంగా స్వచ్ఛమైన గాలి అందుతుంది. అందువల్ల ‘అగ్నిహోత్ర’ను ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘బస్ డే’ తరహాలో నెలకోసారి ప్రభుత్వం తరఫున బెంగళూరుతో పాటు ఇతర ప్రముఖ నగరాల్లో నిర్వహించాల్సిందిగా నివేదికలో పేర్కొంది.

 గ్రీన్‌ట్యాక్స్ : మద్యం, ధూమపానంపై గ్రీన్‌ట్యాక్స్ విధించి, తద్వారా లభించే నిధులను సంప్రదాయేతర విద్యుత్(సౌర, పవన) ఉత్పత్తి చేసే వారికి స బ్సిడీ ఇవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణ చర్యలకు ఈ మొత్తాన్ని ఖర్చుచేయడం.

ఇంధనం వినియోగంపై పరిమితులు : వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని త గ్గించి, ప్రజా రవాణాను పెంచేం దుకు గాను ఇంధనం వినియోగంపై పరిమితులు విధించేందుకు నివేదికలో సూచనలో చేశారు. ఇందులో భాగంగా వ్యక్తిగత వాహనాలకు సంబంధించి కార్లకు నెలకు 100 లీటర్లు, ద్విచక్ర వాహనానికి నెలకు 25 లీటర్ల ఇంధన పరిమితిని విధించాలని సూచించారు.

తక్కువ మైలేజీ వాహనాలపై నిషేధం : 20కిలోమీటర్ల కంటే తక్కువ మైలేజీ ఇచ్చే వాహనాలను బెంగళూరులో నిషేధించాలని సూచనలు చేసింది. తద్వా రా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని త గ్గించేందుకు ఆస్కారం ఉంటుందని పే ర్కొంది.
 
కరెంటు వాడకంలో ఆంక్షలు :
 ఉదయం సమయాల్లో ప్రజా నాయకు లు, ప్రభుత్వ ఉద్యోగుల కార్యాల యా ల్లో ఏసీలు, లైట్‌ల వినియోగాన్ని పూ ర్తిగా నిలిపివేయాలి. తద్వారా వి ద్యుత్ వాడకాన్ని తగ్గించడంతో పాటు ప్రజ లకు మార్గదర్శకులుగా నిలవాలి.

రోడ్లపై నీటి చిలకరింపు : నగరంలోని వేస్ట్ వాటర్‌ని ట్రీట్ చేసి ఆ నీటిని నగరంలోని ప్రధాన రహదారులపై చిలకరిస్తూ ఉండాలి.తద్వారా దుమ్ము, ధూ ళి రేగకుండా ఉండడంతో పాటు భూ తాపం కాస్తంత తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానం ఇప్పటికే జపాన్‌లో అమల్లో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement