Green Tax
-
తెలంగాణలో నవంబర్ నుంచే ‘వాహనాల స్క్రాపింగ్’
సాక్షి, హైదరాబాద్: కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియ నవంబరు మొదటివారంలో ప్రారంభం కానుంది. వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహన తుక్కు విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వాహనాలను తుక్కుగా మార్చే కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందుకోసం ప్రైవేటు కేంద్రాలకు అనుమతి ఇవ్వనున్నారు. పదిహేనేళ్లు దాటిన వాహనాలను తుక్కుగా (స్వచ్ఛంద విధానం) మార్చాల్సి ఉంటుంది. ఇందుకోసం రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.ఈ విధానం కింద తెలంగాణకు మూడు కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. ప్రస్తుతానికి నాలుగు ప్రైవేట్ సంస్థలు దరఖాస్తు చేశాయి. ఆయా కేంద్రాలు కేంద్ర నిబంధనల మేరకు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని తేల్చేందుకు ఇటీవల అధికారులు వాటిని తనిఖీ చేశారు. మరో పది రోజుల్లో వాటిల్లో అనుకూలమైన కేంద్రాలకు పచ్చజెండా ఊపనున్నారు. ఆ వెంటనే వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియ మొదలవుతుంది. కేవలం ఐదుగురు వాహనదారులే ముందుకు..కేంద్ర ప్రభుత్వం 2021లో చట్ట సవరణ చేయగా, దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో స్క్రాపింగ్ విధానం అమలవుతోంది. తుక్కు విధానం ప్రకటించిన ఈ వారం రోజుల్లో తెలంగాణలో కేవలం ఐదుగురు వాహనదారులు మాత్రమే తమ 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు ఆసక్తి చూపారు.చదవండి: 15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైక్‌లదే అగ్రస్థానం.. హైదరాబాద్ జిల్లాలోనే అధికంనిర్బంధం కాకపోవటంతో.. పదిహేనేళ్లు దాటిన వాహనాలకు ఫిట్నెస్ చేయించి గ్రీన్ ట్యాక్స్ చెల్లించి మరో ఐదేళ్లు నడుపుకొనే విధానం అమలవుతోంది. గ్రీన్ ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీంతో చాలా రాష్ట్రాలు స్క్రాపింగ్ విధానంలో దాన్ని కొనసాగిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసిన తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్నే అనుసరించాలని నిర్ణయించి పాలసీలో పొందుపరిచింది. దీంతో కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చటం కంటే గ్రీన్ ట్యాక్స్ చెల్లించి ఐదేళ్లు చొప్పున రెండు దఫాలు అనుమతి పొంది నడుపుకొనేందుకే ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. కేంద్రం ఈ విధానం తెచ్చిన తర్వాత (ఢిల్లీ మినహా) దేశవ్యాప్తంగా కేవలం 44,900 వాహనాలను మాత్రమే తుక్కుగా మార్చారు.అధికారులు అడిగినా స్పందించని ఓ సెంటర్ఓ బడా వాహన తయారీ సంస్థకు నగర శివారులో స్క్రాపింగ్ సెంటర్ ఉంది. వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సెంటర్ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసింది. కానీ ఆ తర్వాత స్పందించటం మానేసింది. దీంతో దరఖాస్తు చేసిన మరో మూడు కేంద్రాల వద్దకు వెళ్లి అక్కడి వసతులను తనిఖీ చేసి వచ్చారు. -
వాహనాల గ్రీన్‌ట్యాక్స్ భారీగా తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు పాత వాహనాలపై కేంద్రం విధించిన హరిత పన్ను (గ్రీన్ ట్యాక్స్)ను రాష్ట్రప్రభుత్వం భారీగా తగ్గించేసింది. వాహనాలు పాతబడేకొద్దీ వాటి నుంచి వెలువడే కాలుష్యం తీవ్రత పెరుగుతుంది. దీంతో పాత వాహనాల వినియోగాన్ని కట్టడి చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్సును విధించిన విషయం తెలిసిందే. 15 సంవత్సరాలు దాటిన భారీ వాహనాలకు గరిష్టంగా రూ.25 వేల వరకు గ్రీన్ ట్యాక్స్ విధిస్తున్నారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సమయంలో లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో మంత్రులు భేటీఅయి, గ్రీన్ ట్యాక్సును ఎత్తేయాలన్న వారి డిమాండ్‌పై చర్చించారు. అత్యంత భారీగా ఉన్న గ్రీన్‌ట్యాక్స్‌ను నామమాత్రపు స్థాయికి తీసుకొస్తామన్నట్టుగా మంత్రులు ఆ భేటీలో హామీ ఇచ్చారు. ఈ మేరకు దాన్ని తగ్గిస్తూ రవాణాశాఖ కొత్త ధరలను అమలులోకి తెచ్చింది. కొత్త ధరలు.. మార్పులు ఇలా.. గతంలో వాహనాల వయసు ఆధారంగా మూడు శ్లాబుల్లో పన్ను విధింపు ఉండేది. ఏడు నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాహనాలకు ఒక త్రైమాసిక పన్నులో సగం మొత్తాన్ని గ్రీన్ టాక్స్‌గా విధించేవారు. 12–15 ఏళ్ల మధ్య ఉన్న వాహనాలకు ఒక త్రైమాసిక పన్నుతో సమంగా విధించేవారు. 15 ఏళ్లు పైబడ్డ వాహనాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు విధించేవారు. ఇప్పుడు ఆ మూడు శ్లాబులను రెండుగా మార్చారు. 7 నుంచి 15 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాహనాలకు రూ.1500, 15 ఏళ్ల పైబడి వయసు ఉన్న వాహనాలకు రూ.3 వేలు పన్ను నిర్ధారించారు. రాష్ట్రంలో ఐదున్నర లక్షల వరకు వాణిజ్యపరమైన వాహనాలున్నాయి. వీటిల్లో 70 శాతం వాహనాలు గ్రీన్‌ట్యాక్స్ చెల్లిస్తున్నాయి. ఇప్పుడు ఆ ట్యాక్సును భారీగా తగ్గించడం పట్ల వాటి యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ, వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాల విషయంలో నిబంధనలను మరీ సరళతరం చేయటం సరికాదంటూ పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. -
లారీలపై తగ్గనున్న గ్రీన్‌ట్యాక్స్
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి దిగుతామని లారీ యజమానుల సంఘం హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం వారి సమస్యలపై దృష్టి సారించింది. కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ వారితో భేటీ అయ్యారు. తాజాగా ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రవాణాశాఖ కమిషనర్ శ్రీనివాసరాజులతో కలసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన గ్రీన్‌ట్యాక్స్‌ను తగ్గించి అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఏడు నుంచి 12 ఏళ్ల మధ్య వాహనాలకు ప్రస్తుతం రూ.6 వేల వరకు విధిస్తున్న గ్రీన్‌ట్యాక్స్‌ను రూ.1,500, 12 ఏళ్లు దాటిన వాహనాలకు గరిష్టంగా రూ.25 వేల వరకు ఉన్న మొత్తాన్ని రూ.3 వేలకు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం తెలిసింది. ఇది తమకు భారంగా ఉన్నందున ఆ పన్నును ఎత్తేయాలని లారీ యజమానుల సంఘం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ పన్నును గరిష్టస్థాయిలో తగ్గిస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్‌ను అమలు చేసేందుకు కూడా హామీ ఇచ్చా రు. లారీలు ఏపీలోకి ప్రవేశించిన ప్రతీసారీ రూ.2 వేలు పన్ను చెల్లించాల్సి వస్తోంది. దానికి బదులు ఏడాదికి ఒకేసారి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ వసూలు చేసి ఎన్నిసార్లయినా వెళ్లివచ్చేందుకు అవకాశం కల్పించాలని ఏళ్లుగా లారీ యజమానులు కోరుతున్న దానిని కొలిక్కి తెస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. లైసెన్సుల సస్పెన్షన్‌పై ఉపశమనం.. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో వెళ్లే లారీలను పట్టుకున్నప్పుడు డ్రైవర్ల లైసెన్సులను నిర్ధారిత కాలానికి సస్పెండ్ చేస్తున్నారు. ఆ సస్పెన్షన్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌కు కూడా సానుకూలత లభించింది. సస్పెన్షన్ బదులు పెనాల్టీ విధించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. తైబజార్లలో లారీవాలాలనుంచి కాంట్రాక్టర్లు వసూలు చేస్తున్న మొత్తం తమకు భారంగా ఉందని, వ్యాపారుల నుంచి వసూలు చేసుకోవాల్సిన మొత్తాన్ని లారీల నుంచి వసూలు చేయటం ఏంటని సంఘం నేతలు ప్రశ్నించారు. ఇసుక క్వారీల్లోని ఇబ్బందులనూ వారి దృష్టికి తెచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు వారికి హామీ ఇచ్చారు. త్వరలో ఉత్తర్వులు విడుదల చేస్తామని కూడా పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సందారెడ్డి, ఉపాధ్యక్షుడు యాదయ్య, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాహనాలపై పెరిగిన గ్రీన్ ట్యాక్స్!
సాక్షి, హైదరాబాద్: వాహనాలపై విధించే హరిత పన్ను (గ్రీన్ ట్యాక్స్)ను ప్రభుత్వం పెంచింది. 15 సంవత్సరాలు దాటిన వాహనాలను వినియోగించ కుండా నిషేధించే దిశలో కేంద్ర ప్రభుత్వం కట్టు దిట్టంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రాలకు కొంతకాలంగా స్పష్టమైన సూచ నలు జారీ చేస్తూ వస్తోంది. పాతబడ్డ వాహనా లను వినియోగించే విషయంలో వాహనదారులను నిరు త్సాహ పరిచేలా హరితపన్నును భారీగా పెంచాలని సూచించింది. ఈ క్రమంలోనే తెలం గాణ ప్రభు త్వం హరిత పన్నును పెంచుతూ నిర్ణ యం తీసు కుంది. గతంలో 15 ఏళ్ల జీవితకాలం దాటిన వాహ నాలకు నామమాత్రంగా గ్రీన్‌ట్యాక్స్ ఉండేది. ఇప్పు డు దాన్ని శ్లాబులుగా మార్చి పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 7 నుంచి 10 ఏళ్లు, 10 నుంచి 12 ఏళ్లు, 12 ఏళ్లు దాటినవి.. ఇలా 3 శ్లాబుల్లో 3 రకాల పన్నులను విధిస్తోంది. ఈ విషయంలో రవాణా వాహనాల పన్నులను భారీగా పెంచింది. శ్లాబు లవారీగా ఆ మొత్తం రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు విధించినట్టు సమాచారం. ఇంతకాలం గ్రీన్ ట్యాక్స్ నామమాత్రంగా ఉండగా, ఇప్పుడది కూడా భారీగా పెరిగింది. కానీ ఈ వివరాలను అధికారికంగా వెల్లడించకుండా రవాణాశాఖ గోప్యంగా ఉంచింది. దీనికి సంబంధించిన ఉత్తర్వును కూడా ఆన్లైన్లో పొందుపరచకుండా జాగ్రత్త పడింది. ఇప్పటికే జీవితకాల పన్ను పెంపు ఇటీవల వాహనాల జీవితకాలపు పన్నును పెంచిన ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్‌ను పెంచటం విశేషం. లైఫ్ ట్యాక్స్ పెంచటం ద్వారా ఏడాదిలో రూ.1,300 కోట్ల మేర అదనపు రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ పన్ను ద్వారా మొత్తం రూ.4,200 కోట్ల వార్షికాదాయం వస్తుందని భావిస్తున్నారు. లైఫ్ ట్యాక్స్‌కు సంబంధించి ఏడో తేదీనే ఉత్తర్వు విడుదల చేసి సోమవారం నుంచి అమలులోకి తెచ్చింది. అధికారికంగా ప్రకటించకుం డానే పన్ను పెంచటంపట్ల వాహనదారుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో గ్రీన్ట్యాక్స్కు సంబంధించిన ఉత్తర్వు కూడా వెల్లడించకుండా గోప్యత పాటించటం విశేషం. 25 శాతం పెరిగిన త్రైమాసిక పన్ను.. పర్మిట్లతో నడిచే వాహనాల త్రైమాసిక పన్నును కూడా రవాణాశాఖ భారీగా పెంచింది. ఏకంగా 25% మేర పెంచింది. ఈ త్రైమాసికం నుంచే అది అమలులోకి వచ్చినట్టయింది. -
పాతబండిపై ఇక కొత్త బాదుడు!
హైదరాబాద్: పాత బండ్లపై కొత్త బాదుడుకు రంగం సిద్ధమవుతోంది. పదిహేనేళ్లు దాటిన వాహనాలను మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకొంటే భారీగా హరితపన్ను చెల్లించాల్సిందే. దీనికిగాను అధికారులు త్వరలో విధివిధానాలను ఖరారు చేయనున్నారు. వాహనాల జీవితకాల పన్నులో ఇది మూడోవంతు వరకు ఉండొచ్చని తెలుస్తోంది. వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు, కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు కేంద్రం ప్రత్యేక పాలసీని తెచ్చింది. స్వచ్ఛందంగా వదులుకొనేవారికి కొత్త వాహనాలపై రాయితీ ఇస్తూనే పాతవాటిని పునరుద్ధరించుకొనేవారికి భారీగా వడ్డించనున్నారు. మొదటి దశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను స్క్రాప్ చేస్తారు. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు. రెండోదశలో రవాణా, వ్యక్తిగత వాహనాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. ఏడాదికోసారి హరితపన్ను చెల్లించి రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్లో 2006 నుంచే హరితపన్ను పాత వాహనాలపై గ్రేటర్లో 2006 నుంచే హరితపన్ను వసూలు చేస్తున్నారు. వాహనాల రద్దీని, కాలుష్యాన్ని తగ్గించేందుకు భూరేలాల్ కమిటీ సిఫారసుల మేరకు రవాణాశాఖ ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు రూ. 250–350 వరకు గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి చాలా మంది బండ్లను పునరుద్ధరించుకుంటున్నారు. అయితే ఇది వ్యక్తిగత వాహనాల జీవితకాల పన్నులో మూడోవంతు వరకు విధించడం వల్ల వాహన ధరల శ్రేణికి అనుగుణంగా కనిష్టంగా రూ. 6 వేల నుంచి రూ. లక్ష వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో గ్రీన్‌ట్యాక్స్ విధానాన్నే కేంద్రం దేశమంతా అమలు చేయాలనుకుంటోంది. గ్రేటర్లో 14 లక్షలపైనే... జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 60 లక్షల వరకు వాహనాలు ఉన్నాయి. ఏటా సుమారు 2 లక్షల వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి. వ్యక్తిగత వాహనాలు విస్ఫోటన స్థాయికి చేరుకోగా, ప్రజారవాణా వాహనాల వినియోగం తగ్గుముఖం పడుతోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సుమారు 23 లక్షల మేర కాలం చెల్లిన వాహనాలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల పరిధిలో 14 లక్షల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
పర్యావరణ విధ్వంసాన్ని ఉపేక్షించం
సాక్షి, అమరావతి : పర్యావరణ విధ్వంసాన్ని సహించేది లేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మన పర్యావరణాన్ని, ప్రకృతిని సంరక్షించుకోకపోతే, భవిష్యత్ తరాలు ఎలా బతకగలుగుతాయనే ఆలోచన చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో మనం దేశానికి మార్గదర్శకంగా నిలవాలని, ఇందులో భాగంగా అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్న వివిధ దేశాల్లోని పద్ధతులను అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై నెలలోగా అత్యుత్తమ విధానాలను సూచిస్తూ ప్రతిపాదనలు రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రతిపాదనలకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లులు పెట్టి చట్టం తీసుకు వద్దామని చెప్పారు. దేశానికే మార్గదర్శకంగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ విధానం ఉండాలని స్పష్టీకరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్రంలో అడవుల పెంపకం, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యత సర్కారుదే పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని, ఆ మేరకు గ్రీన్ ట్యాక్స్ విధిస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుత కాలుష్య నియంత్రణ బోర్డు, సంబంధిత వ్యవస్థల్లో సమూల ప్రక్షాళన చేయాలని సూచించారు. విశాఖపట్నం కాలుష్యంతో అల్లాడుతోందని, దీనిని నియంత్రించకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు విశాఖ నగరంలో పెద్దపీట వేయాలని సూచించారు. పరిశ్రమలు ఏమైనా వస్తున్నాయంటే.. రెడ్ కార్పెట్ వేస్తామని, అయితే వాటి నుంచి ఎలాంటి కాలుష్యం వస్తుందనే దానిపై మనం ఆలోచించడం లేదన్నారు. వాతావరణానికి, పర్యావరణానికి ఎలాంటి భంగం కలుగుతుందనే దానిపై దృష్టి పెట్టడం లేదని, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మాత్రమే ఆలోచిస్తున్నామన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ పట్ల సమగ్ర అవగాహన, పరిజ్ఞానం, అంకిత భావం ఉన్న వారు ఈ వ్యవస్థల్లో ఉండాలని చెప్పారు. పరిశ్రమలు నడుపుతున్న వారికి వేధింపులకు గురవుతున్నామనే భావన రానీయకూడదని సూచించారు. ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా ఆలోచించి ఉత్తమ విధానాలను మనం అనుసరించాలని అన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా మొక్కల పంపిణీ గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికీ నాలుగు మొక్కలు పంపిణీ చేయాలని, చెట్లను పెంచడంలో వారి సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు గ్రామ వలంటీర్లందరికీ మొక్కలు అందుబాటులో ఉంచాలన్నారు. మొక్కలను పెంచడానికి కాల్వ గట్లను పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచించారు. అనంతపురం, కడప ప్రాంతాల్లో అడవులను పెంచడంపై దృష్టి సారించాలని, తద్వారా ఆ ప్రాంత నైసర్గిక స్వరూపాన్ని మార్చాల్సిందిగా సీఎం సూచించారు. పంట కాల్వలను కాపాడుకోవాలని, అవి కాలుష్యానికి గురవ్వకుండా నిరోధించాలని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో కాల్వలను పరిరక్షించేందుకు ‘మిషన్ గోదావరి’ పేరుతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. దీనిపై సరైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆక్వా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయాలని.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇ–వేస్ట్ కోసం కాల్ సెంటర్ ఇ–వేస్ట్ కోసం కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. లక్ష టన్నుల వ్యర్థాలు ఫార్మా కంపెనీల నుంచి వస్తే అందులో సుమారు 30 శాతం మాత్రమే శుద్ధి చేస్తున్నారని, మిగతా 70 శాతం వాతావరణంలోకి వదిలేస్తున్నారని సీఎం తెలిపారు. హేచరీ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇచ్చారన్నారు. ఇవాళ ఏపీ నుంచి పెద్ద ఎత్తున సముద్రపు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని, ఇందులో మనం దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హేచరీ జోన్‌గా ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలకు ఎలా అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు. ఫార్మా కంపెనీల కోసం ఇప్పటికే మనం ఫార్మా సిటీలను ఏర్పాటు చేశామని, అక్కడే వాటిని పెట్టుకునేలా వారికి అనుతులు ఇచ్చి ఉండాల్సిందన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, మురుగు నీటి పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని, మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాతే విడిచి పెట్టాలని సూచించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్‌పై ఫ్రెంచి ప్రతినిధి బృందంతో చర్చించానని తెలిపారు. అటవీ శాఖ వద్ద ఉన్న ఎర్ర చందనాన్ని ఏకమొత్తంగా అమ్మే పద్ధతిలో కాకుండా విడతలుగా అమ్మితే ప్రభుత్వానికి మేలు జరుగుతుందని చెప్పారు. వాల్యూ యాడ్ చేసి విక్రయిస్తే ప్రభుత్వానికి మరింత మేలు జరుగుతుందని సూచించారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా చైనా, జపాన్ సంస్థలతో చర్చలు జరపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
డీజిల్ వాహనాలపై 30 శాతం గ్రీన్ టాక్స్ ?
న్యూఢిల్లీ: డీజిల్ వాహనాలతో ముంచుకొస్తున్న ముప్పును నివారించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. డీజిల్ ఉద్గారాలు మోగిస్తున్న డేంజర్ బెల్స్ పై పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ (ఈపీసీఎ) అప్రమత్తమైంది. ఈ క్రమంలో డీజిల్ వాహనాలపై 30 శాతం గ్రీన్ టాక్స్ విధించే ప్రతిపాదనను సుప్రీంకోర్టుముందు ఉంచనుంది. డీజిల్ వాహనాలను నియంత్రించే లక్ష్యంతో సుప్రీం కోర్టు లో ఏప్రిల్ 30 న ఒక రోజంతా విచారణ సాగనుంది. ఈ నేపథ్యంలోనే ఈపీసీఎ ఈ తాజా ప్రతిపాదను చేయనున్నట్టు సమాచారం. సెంటర్ ఫర్ సైన్స్అండ్ ఎన్వైరాన్ మెంట్ సెంటర్ ( సీఎస్ సీ) మంగళవారం డీజిల్ ఉద్గార సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ సూచన చేసింది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్లీన్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రతినిధి రే మింజారేస్ 'డీజిల్ ఉద్గారాలు- తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలు' అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా డీజల్ యొక్క ఆరోగ్య ప్రభావాలపై కెనడా ప్రభుత్వం ఈ ఏడాది విడుదల చేసిన నివేదిక సహా మూడు నివేదికలను వివరించారు. డీజల్ కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, తీవ్ర శ్వాసకోశ సమస్యలు, హృద్రోగ సమ్యలతో పాటుగా రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని నివేదించారు. ఈ సమస్యపై కెనడా, అమెరికా ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాని తెలిపారు. ఈ రిపోర్టును సుప్రీం ముందుంచాలని ఆయన సూచించారు. మార్చి 2016లో భారత ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ నిర్వహించిన పరీక్షల్లో దాదాపు లక్షన్నర డీజిల్ కార్లు అత్యధిక కార్బన్ ఉద్గారాలను కలిగివున్నట్టు తేలిందని ఐసిసీటీ మరో అధికారి ఫాంటా తెలిపారు. ఇండియాలో ప్రస్తుతం ఉన్న విధానాన్ని సమీక్షించాలని, ఉద్గార ప్రమాణాలపై కచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. కాగా పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు 2016-17 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఎల్పీజీ, సీఎన్జీ కార్లపై 1 శాతం, డీజిల్ కార్లపై 2.5 శాతం, విలాసవంతమైన కార్లు, ఎస్‌యూవీలపై 4 శాతం పన్ను,పదిలక్షల విలువదాటిన కార్లపై1 శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే. మరి ఈపీసీఎ సూచనలపై సుప్రీం ఎలా స్పందించనుందో వేచి చూడాలి. -
ఆరు సూత్రాలు
కాలుష్య నియంత్రణపై కేఎస్‌పీసీబీ మార్గదర్శకాలు అగ్నిహోత్రంలో ఔషధ మూలికల వినియోగం మద్యంపై గ్రీన్‌ట్యాక్స్ ఇంధన వాడకంపై పరిమితులు సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం బెంగళూరు : రోజు రోజుకూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారించే దిశగా కర్ణాటక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (కేఎస్‌పీసీబీ)అడుగులు వేస్తోంది. రాష్ట్ర రాజధానితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఓ మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. ఈ మార్గదర్శకాల అమలులోని సాధ్యాసాధ్యాలను చర్చించి ఓ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రజల అభిప్రాయాల నుంచే... ఈ మార్గదర్శకాలను రూపొందించేందుకు ఆరు నెలలుగా కేఎస్‌పీసీబీ ఆధ్వర్యంలో బెంగళూరుతో పాటు హుబ్లీ, మైసూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లో సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశాల్లో కేఎస్‌పీసీబీ అధికారులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు, స్థానికులు ఇలా అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేశారు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ కాలుష్యం నివారణకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి వంటి అంశాలను వారి నుంచే సేకరించారు. ఈ సూచనలు, సలహాలన్నింటినీ క్రోడీకరిసూ కేఎస్‌పీసీబీ ఓ తుది నివేదికను తయా రు చేసింది. ప్రధానమైన ఆరు సూచనలు...... వాతావరణ కాలుష్య నివారణకు ఈ నివేదికలో కేఎస్‌పీసీబీ ప్రధానంగా ఆ రు సూచనలు చేసింది. వాటిలో ‘అగ్నిహోత్ర’, ‘మద్యంపై గ్రీన్‌ట్యాక్స్’, ‘ఇం ధన పరిమితి విధింపు’, ‘రహదారుల పైన నీటి చిలకరింపు’, ‘ప్రభుత్వ ఉ ద్యోగుల విద్యుత్ వినియోగంపై ఆం క్షలు’, ‘తక్కువ మైలేజీ వాహనాలపై ని షేధం’ ప్రధాన మైనవి కాగా మరో 47 సూచనలను నివేదికలో పొందుపరి చారు. ఏ సూచన వల్ల ఏఏ ఉపయోగం.... అగ్నిహోత్ర : ఇది వైదిక కార్యక్రమాల్లో ఒకటిగా చెప్పబడే కార్యక్రమం. అగ్నిహోత్రలో భాగంగా హోమగుండంలో ఔషధ మూలికలను వేసి హోమగుం డాన్ని వెలిగిస్తారు. తద్వారా వచ్చే పొగ ఆయా పరిసరాల్లోని హానికర వాయువులను తొలగిస్తుంది. ఈ కారణంగా స్వచ్ఛమైన గాలి అందుతుంది. అందువల్ల ‘అగ్నిహోత్ర’ను ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘బస్ డే’ తరహాలో నెలకోసారి ప్రభుత్వం తరఫున బెంగళూరుతో పాటు ఇతర ప్రముఖ నగరాల్లో నిర్వహించాల్సిందిగా నివేదికలో పేర్కొంది. గ్రీన్‌ట్యాక్స్ : మద్యం, ధూమపానంపై గ్రీన్‌ట్యాక్స్ విధించి, తద్వారా లభించే నిధులను సంప్రదాయేతర విద్యుత్(సౌర, పవన) ఉత్పత్తి చేసే వారికి స బ్సిడీ ఇవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణ చర్యలకు ఈ మొత్తాన్ని ఖర్చుచేయడం. ఇంధనం వినియోగంపై పరిమితులు : వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని త గ్గించి, ప్రజా రవాణాను పెంచేం దుకు గాను ఇంధనం వినియోగంపై పరిమితులు విధించేందుకు నివేదికలో సూచనలో చేశారు. ఇందులో భాగంగా వ్యక్తిగత వాహనాలకు సంబంధించి కార్లకు నెలకు 100 లీటర్లు, ద్విచక్ర వాహనానికి నెలకు 25 లీటర్ల ఇంధన పరిమితిని విధించాలని సూచించారు. తక్కువ మైలేజీ వాహనాలపై నిషేధం : 20కిలోమీటర్ల కంటే తక్కువ మైలేజీ ఇచ్చే వాహనాలను బెంగళూరులో నిషేధించాలని సూచనలు చేసింది. తద్వా రా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని త గ్గించేందుకు ఆస్కారం ఉంటుందని పే ర్కొంది. కరెంటు వాడకంలో ఆంక్షలు : ఉదయం సమయాల్లో ప్రజా నాయకు లు, ప్రభుత్వ ఉద్యోగుల కార్యాల యా ల్లో ఏసీలు, లైట్ల వినియోగాన్ని పూ ర్తిగా నిలిపివేయాలి. తద్వారా వి ద్యుత్ వాడకాన్ని తగ్గించడంతో పాటు ప్రజ లకు మార్గదర్శకులుగా నిలవాలి. రోడ్లపై నీటి చిలకరింపు : నగరంలోని వేస్ట్ వాటర్‌ని ట్రీట్ చేసి ఆ నీటిని నగరంలోని ప్రధాన రహదారులపై చిలకరిస్తూ ఉండాలి.తద్వారా దుమ్ము, ధూ ళి రేగకుండా ఉండడంతో పాటు భూ తాపం కాస్తంత తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానం ఇప్పటికే జపాన్‌లో అమల్లో ఉంది.