
సాక్షి, హైదరాబాద్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబర్ 7న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
అభ్యర్థులు వెంటనే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని, అర్హత పరీక్షను సీబీఆర్టీ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. హాల్‌టికెట్లలో నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధం కావాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment