
సాక్షి, హైదరాబాద్: టోఫెల్‌లో మాస్ కాపీయింగ్ వ్యవహారం పోలీసుల చెంతకు చేరింది. ఆధారాలతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు అందింది. రూ. 25 వేలు ఇస్తే టోఫెల్లో టాప్ స్కోర్ ఇస్తున్న వ్యవహారం వెలుగు చూసింది.
అంతర్జాతీయ విద్యాసంస్థల్లో సీటు పొందెందుకు రాసే టోఫెల్‌లో మాస్ కాపీయింగ్ పాల్పడుతున్నట్లు తేలింది. ఒక్కో విద్యార్థి నుండి రూ. 25 వేలు లంచం తీసుకుని.. పరీక్ష గదిలోనే వాట్సాప్ ద్వారా ఆన్సర్స్ లీక్ చేస్తోంది ముఠా. హైదరాబాద్ సైబర్ క్రైం పీఎస్ లో ఈటీఎస్( ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఇండియా ) ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment