
కాలుష్య నియంత్రణకు టాస్క్‌ఫోర్స్: కేటీఆర్
- కాలుష్యం తగ్గించాలని ప్రజల నుంచి ఒత్తిడి
- పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమైన మంత్రి
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కాలుష్య నియంత్రణకు జీహెచ్‌ఎంసీ, కాలుష్య నియం త్రణ మండలి, పోలీసులు, పరిశ్రమ వర్గాల తో కూడిన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. పరిశ్రమ వర్గాల సలహా మేరకు ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని, పీసీబీ అధికారులు, పరిశ్రమ వర్గాలతో కామన్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పారిశ్రామిక కాలుష్యం తగ్గించాలని ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెప్పారు.
పారిశ్రామిక కాలుష్యం తగ్గించే చర్యల్లో భాగంగా వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో మంగళవారం సనత్‌నగర్‌లోని పీసీబీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న సమావేశమయ్యారు. కాలుష్య నియంత్రణ, పారిశ్రామిక వ్యర్థాల నియంత్రణపై ప్రభుత్వ ఆలోచనలను చర్చించారు. హైదరాబాద్ నుంచి కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపలికి తరలించాలన్న జీవో 20ని తప్పకుండా అమలు చేస్తామని కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలు తరలి వెళ్లే వరకు జీరో లిక్విడ్ డిశ్చార్జి వంటి అధునాతన ఏర్పాట్లు చేసుకుని వ్యర్థాలను అరికట్టాలని కోరారు. పరిశ్రమలు పెరుగుదలకు సహకరిస్తూనే, చట్టాల అమల్లో కచ్చితంగా ఉంటామన్నారు.
పరిశ్రమల తరలింపునకు ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపల 17 ప్రాంతాలు గుర్తించామని, వాటిలో క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయా క్లస్టర్లలో ప్రభుత్వం కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పన పూర్తయ్యాకే, పరిశ్రమలను తరలిస్తామన్నారు. తరలించా ల్సిన పరిశ్రమల్లో 50 శాతానికి పైగా లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీలే ఉన్నాయని, వీటిని అంతర్జాతీయ సౌకర్యాలతో కూడిన ఫార్మాసిటీ కేంద్రంగా ఉంటుందన్నారు.
మూడోవంతు గ్రీన్‌బెల్ట్: మంత్రి జోగు రామన్న
పరిశ్రమల్లో మూడో వంతు గ్రీన్ బెల్ట్ నిర్వహణకు హరితహారం కార్యక్రమం ద్వారా కార్యాచరణ కచ్చితంగా అమలు చేస్తామని జోగు రామన్న తెలిపారు. కాలుష్య నివారణ చట్టాలను ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తుందన్నారు. ప్రభు త్వ యంత్రాంగం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణకు ప్రభు త్వం సహకరిస్తుందని, ప్రమాణాలను ఉల్లం ఘించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా నాలాల్లోకి వ్యర్థాలను వదిలే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నా రు. సీసీ టీవీ నెట్‌వర్క్, రాత్రి సమయాల్లో నూ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. టోక్కో క్లీన్ ఎయిర్ అథారిటీ మాదిరిగా హైదరాబాద్‌లోనూ అథారిటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.