- పలు శాఖల అధికారులు, ఇద్దరు ఎమ్మెల్యేలతో కమిటీ ఏర్పాటు
- చమురు సంస్థల కార్యకలాపాలతో ఎదురయ్యే కాలుష్యానికి ఇక కళ్లెం
అమలాపురం టౌన్ : కాలుష్య కోరలకు పచ్చని కోనసీమ కునరిల్లుతోంది. ముఖ్యంగా ఈ సీమలో చమురు సంస్థల తవ్వకాలు, కార్యకలాపాల వల్ల కాలుష్య పరిస్థితులు అనివార్యమవుతున్నాయి. పచ్చని,ప్రశాంత కోనసీమలో చమురు సంస్థల కార్యకలాపాలు అధికమైన తర్వాతే ఇక్కడ కాలుష్య కష్టాలు పెరిగిపోయాయన్న వాదన, ఆరోపణ ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల, ప్రజల నుంచి కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. కోనసీమలో కాలుష్య నియంత్రణకు.. పర్యవేక్షణకు నిపుణులతో కూడిన ఓ కమిటీని నియమించాలన్న డిమాండు కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ప్రజాప్రతినిధులు, ప్రజల ఒత్తిడితో ఎట్టకేలకు ఏడుగురి నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఈ మేరకు జీఓ ఆర్టీ నెం.35 పేరుతో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పరిశ్రమలు, రెవెన్యూ, ప్రజాప్రతిధులు, నిష్ణాతులైన వారితో ఈ కమిటీని ఏర్పాటుచేశారు.
నిపుణుల కమిటీ విధులు ఇలా..
ఈ కమిటీ కోనసీమలో కాలుష్యానికి దారి తీస్తున్న ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా పరిశీలించాలి. ఆ కాలుష్యం ఏ పరిశ్రమ నుంచి లేదా ఏ సంస్థ నుంచి వస్తుంది. లేదా ఎవరైనా వ్యక్తులు, సంస్థల నిర్లక్ష్యం వస్తుందా.. అనే దానిపై కమిటీ అధ్యయనం చేసి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఓ నివేదకి పంపించాలి. కోనసీమలో పలు చమురు సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆరోపిస్తున్న.. ఇబ్బంది పడుతున్న పరిస్థితులపై కూడా కమిటీ నిరంతరం ఓ కంటి కనిపెట్టనుంది. కాలుష్యం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫిర్యాదు రూపంలో స్వీకరించనుంది. ఎన్విరాల్‌మెంట్ , ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలిజీ డిపార్లమెంట్ల సంయక్త ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేయనుంది.
కమిటీలో ఎవరెవరు...?
మొత్తం ఆరుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (విశాఖపట్నం) జాయింట్ చీఫ్ ఎన్విరాల్‌మెంట్ ఇంజినీరు కమిటీ కన్వీనర్‌గానే కాకుండా ఒక సభ్యుడిగా వ్యవహరిస్తారు. కాకినాడ ఇండస్ట్రీస్ జాయింట్ డెరైక్టర్, కాకినాడ ఫ్యాక్టరీస్, బోయలర్స్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్, అమలాపురం ఆర్డీఓ, కాకినాడ జేఎన్‌టీయూ పెట్రోలియం ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ కేవీ రావు, అమలాపురం, రామచంద్రపురం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, తోట త్రిమూర్తులును కమిటీ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కమిటీ తొలి భేటీ
కోనసీమ కాలుష్య నియంత్రణకు నియమించిన నిపుణుల కమిటీ తొలి భేటి కలెక్టర్ అరుణకుమార్ సమక్షంలో కాకినాడలో గురువారం సమావేశమైంది. కమిటీ విధి విధానాలపై చర్చించింది. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కోనసీమలో కాలుష్య నియంత్రణకు ఓ నిపుణుల కమిటీ నియమించాలన్న డిమాండును ఆయన పదవి చేపట్టగానే తెరమీదుకు తీసుకుని వచ్చారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి కాలుష్య కష్టాలను వివరించారు. తొలిభేటీలో కూడా ఎమ్మెల్యే ఆనందరావు కోనసీమలో చమురు సంస్థల వల్ల అనివార్యమతున్న కాలుష్యం.. కమిటీ ద్వారా ఎలా నియంత్రించాలనే అంశంపై
ఆయన మాట్లాడారు.
కోనసీమ కాలుష్య నియంత్రణకు నిపుణుల కమిటీ
Published Sat, May 2 2015 3:05 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement
Advertisement