
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–4 కొలువులు మరిన్ని పెరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,039 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. తాజాగా గ్రూప్–4 కేటగిరీలో మరో 141 పోస్టులను జత చేస్తూ అనుబంధ ప్రకటనను శనివారం విడుదల చేసింది. దీంతో గ్రూప్–4 కేటగిరీలో పోస్టుల సంఖ్య 8,180కు చేరింది.
తాజాగా ప్రకటించిన 141 పోస్టులు మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీకి సంబంధించిన ఖాళీలు. ఇందులో బాలుర గురుకుల విద్యాసంస్థలకు సంబంధించి 86 పోస్టులుండగా, బాలికల విద్యా సంస్థలకు సంబంధించి 55 పోస్టులున్నాయి. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment