సాక్షి, హైదరాబాద్: వాహనాలపై విధించే హరిత పన్ను (గ్రీన్ ట్యాక్స్)ను ప్రభుత్వం పెంచింది. 15 సంవత్సరాలు దాటిన వాహనాలను వినియోగించ కుండా నిషేధించే దిశలో కేంద్ర ప్రభుత్వం కట్టు దిట్టంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రాలకు కొంతకాలంగా స్పష్టమైన సూచ నలు జారీ చేస్తూ వస్తోంది. పాతబడ్డ వాహనా లను వినియోగించే విషయంలో వాహనదారులను నిరు త్సాహ పరిచేలా హరితపన్నును భారీగా పెంచాలని సూచించింది.
ఈ క్రమంలోనే తెలం గాణ ప్రభు త్వం హరిత పన్నును పెంచుతూ నిర్ణ యం తీసు కుంది. గతంలో 15 ఏళ్ల జీవితకాలం దాటిన వాహ నాలకు నామమాత్రంగా గ్రీన్‌ట్యాక్స్ ఉండేది. ఇప్పు డు దాన్ని శ్లాబులుగా మార్చి పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 7 నుంచి 10 ఏళ్లు, 10 నుంచి 12 ఏళ్లు, 12 ఏళ్లు దాటినవి.. ఇలా 3 శ్లాబుల్లో 3 రకాల పన్నులను విధిస్తోంది.
ఈ విషయంలో రవాణా వాహనాల పన్నులను భారీగా పెంచింది. శ్లాబు లవారీగా ఆ మొత్తం రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు విధించినట్టు సమాచారం. ఇంతకాలం గ్రీన్ ట్యాక్స్ నామమాత్రంగా ఉండగా, ఇప్పుడది కూడా భారీగా పెరిగింది. కానీ ఈ వివరాలను అధికారికంగా వెల్లడించకుండా రవాణాశాఖ గోప్యంగా ఉంచింది. దీనికి సంబంధించిన ఉత్తర్వును కూడా ఆన్‌లైన్‌లో పొందుపరచకుండా జాగ్రత్త పడింది.
ఇప్పటికే జీవితకాల పన్ను పెంపు
ఇటీవల వాహనాల జీవితకాలపు పన్నును పెంచిన ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్‌ను పెంచటం విశేషం. లైఫ్ ట్యాక్స్ పెంచటం ద్వారా ఏడాదిలో రూ.1,300 కోట్ల మేర అదనపు రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ పన్ను ద్వారా మొత్తం రూ.4,200 కోట్ల వార్షికాదాయం వస్తుందని భావిస్తున్నారు.
లైఫ్ ట్యాక్స్‌కు సంబంధించి ఏడో తేదీనే ఉత్తర్వు విడుదల చేసి సోమవారం నుంచి అమలులోకి తెచ్చింది. అధికారికంగా ప్రకటించకుం డానే పన్ను పెంచటంపట్ల వాహనదారుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో గ్రీన్‌ట్యాక్స్‌కు సంబంధించిన ఉత్తర్వు కూడా వెల్లడించకుండా గోప్యత పాటించటం విశేషం.
25 శాతం పెరిగిన త్రైమాసిక పన్ను..
పర్మిట్లతో నడిచే వాహనాల త్రైమాసిక పన్నును కూడా రవాణాశాఖ భారీగా పెంచింది. ఏకంగా 25% మేర పెంచింది. ఈ త్రైమాసికం నుంచే అది అమలులోకి వచ్చినట్టయింది.
Comments
Please login to add a commentAdd a comment