న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాల పెంపును సీఎం కేజ్రీవాల్ సమర్థించుకున్నారు. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడకుండా వేతనాలు పెంచామన్నారు. ‘ప్రధానికన్నా ఎమ్మెల్యేలకు ఎక్కువ వేతనం ఉందని పత్రికలో చూశాను. ప్రధాని జీతం రూ.లక్ష కన్నా తక్కువ ఉంటే.. ఆయన జీతమూ పెంచాల్సిందే’ అని శనివారం హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో అన్నారు. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు జనవరి 1నుంచి అమల్లోకి తెద్దామనుకున్న చైనా తరహా (సరి-బేసి వాహనాలను ఒకరోజు మార్చి ఒకరోజు వాడటం) పథకం అమలులో ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే.. ఆపేస్తామన్నారు.