group-4
-
లోకల్ ‘లొల్లి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్థానికతకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. మెరుగైన మార్కులు సాధించినా, స్థానికేతరులైతే ఉద్యోగం దక్కడం కష్టం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానికులకు, 5% మాత్రం ఓపెన్ కేటగిరీకి కేటాయిస్తూ నియామక సంస్థలు భర్తీ ప్రక్రియ చేపడతాయి. టీజీపీఎస్సీ ద్వారా ప్రస్తుతం గ్రూప్–4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. అయితే ఎక్కువ మంది అభ్యర్థులు రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.స్థానికత నిర్ధారణ ఇలా...కొత్త జిల్లాల ఏర్పాటు..ఆపై జోన్లు, మల్టీ జోన్ల విభజన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత స్థానికత పరిగణనలో ప్రభుత్వం కొంతమేర మార్పులు చేసింది.⇒ ఒక అభ్యర్థి స్థానికతను విద్యాభ్యాసం ఆధారంగా పరిగణిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతిలో ఎక్కువ కాలం(కనీసం నాలుగు సంవత్సరాలు) చదివిన జిల్లాను స్థానికతగా గుర్తిస్తున్నారు. లేదా 4,5,6,7 తరగతులను రాష్ట్రంలో చదివిన విద్యార్థిని తెలంగాణలో స్థానిక అభ్యర్థి కింద లెక్కిస్తారు. ⇒ జిల్లా యూనిట్‌గా తీసుకున్నప్పుడు మాత్రం 1 నుంచి 7వ తరగతిలో కనీసం నాలుగేళ్లు చదివిన జిల్లాను ఆ జిల్లాలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈమేరకు ఆ విద్యార్హత సర్టిఫికెట్లు (బోనఫైడ్) పరిశీలిస్తారు. తహసీల్దార్ ధ్రువీకరించినవే ఎక్కువగా..గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా టీజీపీఎస్సీ ధ్రువపత్రాల పరిశీలన చేపడుతోంది. అయితే చాలామంది అభ్యర్థులు బోనఫైడ్‌లకు బదులుగా రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నారు. ⇒ తహసీల్దార్ ద్వారా తీసుకున్న నివాన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తుండడంతో వాటిని అధికారులు ఆన్లైన్ ద్వారా నిర్ధారించుకుని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ⇒ రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్న అభ్యర్థులు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదవుకున్న బోనఫైడ్లు మాత్రం సమర్పించడం లేదని సమాచారం. వారంతా ఏడోతరగతి వరకు బడికి వెళ్లకుండా ప్రైవేట్ పద్ధతిలో చదువుకున్నట్టు చెబుతుండడం గమనార్హం.ఆ మూడు జిల్లాల్లోనే ఎక్కువగా...రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పించిన అభ్యర్థుల్లో అత్యధికంగా మూడు జిల్లాలకు చెందినవారే ఉన్నట్టు తెలుస్తోంది. గ్రూప్–4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మరో నెలరోజుల పాటు జరగనుంది. ఇప్పటివరకు జరిపిన పరిశీలన ప్రక్రియలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల నుంచి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జిల్లాల పరిధిలో ఉద్యోగాల సంఖ్య కూడా ఎక్కువే.పట్టణ నేపథ్యమ్ను ఈ జిల్లాల్లో స్కూల్‌కు వెళ్లకుండా ప్రైవేట్‌గా చదివే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్న పలువురి నుంచి ఉత్పన్నమవుతోంది. తహసీల్దార్ కార్యాలయాల నుంచి స్థానికత ధ్రువీకరణ పత్రం సంపాదించడంపైనా పలు విమర్శలు వస్తున్నాయి. దీంతో సరైన విధంగా విచారణ జరపకుండా నియామక పత్రాలు ఇస్తే స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని నియామకాల్లోనూ..టీజీపీఎస్సీ మాత్రమే కాదు..తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు(టీజీఎస్పీఆర్బీ), తెలంగాణ మెడికల్‌అండ్‌హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీజీఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా గత ఆర్నెళ్లలో 30వేలకు పైబడి ఉద్యోగ నియామకాలు జరిగాయి. ఈ ప్రక్రియలోనూ చాలామంది అభ్యర్థులు రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన నియామకాల్లో రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పించిన వారి వివరాలను బహిర్గతం చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగ నియామక సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నారు. -
త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అతి త్వరలో గ్రూప్–4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ప్రకటించనుంది. ఈ కేటగిరీలో 8,180 ఉద్యోగాలకు గాను 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది జూలై 1వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఓఎంఆర్ ఆధారిత అర్హత పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షకు 7,62,872 మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన టీఎస్పీఎస్సీ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభ్యర్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాతో కూడిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను (జీఆర్ఎల్) వెబ్సైట్లో ఉంచింది.ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను విడుదల చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. అయితే డిజేబుల్డ్ (దివ్యాంగులు) కేటగిరీలో మాత్రం 1:5 నిష్పత్తిలో ఎంపిక చేపట్టనుంది. ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల చేసిన వెంటనే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేలా టీఎస్పీఎస్సీ కార్యాచరణ రూపొందించింది. అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది.ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2021–22 సంవత్సరం తర్వాత తీసుకున్న సర్టిఫికెట్‌ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. అదే విధంగా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు, వివిధ కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులు కమిషన్ నిర్దేశించిన తేదీలతో కూడిన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఏ క్షణంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు ఖరారు కావచ్చునని టీఎస్పీఎస్సీ తెలిపింది. -
జూన్‌లో జాబ్‌ల జాతర
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పార్ల మెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే జాబ్‌ల జాతరకు లైన్‌క్లియర్ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9వేల ఉద్యో గాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేటగిరీలో దాదాపు 2వేలకు పైబడి ఉద్యోగాలున్నాయి. వీటికి కూడా జీఆర్ఎల్ విడుదల చేశారు. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య ఇలా పలు విభాగాల్లో దాదాపు 5వేల ఉద్యోగాలకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టర్ జాబితాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను సైతం టీఎస్పీఎస్సీ తెప్పించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా ఒక్కో కేటగిరీలో జిల్లాస్థాయిలో 1:2 నిష్పత్తి, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీల్లో 1:3 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాలను సైతం రూపొందిస్తోంది. ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ జూన్ రెండోవారంకల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఆలోపు పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి సైతం తొలగిపోనుంది. దీంతో టీఎస్పీఎస్సీ తుది జాబితాలను బహిర్గతం చేసిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. జూన్ మూడోవారం నుంచి నియామక పత్రాల పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గురుకుల పోస్టుల్లో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన దాదాపు 1500 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. పార్లమెంట్ కోడ్ ముగియగానే జూన్ మొదటివారం తర్వాత వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఫిబ్రవరి నుంచే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నియామక పత్రాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా పోలీస్‌శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలో స్టాఫ్ నర్సులు, గురుకుల విద్యాసంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీల్లో దాదాపు 33వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా భర్తీ చేసినవే. మూడు బోర్డుల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ఎత్తయితే... టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈ మూడు బోర్డుల పరిధిలోని ఉద్యోగాల సంఖ్యతో దాదాపు సమానంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పలు కేటగిరీల్లో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తోంది. -
తెలంగాణ గ్రూప్-4 ఫలితాల విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో గ్రూప్-4 ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును కమిషన్ ప్రకటించింది. https://www.tspsc.gov.in/ వెబ్సైట్లో ర్యాంకులు చూసుకోవాలని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచించింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కమిషన్ తెలిపింది. గతేడాది తెలంగాణలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కిందటి ఏడాది జులైలో గ్రూప్-4 పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 7,62,872 మంది పేపర్-1 రాశారు. 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు. టీఎస్పీఎస్సీ ఫైనల్ కీ కూడా విడుదల చేసింది. -
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–4 జవాబు పత్రాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–4 పరీక్షల ప్రాథమిక ‘కీ’లను తన వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా గ్రూప్–4 పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబుపత్రాల స్కానింగ్ కాపీలను సైతం అభ్యర్థుల కోసం వెబ్సైట్లో ఉంచింది. వీటిని వచ్చే నెల 27వ తేదీ వరకు వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చు. ఈ జవాబు పత్రాలు నిర్ణిత గడువు తర్వాత వెబ్సైట్లో తెరుచుకోవని కమిషన్ స్పష్టం చేసింది. దాదాపు 9 వేల గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీ జూలై 1న ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్–4 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో పేపర్–1కు 7,63,835 మంది అభ్యర్థులు హాజరు కాగా, పేపర్–2 పరీక్షకు 7,61,026 మంది హాజరయ్యారు. కమిషన్ వెబ్సైట్లో ప్రాథమిక కీలు పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబు పత్రాలను స్కానింగ్ చేసిన కమిషన్... వాటిని అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచింది. నెల రోజుల పాటు వీటిని వెబ్సైట్ తెరిచి పరిశీలించుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్–4 పరీక్షల ప్రాథమిక కీలు సోమవారం నుంచి కమిషన్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాథమిక కీల పైన ఏవేనీ అభ్యంతరాలుంటే ఈనెల 30వ తేదీనుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు నిర్దేశిత లింకు ద్వారా ఆన్లైన్ పద్ధతిలో తగిన ఆధారాలతో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను కేవలం ఇంగ్లీషులో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశించిన గడువు తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని, ఈమెయిల్, పోసు ద్వారా వచ్చే వినతులను సైతం పరిగణించమని, మరిన్ని వివరాలను వెబ్సైట్ తెరిచి చూసుకోవాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: గతంలో నోటిఫికేషన్ వస్తే భర్తీ ప్రక్రియ ఏళ్లు పట్టేదని.. ఇప్పుడు రెండు నెలల్లో పూర్తి చేస్తున్నామని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒకట్రెండు సమస్యలకు వ్యవస్థనే తప్పు పట్టడం సరికాదన్నారు. గ్రూప్-4 ఫలితాలకు ఇంకా సమయం ఉందని జనార్థన్‌రెడ్డి అన్నారు. కాగా, ఈ పరీక్షను జూలై 1వ తేదీన నిర్వహించిన విషయం తెల్సిందే. మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్-1కు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. చదవండి: ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో మంత్రి మల్లారెడ్డి -
Telangana: నేడు గ్రూప్–4 పరీక్ష..
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–4 పరీక్షకు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగే ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 9 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు శుక్రవారం టీఎస్పీఎస్సీ తెలిపింది. మొత్తం 2,878 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్–2 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. ప్రతి పరీక్ష కేంద్రంలో ఇద్దరు పోలీసు అధికారులకు డ్యూటీలు కేటాయించారు. ప్రధానంగా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేందుకు ఒక మహిళా కానిస్టేబుల్, జనరల్ కానిస్టేబుల్ ఉంటారని తెలిపింది. వీరు అభ్యర్థుల హాల్‌టికెట్లు, ఫొటో గుర్తింపు కార్డును పరిశీలించిన అనంతరం అభ్యరి్థని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే హాలులోకి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు చేరుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. -
గ్రూప్-4 పరీక్ష.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు రోజుల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం (జులై 1) నిర్వహించే ఈ పరీక్షను రాసేందుకు లక్షలాది మంది విద్యార్థులు సన్నద్ధమై ఉన్నారు. ఈ పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కడ్భందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల చేశారు అధికారులు. ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 పోస్టులకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు. గ్రూప్-4 పరీక్ష అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఇటీవల జారీ చేసిన కొన్ని కీలక సూచనల్ని పరిశీలిస్తే ► గతంలో జరిగిన ఇబ్బందులను, లోపాలను పరిగణలోకి తీసుకున్న టీఎస్పీఎస్సీ పకడ్భందీగా ఎగ్జామ్స్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ►ఉదయం పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనుండగా.. 9.45 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరు. ►మధ్యాహ్నం పేపర్-2 పరీలో 2:30 గంటల నుంచి 5:00 గంటల వరకు నిర్వహించనుండగా.. 2.15 తరువాత ఎగ్జామ్ సెంటర్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. పేపర్-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్-2కు మధ్యాహ్నం ఒంట గంట నుంచి కేంద్రంలోకి అనుమతించనున్నారు. ► ఈ నిబంధన నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని కమిషన్ పేర్కొంది. చదవండి: లోకేశ్‌కుమార్ బదిలీ.. జీహెచ్ఎంసీ నెక్ట్స్ బాస్ ఎవరో? ►ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ తో కూడిన కారు తాళాలు, నిషేధిత, విలువైన వస్తువులు తీసుకురావద్దని కమిషన్ సూచించింది. ఇంకా షూ కూడా ధరించి రావొద్దని.. కేవలం చెప్పులతో మాత్రమే రావాలని తెలిపింది. ► అభ్యర్థులను తనిఖీ తరువాత కేంద్రంలోకి అనుమతించనున్నారు. దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో వేలిముద్ర తప్పనిసరి చేశారు. అభ్యర్థులు ప్రతీ సెషన్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్ కు అందించి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ► ఎగ్జామ్ సెంటర్లలోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్ కు అభ్యర్థులు ఫొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ.. అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమిషన్ స్పష్టం చేస్తోంది. అలాంటి వారిపై పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు సదరు అభ్యర్ధిని మిగతా అన్ని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటించనున్నట్లు తెలిపింది. ►ఓఎంఆర్ షీట్లో బ్లూ/బ్లాక్ పెన్ తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాల్సి ఉంటుందని కమిషన్ తెలిపింది. ► హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదని కమిషన్ స్పష్టం చేసింది. -
తెలంగాణ: గ్రూప్–4 దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) గ్రూప్–4 ఆశా వహులకు శుభవార్త. దరఖాస్తుల స్వీకరణ గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గత డిసెంబర్ 30వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా జనవరి 30వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్–4 కేటగిరీలో మరి కొన్ని కొలువులు జతచేస్తూ అనుబంధ ప్రకటన విడుదల చేయడం, అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో గడువును పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. గ్రూప్–4 ఉద్యోగాల కోసం ఇప్పటివరకు 8,47,277 దరఖాస్తులు వచ్చాయి. ఆదివారం 49 వేలు, సోమవారం 34,247 దరఖాస్తులు వచ్చాయి. మరో నాలుగు రోజులు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి. మైనారిటీ గురుకుల దరఖాస్తుల గడువు పెంపు మైనారిటీ గురుకుల పాఠ శాల, జూనియర్ కాలేజీలో 2023–24 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లతో పాటు 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునే గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించినట్లు మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సెక్రెటరీ షఫీవుల్లా ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. సలహాలు, సూచనల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 040–23437909లో సంప్రదించవచ్చని తెలిపారు. మరో ఆరు డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు డాక్టర్‌పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్ఇచ్చింది. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధి లోని ఈఎన్టీ విభాగంలో 3 అసిస్టెంట్ ప్రొఫె సర్లు, మరో 3 స్పీచ్‌పాథాలజిస్టులను నియ మించనుంది. మెడికల్‌రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ జరగనుంది. మరిన్ని వివరాలకు తమ బోర్డు వెబ్ సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు. -
గ్రూప్–4లో మరో 141 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–4 కొలువులు మరిన్ని పెరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,039 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. తాజాగా గ్రూప్–4 కేటగిరీలో మరో 141 పోస్టులను జత చేస్తూ అనుబంధ ప్రకటనను శనివారం విడుదల చేసింది. దీంతో గ్రూప్–4 కేటగిరీలో పోస్టుల సంఖ్య 8,180కు చేరింది. తాజాగా ప్రకటించిన 141 పోస్టులు మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీకి సంబంధించిన ఖాళీలు. ఇందులో బాలుర గురుకుల విద్యాసంస్థలకు సంబంధించి 86 పోస్టులుండగా, బాలికల విద్యా సంస్థలకు సంబంధించి 55 పోస్టులున్నాయి. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. -
ఆదిలోనే అడ్డంకులు!.. వాయిదా పడ్డ గ్రూప్-4 ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–4 కొలువుల భర్తీ ప్రక్రియకు ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. ఈ కొలువులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆకస్మికంగా వాయిదా పడగా.. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 25 విభాగాల్లో గ్రూప్–4 కేటగిరీలోని 9,168 ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈనెల 1న వెబ్ నోట్ (ప్రాథమిక ప్రకటన)ను విడుదల చేసింది. ఈ క్రమంలో డిసెంబర్ 23వ తేదీన వెబ్సైట్లో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించిన కమిషన్.. 23వ తేదీ నుంచి 2023–జనవరి 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆ వెబ్‌నోట్‌లో వెల్లడించింది. దీంతో అభ్యర్థులంతా దరఖాస్తుల భర్తీ, శిక్షణకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఆకస్మికంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మరోవైపు జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్లు, విద్యార్హతలు, రోస్టర్ ఆధారిత సమాచారంతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. సాంకేతిక కారణాలంటూ.. సాంకేతిక కారణాల వల్ల గ్రూప్–4 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ తేదీలను మార్పు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ శుక్రవారం ఒక వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. ఈనెల 30వ తేదీ నుంచి 2023 జనవరి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. ఈ ఉద్యోగాలకు అవసరమైన అర్హత సమాచారాన్ని వెబ్సైట్లో చూసి నిర్దేశించిన ప్రొఫార్మా ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌పై స్పష్టత ఇవ్వనప్పటికీ, నిర్దేశించిన తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించింది. కాగా, గ్రూప్–4 ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక ప్రకటనలో కేవలం శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల సంఖ్య మాత్రమే ఉంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లో జిల్లాల వారీగా ఖాళీలు, ఎవరెవరు అర్హులు, రిజర్వేషన్ల వారీగా పోస్టులు.. తదితర పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది. అయితే పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కాకపోవడం.. సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ వాయిదా వేయడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. తదుపరి ఏమవుతుందో..? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధిక పోస్టులతో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ ప్రకటించడం ఇదే మొదటిసారి. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ చేపడుతుండగా.. ఈ ఖాళీల్లో గ్రూప్–4 కొలువుల సంఖ్య 12 శాతం ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న వేళ నిరుద్యోగులు అత్యంత ఉత్సాహంతో సన్నద్ధమవుతుండగా టీఎస్పీఎస్సీ ఇలా అర్ధంతరంగా దరఖాస్తుల స్వీకరణను వాయిదా వేయడం, పూర్తిస్థాయి ప్రకటన విడుదల చేయకపోవడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు శాఖల వారీగా సరైన సమాచారం అందకుండానే ఉద్యోగాల భర్తీకి ప్రాథమిక ప్రకటన విడుదల చేశారనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. -
కొలువుల శిక్షణ గందరగోళం! పేరుకే ఉచితం.. తీరు అనుచితం..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఇస్తున్న ఉచిత శిక్షణ దారితప్పింది. గ్రూప్–3, గ్రూప్–4 కొలువులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మూడు నెలల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు లోపభూయిష్టంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల స్టడీ సెంటర్లు తెరిచి గ్రూప్–3, గ్రూప్–4 అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిన బీసీ స్టడీ సర్కిల్ ప్రైవేటు శిక్షణ సంస్థలను ఎంపిక చేసి తరగతుల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ఒక్కో అభ్యర్థికి సగటున రూ.5500 చొప్పున ఫీజు నిర్దేశిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 50 శిక్షణ తరగతులకు ప్రైవేటు సెంటర్లను ఎంపిక చేసి సెప్టెంబర్ 15 నుంచి తరగతులను ప్రారంభించింది. మూడు నెలల పాటు కొనసాగించాల్సిన ఈ శిక్షణ తరగతులు పలుచోట్ల నామమాత్రంగా సాగగా... కొన్నిచోట్ల అర్ధంతరంగా నిలిచిపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో పడ్డారు. ఎంపిక ప్రక్రియలో నిబంధనలు గాలికి... రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల తెరిచిన సెంటర్లకు ఏడు సంస్థలను బీసీ స్టడీ సర్కిల్ ఎంపిక చేసింది. ఇందులో ఒక సంస్థకు ఏకంగా 20 సెంటర్ల బాధ్యతలు అప్పగించగా... మిగతా 30 సెంటర్ల నిర్వహణను మిగిలిన ఆరు సంస్థలకు అప్పగించినట్లు సమాచారం. సాధారణంగా ఒక సంస్థను ఎంపిక చేసేటప్పుడు ఆ సంస్థ నేపథ్యం, అనుభవం, సామర్ధ్యం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణ అంశంలో నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా కేటాయింపు జరిగినట్లు ఆరోపణలున్నాయి. అడ్డగోలుగా అభ్యర్థుల పెంపు... ఒక్కో బీసీ స్టడీ సెంటర్లో గ్రూప్–3, గ్రూప్–4 శిక్షణ తరగతుల కోసం వంద మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలని బీసీ స్టడీ సర్కిల్ నిర్ణయించింది. మొత్తంగా 5వేల మందికి శిక్షణ ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని సెప్టెంబర్ 15 నాటికి తరగతులు ప్రారంభించి డిసెంబర్ 15కల్లా ముగించేలా కార్యాచరణ రూపొందించింది. కానీ చాలా కేంద్రాల్లో నిర్దేశించిన అభ్యర్థుల సంఖ్య కంటే సగం, అంతకంటే తక్కువ సంఖ్యలో అభ్యర్థులు నమోదయ్యారు. దీంతో గిట్టుబాటు కాదనుకున్న ప్రైవేటు సంస్థలు అధికారులపై ఒత్తిడి తెచ్చి అభ్యర్థుల సంఖ్య పెంపునకు అవకాశం కోరగా... తరగతులు ప్రారంభమైన నెలరోజుల తర్వాత అవకాశం కల్పిస్తూ బీసీ స్టడీ సర్కిల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ స్టడీ సెంటర్లుగా ఎంపిక చేసిన భవనాలన్నీ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీలు, గురుకుల విద్యా సంస్థలే కావడంతో... ఏకంగా డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న అభ్యర్థులను సైతం చేర్చుకునే వెసులుబాటు కల్పించారు. వాస్తవానికి గ్రూప్–3, గ్రూప్–4 ఉద్యోగ ప్రకటన విడుదలయ్యే నాటికి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గ్రూప్–4 నోటిఫికేషన్ విడుదల కాగా, గ్రూప్–3 ప్రకటన అతి త్వరలో వెలువడనుంది. ఈ క్రమంలో డిగ్రీ ఫైనలియర్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం ప్రయోజనకరం కాకున్నా అవకాశం కల్పించడం వివాదాలకు తావిస్తోంది. సెంటర్ల నిర్వహణపై ఫిర్యాదుల వెల్లువ... బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై పలుచోట్ల అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అడ్డగోలు నిర్వహణతో విలువైన సమయాన్ని వృథా చేశారంటూ అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. కామారెడ్డి, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల్లోని బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై అభ్యర్థులు ఏకంగా జిల్లా కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేశారు. వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లోని కూడా స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేశారు. సంబంధిత జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులకు తనిఖీ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. ఇరవై రోజుల్లో మూసేశారు... బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అంటే మరో ఆలోచన లేకుండా అడ్మిషన్ తీసుకున్నాను. కానీ కేవలం ఇరవై రోజుల్లో స్టడీ సెంటర్‌ను మూసేశారు. 25 శాతం సిలబస్ కూడా పూర్తి చేయలేదు. మరోవైపు గ్రూప్–4 నోటిఫికేషన్ రాగా, గ్రూప్–3 ప్రకటన అతి త్వరలో వస్తుందని సమాచారం. ఇంతటి కీలక సమయంలో సెంటర్ మూసివేయడంతో మరో చోట కోచింగ్‌కు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వకపోవడంతో ఎలా సన్నద్ధం కావాలో అర్థం కావడం లేదు. వెంటనే స్టడీ సెంటర్‌ను తెరిచి శిక్షణ తరగతులు నిర్వహించాలి. – ప్రసాద్, వికారాబాద్ బీసీ స్టడీ సర్కిల్ అభ్యర్థి నిరుద్యోగుల జీవితాలతో ఆటలా... ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అనడంతో ఎంతో నమ్మకంతో వేలాది మంది నిరుద్యోగులు బీసీ స్టడీ సెంటర్లలో శిక్షణ తరగతులకు హాజరయ్యారు. కానీ ఎలాంటి ప్రమాణాలను పాటించకుండా ప్రైవేటు సంస్థలకు శిక్షణ బాధ్యతలు అప్పగించడం... పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించకుండా మధ్యలోనే చేతులెత్తేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇందుకు బాధ్యులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలి. – ముత్తినేని వీరయ్య, చైర్మన్, టీపీసీసీ వికలాంగుల విభాగం నిబంధనల ప్రకారమే కాంట్రాక్టు బాధ్యతలు నిబంధనల ప్రకారమే శిక్షణ సంస్థలకు బాధ్యతలు అప్పగించాం. స్టడీ సెంటర్ నిర్వహణ, వసతులన్నీ బీసీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టగా... ఫ్యాకల్టీ, మాక్ టెస్టులు మాత్రం ప్రైవేటు కేంద్రానికి అప్పగించాం. తక్కువ కాల వ్యవధి శిక్షణ కోసం ప్రత్యేకంగా ఫ్యాకల్టీని ఎంపిక చేసి వారికి వేతనాలు ఇవ్వడం పెద్ద ప్రక్రియ. అలా కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. – అలోక్ కుమార్, డైరెక్టర్, బీసీ స్టడీ సర్కిల్ -
Group 4 Notification: 9,168 కొలువులకు నోటిఫికేషన్.. పరీక్ష విధానం ఇదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తంగా 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ఇంత భారీ సంఖ్యలో గ్రూప్స్ కొలువుల భర్తీకి ప్రకటన వెలువరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ కేటగిరీల పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తులు: గ్రూప్–4 పోస్టులకు ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇచ్చింది. ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, కేటగిరీల వారీగా ఖాళీలు, వేతన స్కేల్, వయో పరిమితి తదితర వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఈ నెల 23న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని.. దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తామని వెల్లడించింది. అన్నీ జూనియర్ అసిస్టెంట్ కేటగిరీవే.. తాజాగా గ్రూప్–4 కేటగిరీలో భర్తీ చేయనున్న ఉద్యోగాలన్నీ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి సంబంధించినవే. ఇందులో నాలుగు కేటగిరీలు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ కేటగిరీలో 429 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కేటగిరీలో 6,859 పోస్టులు, జూనియర్ ఆడిటర్ కేటగిరీలో 18 పోస్టులు, వార్డ్ ఆఫీసర్ కేటగిరీలో 1,862 పోస్టులు ఉన్నాయి. -
TSPSC: గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. గ్రూప్-4 నోటిఫికేషన్‌ను గురువారం అధికారికంగా రిలీజ్ చేసింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొత్తం 9,168 పోస్టులకుగానూ నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. అగ్రికల్చర్, కో ఆపరేటివ్ శాఖలో 44 పోస్టులు, పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్ మెంట్లో 2, బీసీ వెల్ఫేర్‌లో 307, పౌర సరఫరాల శాఖలో 72, ఆర్ధిక శాఖలో 255 మున్సిపల్, అర్బన్ డెవల్మెంట్ లో 2, 701 పోస్టులు, ఉన్నత విద్యా శాఖలో 742 పోస్టులు, రెవెన్యూ శాఖలో 2,077 ఎస్సీ వెల్ఫేర్ లో 474 పోస్టులకుగానూ నోటిఫికేషన్ విడుదల చేసింది. లేబర్ డిపార్ట్మెoట్ లో 128 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ లో 221 పోస్టులు, హోమ్ శాఖలో 133 పోస్టులు, పాఠశాల విద్యా శాఖలో 97 పోస్టులు ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నెల 23 నుంచి జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది టీఎస్పీఎస్సీ. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. AP: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలు సవరించి మరీ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. శాఖల వారీగా గ్రూప్–4 పోస్టుల వివరాలివే.. ఆ రెండు శాఖల్లోనే ఎక్కువ ఖాళీలు.. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 9,168 గ్రూప్–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల వివరాలు, ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వంటి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల వివరాలు ఇవే.. పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త! 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది. ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్ది నెలల క్రితం పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. ముందస్తు మేఘాలు! అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండవని, నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ.. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు, సొంత జాగాలో నివాసాలు, దళితబంధు లాంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం, కొలువులు భర్తీ చేయాలని నిర్ణయించడం..‘ముందస్తు’కు సంకేతాలేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్ గేమ్.. ఇంకెన్ని దారుణాలు చూడాలో.. ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నా చంద్రబాబు అధికారంలో ఉంటే చాలనుకుంటాడు రామోజీరావు. అందుకే... ‘బాబు మాట– బంగారం మూట’ అనే రీతిలో నారా వారు చెప్పే పచ్చి అబద్ధాలను కూడా పతాక శీర్షికల్లో అచ్చేస్తుంటాడు. కాస్తయినా ఇంగితజ్ఞానం, పత్రికగా కొంతైనా సామాజిక బాధ్యత ఉండాలి కదా? తన పాఠకులకే కాదు... ఈ రాష్ట్ర ప్రజలకు కూడా జవాబుదారీ అనే స్పృహ అక్కర్లేదా? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. US midterm elections results 2022: ఫలితమూ మధ్యంతరమే అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలతో లాభపడింది ఎవరు? హోరాహోరీగా తలపడిన వైరిపక్షాలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ లక్ష్యాన్ని చేరాయా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.డెమొక్రాట్లకు చావు తప్పి కన్ను లొట్టబోతే, రిపబ్లికన్లు నిక్కుతూ నీలుగుతూ మునిగిపోయే నావనుంచి చివరి నిమిషంలో బయటపడి అతికష్టం మీద ఊపిరి పీల్చుకున్నారు. అంతో ఇంతో జనాలే లాభపడ్డారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. Neena Rao: విజేత తల్లి ప్రతి బిడ్డా ప్రత్యేకమే. మీ బిడ్డ పదిలో ఒకరు కాకపోవచ్చు. పదిమంది చేసినట్లు చేయకపోవచ్చు. మీకు పుట్టింది ఐన్‌స్టీన్ కావచ్చు. బిల్ గేట్స్ కూడా కావచ్చు. బిడ్డ మేధాశక్తిని గ్రహించండి. బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి. మీ బిడ్డ విజేతగా నిలుస్తాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! ‘అభివృద్ధిని ముందుగా ఊహించిన వాళ్లే ఫలాలను అందుకుంటారు’ స్థిరాస్తి రంగంలో ఇది అక్షర సత్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల రాకతో మొదలైన మాదాపూర్ అభివృద్ధి.. 2007లో రియల్ బూమ్‌తో చుట్టూ 20 కి.మీ. వరకూ విస్తరించింది. సేమ్ ఇదే తరహా డెవలప్మెంట్ ఉత్తర హైదరాబాద్‌లో మొదలైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. వాషింగ్టన్ సుందర్ సరికొత్త చరిత్ర.. 12 ఏళ్ల రికార్డు బద్దలు ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం మరోసారి పూర్తిగా తేలిపోయారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. టాలీవుడ్లో మాస్ జాతర.. పూనకాలు తెప్పిస్తారట! టికెట్లు బాగా తెగాలంటే మాస్ ప్రేక్షకులు రావాలి. అందుకే ఏడాదికి రెండొందల సినిమాలు వస్తే.. వాటిలో తొంభై శాతం మాస్ సినిమాలే ఉంటాయి. ఆ మాస్ బొమ్మ (సినిమా) బాగుంటే ఇక మాస్ ప్రేక్షకులకు పండగ... వసూళ్లతో బాక్సాఫీస్‌కి పండగ. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ‘మాస్ బొమ్మ’లపై ఓ లుక్కేద్దాం... పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Group 4 Notification: శాఖల వారీగా గ్రూప్–4 పోస్టుల వివరాలివే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 9,168 గ్రూప్–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల వివరాలు, ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వంటి వివరాలు చూద్దాం.. ఆర్థికశాఖ అనుమతించిన గ్రూప్–4 పోస్టుల వివరాలివే.. 1) జూనియర్ అకౌంటెంట్లు: 429 ఆర్థికశాఖ: 191 (డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్–35, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్–156) మున్సిపల్ శాఖ: 238 (సీడీఎంఏ–224, హెచ్ఎండీఏ–14) 2) జూనియర్ అసిస్టెంట్లు: 6,859 ► వ్యవసాయశాఖ: 44 (డైరెక్టర్ కార్యాలయం–2, కోఆపరేటివ్ రిజి్రస్టార్–4, అగ్రికల్చర్ కమిషనర్–4, హారి్టకల్చర్ వర్సిటీ–34, పశుసంవర్థక శాఖ–2, మత్స్యశాఖ–2) ► బీసీ సంక్షేమశాఖ: 307 (డైరెక్టర్ కార్యాలయం–7, జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ–289, బీసీ సహకార సమాఖ్య–11) ► పౌర సరఫరాలశాఖ: 72 (డైరెక్టర్ కార్యాలయం–25, లీగల్ మెట్రాలజీ–1, సివిల్ సప్లైస్ కార్పొరేషన్–46) ► ఇంధనశాఖ: 2 (చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం) ► అటవీ, పర్యావరణ శాఖ: 23 (పీసీసీఎఫ్ కార్యాలయం) ► ఆర్థిక శాఖ: 46 (డైరెక్టర్ ఆఫ్ వర్క్స్, అకౌంట్స్) ► సాధారణ పరిపాలన శాఖ: 5 (పౌరసంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం) ► వైద్య, ఆరోగ్యశాఖ: 338 (టీవీవీపీ కార్యాలయం–119, ఆయుష్ కమిషనర్–10, డ్రగ్స్ కంట్రోల్–2, వైద్య విద్య–125, ప్రజారోగ్య శాఖ–81, ఐపీఎం–1) ► ఉన్నత విద్యాశాఖ: 742 (కళాశాల విద్య కమిషనరేట్–36, ఇంటరీ్మడియట్ కమిషనర్–68, సాంకేతిక విద్య కమిషనర్–46, ఓపెన్ యూనివర్సిటీ–26, జేఎన్యూఎఫ్ఏ–2, జేఎన్టీయూ–75, కాకతీయ వర్సిటీ–10, మహాత్మాగాందీ–4, ఉస్మానియా–375, పాలమూరు–8, తెలుగు యూనివర్సిటీ–47, ఆర్జీయూకేటీ–31, శాతవాహన–8, తెలంగాణ వర్సిటీ–6) ► హోంశాఖ: 133 (డీజీపీ–88, జైళ్లశాఖ–18, అగ్ని మాపకశాఖ–17, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్–8, సైనిక్ వెల్ఫేర్–2) ► పరిశ్రమలశాఖ: 7 (కమిషనరేట్–4, మైన్స్, జియాలజీ–3) ► సాగునీటి శాఖ: 51 (భూగర్భజల శాఖ–1, ఈఎన్సీ–పరిపాలన–50) ► కార్మికశాఖ: 128 (ఉపాధి, శిక్షణ శాఖ–33, కార్మిక కమిషనర్–29, బాయిలర్స్ డైరెక్టర్–1, ఫ్యాక్టరీస్–5, ఇన్‌స్రూెన్స్ మెడికల్ సరీ్వసెస్–60) ► మైనార్టీ సంక్షేమశాఖ: 191 (మైనార్టీ సంక్షేమ డైరెక్టర్–06, మైనార్టీ గురుకులాలు–185) ► పురపాలకశాఖ: 601 (సీడీఎంఏ–172, టౌన్‌ప్లానింగ్–03, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ–2, జీహెచ్ఎంసీ–202, హెచ్ఎండీఏ–50, హెచ్ఎండబ్ల్యూఎస్–167, కుడా–05) ► పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ: 1,245 (కమిషనర్ పరిధిలో–1,224, ఈఎన్సీ (జనరల్ అండ్ పీఆర్)–11, ఈఎన్సీ మిషన్ భగీరథ–10) ► ప్రణాళికశాఖ: 02 (అర్థగణాంక శాఖ డైరెక్టర్–02) ► రెవెన్యూ శాఖ: 2,077 (స్టాంపులు, రిజి్రస్టేషన్లు–40, భూపరిపాలన శాఖ–1,294, వాణిజ్య పన్నులు–655, దేవాదాయ–09, ఎక్సైజ్–72, సర్వే సెటిల్మెంట్–7) ► ఎస్సీ అభివృద్ధి శాఖ: 474 (కమిషనర్ ఎస్సీల అభివృద్ధి శాఖ–13, ఎస్సీ సహకార కార్పొరేషన్–115, ఎస్సీ గురుకులాలు–346) ► మాధ్యమిక విద్యాశాఖ: 97 (డీఎస్ఈ–20, వయోజన విద్య–2, గ్రంథాలయాలు–9, మోడల్ స్కూళ్లు–14, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ–9, టీఎస్‌ఆర్‌ఈఐఎస్–39, జిల్లా గ్రంథాలయాల సంస్థ–4) ► రోడ్డు, రవాణాశాఖ: 20 (రవాణా కమిషనర్–11, ఈఎన్సీ ఆర్అండ్బీ–09) ► గిరిజన సంక్షేమ శాఖ: 221 (సీఈ ట్రైబల్ వెల్ఫేర్–04, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్–11, జీసీసీ–65, ట్రైకార్–08, ఎస్టీ గురుకులాలు–132, టీసీఆర్‌అండ్‌టీఐ–1) ► మహిళాశిశు సంక్షేమశాఖ: 18 (జువెనైల్ వెల్ఫేర్–09, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమం–03, మహిళాశిశు సంక్షేమం–06) ► యువజన, సాంస్కృతికశాఖ: 13 (భాష సంస్కృతి–02, ఎన్సీసీ–11) 3) జూనియర్ ఆడిటర్: 18 (డైరెక్టర్ స్టేట్ ఆడిట్) 4) వార్డ్ ఆఫీసర్: 1,862 (మున్సిపల్ శాఖ) చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-4 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ -
గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ అనుమతి
-
నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-4 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–4 ఉద్యోగ నియామకాలకు లైన్‌క్లియర్ అయింది. మొత్తం 9,168 గ్రూప్–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లోని 80 వేల ఉద్యోగాల భర్తీ చేపడతామన్న ప్రభుత్వం ఇప్పటికే 50 వేల ఉద్యోగ నియామకాలకు అనుమతులు ఇచి్చంది. కొన్నింటికి నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. ఇందులో అత్యధికం పోలీసుశాఖకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువగా ఉన్నవి గ్రూప్–4 ఉద్యోగాలే. మరో 9,096 పోస్టులు గురుకుల నియామకాల బోర్డు పరిధిలో ఉన్నాయి. శాఖల వారీగా ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన 9,168 గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలు ముందుగా టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. శాఖల వారీగా మంజూరు చేసిన పోస్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లకు అనుగుణంగా ఈ ప్రతిపాదనలు సమర్పిస్తారు. ఆ ప్రతిపాదనలను టీఎస్పీఎస్సీ పూర్తిస్థాయిలో పరిశీలిస్తుంది. అన్ని అంశాలు లోపాలకు తావులేకుండా ఉన్నట్టు సంతృప్తి చెందిన తర్వాత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ప్రస్తుతం గ్రూప్–4 కేటగిరీలో భర్తీకి అనుమతించిన మొత్తం 9,168 పోస్టులకు ఒకే నోటిఫికేషన్ వెలువనున్నట్టు సమాచారం. ఈ పోస్టుల్లో వివిధ ఉద్యోగాలు కలిపి సగానికిపైగా మున్సిపల్, రెవెన్యూ శాఖల పరిధిలోనే ఉండటం గమనార్హం. గ్రూప్–4 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఇక సాధన మొదలుపెట్టి కొలువు దక్కించుకునేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రా>వు శుక్రవారం ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. విధుల వారీగా పోస్టుల లెక్కలివీ.. 1) జూనియర్ అకౌంటెంట్లు: 429 2) జూనియర్ అసిస్టెంట్లు: 6,859 3) జూనియర్ ఆడిటర్: 18 (డైరెక్టర్ స్టేట్ ఆడిట్) 4) వార్డ్ ఆఫీసర్: 1,862 (మున్సిపల్ శాఖ) మొత్తం పోస్టులు : 9,168 -
త్వరలో గ్రూప్–4 నోటిఫికేషన్
సిద్దిపేట జోన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేసేలా అగ్నిపథ్ పేరిట ఆర్మీలో కాంట్రాక్టు విధానం తెచ్చిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అలాగే నల్ల చట్టాలను తేవడం, పెట్రో ధరలను ఇష్టానుసారంగా పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు. అలాంటి బీజేపీ తీరును గ్రామాల్లో ఎండగట్టి చర్చ పెట్టి నాయకుల చెంప చెల్లుమనేలా గులాబీ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్ ఉచిత శిక్షణ కేంద్రంలోని పోలీస్ ఉద్యోగాల శిక్షణార్థులకు పాలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–4 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుందని ప్రకటించారు. వాటిలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని కాళేశ్వరం ద్వారా ఒక్కఎకరా కూడా పండలేదని కొంతమంది అవాకులు చెవాకులుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి గ్రామంలో నిండుకుండలా బావుల్లో, చెరువుల్లో, చెక్ డ్యామ్ల్లోనీరు ఉందన్నారు. గతంలో 5 వేల ఎకరాల్లో పంటల సాగు అయ్యేదని, ఇప్పుడు నాలుగింతల సాగు పెరిగిందని తెలిపారు. ఢిల్లీలో, గాంధీభవన్‌లో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుందని,గ్రామాల్లోకి వచ్చి చూస్తే కాళేశ్వరం గురించి తెలుస్తుందని హరీశ్ హితవు పలికారు. కొర్రీలతో 30 వేల కోట్ల నిధుల నిలుపుదల ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు మొదలైన తర్వాత రాష్ట్రంలో ప్రారంభించిన కాళేశ్వరం పూర్తిచేసుకుని ప్రస్తుతం ఫలితాలు పొందుతున్నామని హరీశ్ అన్నారు. కానీ అక్కడ ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొర్రీల పేరుతో రాష్ట్రానికి వచ్చే రూ.30 వేల కోట్ల నిధులను ఆపిందని ఆరోపించారు. మల్లన్నసాగర్ ద్వారా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇంటింటికీ తాగునీరు అందించే రింగ్‌మెన్ రేపటి తరాలకు వరంగా మారుతుందన్నారు. దేశంలో ఎక్కువగా మాంసాహారం తినే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, 99 శాతం మాంసాహారులు ఉండగా, 1 శాతం శాకాహారం వారు ఉన్నట్లు హరీశ్ వెల్లడించారు. -
గుడ్ న్యూస్.. ఆ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లోని 269 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్–4, మెడికల్ ఆఫీసర్లు, లెక్చరర్ తదితర పోస్టులు వీటిలో ఉన్నాయి. పోస్టులు, దరఖాస్తు గడువు వివరాలు ఇలా ఉన్నాయి.. చదవండి: ఒంటరిగా ఉంటున్నారా?.. ఈ ఆప్షన్ మీ కోసమే.. -
తెలంగాణలో గ్రూప్–4 నోటిఫికేషన్‌పై మంత్రి హరీష్‌రావు క్లారిటీ
సాక్షిప్రతినిధి,సంగారెడ్డి/సదాశివపేట: వారం రోజుల్లో 28 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తా మని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. కొద్ది రోజుల్లోనే గ్రూప్–4 నోటిఫికేషన్ కూడా వస్తుందని తెలిపారు. గురువారం ఆయన సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పను లకు శంకుస్థాపనలు చేశారు. కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదా రులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి, సదాశివపేట, కంకోల్లలో జరిగిన సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లా డుతూ, నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలను వివరించారు. మరో పక్క బీజేపీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రూ.2,016 ఆసరా పింఛన్ ఇస్తుంటే, పక్కనే ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో కేవలం రూ.600 ఇస్తున్నార న్నారు. పొరుగునే ఉన్న బీదర్ (కర్ణాటక) వెళ్లి ఈ విషయాన్ని పరిశీలించాలని ప్రజ లకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.75 మాత్రమే పింఛన్ ఇచ్చేవారని, లబ్ధిదారులెవరైనా చనిపోతే.. వారి స్థానంలో మాత్రమే కొత్త లబ్ధిదారు లకు పింఛన్లు మంజూరయ్యేవని గుర్తు చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదనే విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఉచితాలు వద్దంటున్న కేంద్రం మాటలపై హరీశ్‌రావు స్పందిస్తూ, పేద లకు సంక్షేమ పథకాలు అమలు చేయ వద్దని చెబుతున్నారా..? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. దసరా నుంచి రూ.3 లక్షలు.. ఇంటి స్థలం ఉన్న పేదవారికి ఇంటి నిర్మా ణంకోసం రూ.3 లక్షలు ఇచ్చే పథకాన్ని దసరా నుంచి ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ కార్య క్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తదితరులు పాల్గొ న్నారు. కాగా, మంత్రి హరీశ్‌రావు పాల్గొన్న సదాశివపేట సభలో కోలుబావి ప్రాంతానికి చెందిన వడ్డె శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతడిని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎందుకు కిరోసిన్ పోసుకున్నావని విలేకరులు ప్రశ్నిం చగా, ఎన్కెపల్లి రోడ్డులో గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎకరా ఐదు గుంటల భూమిని అధికారులు తిరిగి తీసుకున్నా రన్నారు. అందులో గోదాం నిర్మించారని, ఇన్నాళ్లూ వేచిచూసినా ఎవరూ పరిహారం గురించి పట్టించుకోకపోవడంతో ఆత్మహ త్యాయత్నం చేసినట్లు తెలిపాడు. -
తెలంగాణ: గ్రూప్–4కు కొత్త సర్వీస్ రూల్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–4 కొలువులకు కొత్తగా సర్వీసు నిబంధనలను రూపొందిస్తోంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా ప్రస్తుతమున్న సర్వీసు రూల్స్‌లో మార్పులు చేయనుంది. ఇదివరకు 80:20 నిష్పత్తిలో స్థానిక, జనరల్ కేటగిరీల్లో ఉద్యోగాలు భర్తీ చేయగా ఇప్పుడు 95:5 నిష్పత్తిలో చేపట్టనుంది. ఈ క్రమంలో సర్వీసు నిబంధనలు కూడా స్థానిక అభ్యర్థులకు అధిక లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం మార్పులు చేస్తోంది. భవిష్యత్తులో ఉద్యోగులు పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు కొత్త నిబంధనలు ఆధారం కానున్నాయి. ఒకే దఫా నియామకాలతో... రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9 వేలకు పైబడిన గ్రూప్–4 ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా ఒకే దఫాలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్–4 కేటగిరీలో అత్యధికం జూనియర్ అసిస్టెంట్ పోస్టులే ఉన్నాయి. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఒకేసారి నియామకాలు చేపడుతుండటంతో ఉమ్మడి అంశాలకు తగినట్లుగా సర్వీసు నిబంధనలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నియామకాల సమయంలో సాధారణ నిబంధనలు అన్ని శాఖలకు ఒకే విధంగా ఉండనుండగా శాఖలవారీగా నియామకాలు పూర్తయి ఉద్యోగులు విధుల్లో చేరాక ఆయా శాఖలకు సంబంధించిన నిబంధనలు కూడా వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో కామన్ సర్వీస్ రూల్స్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం... అన్ని ప్రభుత్వ శాఖల నుంచి నిబంధనల వివరాలను సేకరిస్తోంది. సీఎస్ సోమేశ్‌కుమార్ మరికొన్ని శాఖల ఉన్నతాధికారులతో రెండ్రోజులుగా సమీక్షిస్తున్నారు. శాఖాధిపతుల నుంచి సమాచారం సేకరించినప్పటికీ లిఖితపూర్వక ఆధారాలను స్వీకరించాక ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సీఎస్ తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు 4–5 రోజుల్లో ప్రభుత్వానికి అందనున్నాయి. అవి అందిన వెంటనే సమీక్షించి గ్రూప్–4 నూతన సర్వీసు రూల్స్‌ను ఖరారు చేసే అవకాశాలున్నాయి. గజిబిజికి తెర పడేలా... ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన సర్వీసు రూల్స్‌లో ఉన్న లొసుగులతో స్థానికులకు తీవ్ర అన్యాయమే జరిగింది. ఉద్యోగ నియామకాల సమయంలో కోటా ప్రకారం నియమితులైనప్పటికీ పదోన్నతుల్లో స్థానిక ఉద్యోగులు వెనుకబడిపోయారు. పదోన్నతుల ఖాళీలను మెరిట్ ప్రకారం భర్తీ చేసినప్పటికీ జనరల్ కేటగిరీలోని ఖాళీలను ఇష్టానుసారంగా ప్రమోట్ చేయడంతో స్థానిక కోటా ఉద్యోగులు నష్టపోయారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ విధానంలో స్థానికతకు ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులతోనే భర్తీ కానున్నాయి. అలాగే ఓపెన్ కేటగిరీలోని 5 శాతం పోస్టుల్లోనూ స్థానికులకు వాటా దక్కనుంది. దీంతో మెజారిటీగా స్థానికులే ఉంటారు. ఫలితంగా ఉద్యోగుల పదోన్నతులు, ఇతర ప్రయోజనాల కల్పనలో స్థానికులకే ఎక్కువ లబ్ధి కలగనుంది. తాజాగా రూపొందుతున్న కొత్త సర్వీసు రూల్స్‌తో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన గజిబిజికి ఇక తెరపడినట్లే. మరోవైపు సర్వీసు రూల్స్ ఖరారయ్యాక గ్రూప్–4 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన వెంటనే ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం నుండి నియామక ఏజెన్సీకి స్పష్టమైన ఆదేశాలతో బాధ్యతలు సైతం అప్పగించనుంది. -
గ్రూప్–4పై తేల్చేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న గ్రూప్–4 కొలువుల ప్రకటనకు ఇప్పట్లో అడుగు ముందుకు పడే అవకాశం కనిపించడంలేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,163 గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి కదలిక లేదు. సీఎస్ ఆదేశాల ప్రకారం ఈనెల 29 నాటికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి శాఖల వారీగా ఇండెంట్లు (ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రోస్టర్ వారీగాకొలువుల భర్తీకి ప్రతిపాదనలు) సమ ర్పించాల్సి ఉంది. ఈమేరకు సమావేశంలో ప్రభుత్వ శాఖలకు సీఎస్ డెడ్‌లైన్ కూడా విధించారు. అయినా ఒక్క శాఖ నుంచి కూడా టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు చేరకపోవడం గమనార్హం. కారణం ఇదేనా? ప్రభుత్వ శాఖల వద్ద గ్రూప్–4 కేటగిరీలోకి వచ్చే కొలువుల ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో ఉంది. అయితే నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్ల వారీగా పోస్టులు, రోస్టర్ వారీగా భర్తీ చేయాల్సినవెన్ని? తదితర సమాచారాన్ని సిద్ధం చేసుకుని ప్రతిపాదనలు తయారు చేసుకోవాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఇటీవల ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. దీంతో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వ శాఖలు ఆ దిశగా గణాంకాలను సిద్ధం చేసుకోగా, వాటిని టీఎస్పీఎస్సీకి సమర్పించాల్సి ఉంది. టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పించే ముందు ఆయా ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన ఖాళీలకు తగినట్లుగా టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పిస్తారు. సాధారణంగా ఇదే పద్ధతి ప్రకారం ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఈనెల 29లోగా ప్రతిపాదనలు సమర్పించాలని సీఎస్ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ఆమేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వేచి చూసిన శాఖలు, నిర్దేశించిన గడువులోగా అవి వెలువడకపోవడంతో ప్రతిపాదనలు సమర్పించలేదని తెలుస్తోంది. హడావుడిగా సాగి.. వివిధ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9,163 పోస్టులను ప్రభుత్వం నోటిఫై చేసింది. వీటిని రిజర్వేషన్లకు అనుగుణంగా విభజించి నూతన జోనల్ విధానం ప్రకారంభర్తీ చేయాలి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో రెండు వారాల క్రితం ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి కూడా హాజరయ్యారు. రాజ్యాంగబద్ధమైన కమిషన్ చైర్మన్ దీనికి హాజరు కావడంతో అన్ని ప్రభుత్వ శాఖల్లో సైతం హడావుడి నెలకొంది. ప్రభుత్వ సమావేశాలకు ఆయన రావడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అయినప్పటికీ.. ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా ఉద్యోగాల భర్తీ వేగిరమైందని భావించారు. దీంతో దాదాపు అన్ని శాఖలు నిబంధనల ప్రకారం నిర్దేశించిన గడువులోగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాయి. కానీ తీరా గడువులోగా జీవోలు రాకపోవడంతో ఆ ప్రక్రియ ఎక్కడికక్కడే ఆగిపోయింది. -
9,168 గ్రూప్-4 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఇప్పటికే 18 వేలకు పైగా ఉద్యోగాలకు నియామక సంస్థలు ప్రకటనలు జారీ చేయగా.. త్వరలో గ్రూప్–4 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. గ్రూప్–4 కింద నిర్దేశించిన 9,168 ఖాళీల భర్తీకి ఈ నెలాఖరులోగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. గ్రూప్–1 కేటగిరీలో 503 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయగా ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. పోలీసు శాఖలో 17 వేల పోస్టుల భర్తీకి టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్లు విడుదల చేయగా.. దరఖాస్తుల స్వీకరణ గడువు ఒకట్రెండు రోజుల్లో ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో మొత్తం 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేయగా.. ఇప్పటికే దాదాపు పావువంతు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. తాజాగా గ్రూప్–4 కింద గుర్తించిన ఉద్యోగాలను కూడా ఒకే దఫాలో భర్తీ చేసేలా నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాల వారీగా ప్రతిపాదనలకు రూపకల్పన కొనసాగుతోంది. శాఖల వారీగానే ప్రతిపాదనల పరిశీలన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీపై సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి శాఖల వారీగా ఉన్న ఖాళీలు, రోస్టర్ పాయింట్ల ప్రకారం పోస్టులను నిర్దేశిస్తూ ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈనెల 29 నాటికి నిర్దేశించిన అన్ని ప్రభుత్వ శాఖలు ఖాళీలకు సంబంధించిన ఇండెంట్లను టీఎస్పీఎస్సీకి సమర్పించాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన తేదీలోగా ప్రతిపాదనలను సమర్పించినట్లైతే శాఖల వారీగా ప్రతిపాదనల పరిశీలనకు టీఎస్పీఎస్సీ తేదీలను ఖరారు చేయనుంది. దాదాపుగా గ్రూప్–4 పోస్టులన్నీ జిల్లా కేడర్‌కు చెందినవే అయినప్పటికీ.. జిల్లాల వారీగా కలెక్టర్ల సమన్వయంతో టీఎస్పీఎస్సీ పరిశీలన ప్రక్రియ సులభ సాధ్యం కాదు కాబట్టి, విభాగాధిపతుల ఆధ్వర్యంలో శాఖల వారీగానే ప్రతిపాదనలను పరిశీలించి రోస్టర్ పాయింట్లు, పోస్టుల ఖాళీలు తదితరాలపై స్పష్టత ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి దాదాపు మూడురోజులు పట్టే అవకాశం ఉంది. పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతిపాదనల్లో ఎలాంటి లోపాలు లేనిపక్షంలో జూన్ నెలాఖరులో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. స్థానికులకే 95శాతం ఉద్యోగాలు: సీఎస్ నూతన జోనల్ విధానంతో ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే అధిక ప్రాధాన్యం దక్కుతుందని సీఎస్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు. గురువారం బీఆర్కేఆర్ భవన్లో గ్రూప్–4 కొలువుల భర్తీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేడర్‌కు చెందిన గ్రూప్–4 ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే కేటాయించామని తెలిపారు. మిగతా 5 శాతంలో కూడా స్థానిక అభ్యర్థులకే ఎక్కువ అవకాశం దక్కుతుందన్నారు. ఇటీవల గ్రూప్–1 కింద 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించిందన్నారు. పోలీసు రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా కొనసాగుతుండగా, విద్యాశాఖకు కూడా టెట్ నిర్వహణకు క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ లేదా తత్సమాన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ క్యాడర్లలో ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేసి, తద్వారా ఏర్పడ్డ జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను కూడా నోటిఫై చేయాలని సీఎస్ అధికారులకు సూచించారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్టాంపులు– రిజిస్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, అటవీ శాఖ పీసీసీఎఫ్ డోబ్రియల్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా గ్రూప్-4 పరీక్ష
రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. అన్నకు బదులు తమ్ముడు పరీక్షకు హాజరై అధికారులకు దొరికిపోయూడు. అధికారుల నిర్లక్ష్యంతో 200 మంది అభ్యర్థులు అవస్థలు పడాల్సి వచ్చింది. సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో 5566 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎన్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు విద్యార్హతగా పదో తరగతిని నిర్ణయించింది. దీంతో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆగస్టు 25న పరీక్ష నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ పర్యాయం నిఘానీడలో పరీక్ష నిర్వహిం చేందుకు టీఎన్పీఎస్సీ వర్గాలు చర్యలు తీసుకున్నాయి. రాష్ట్రంలో 224 ప్రాంతాల్లోని 4755 కేంద్రాల్లో ఆదివారం పరీక్ష జరిగింది. 14 లక్షల మంది హాజరు: గ్రూప్-4 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది హాజరయ్యూరు. ఉదయాన్నే అభ్యర్థులు కేంద్రాలకు తరలివచ్చారు. చంటి బిడ్డలతో కొందరు పరీక్ష రాయడానికి వచ్చారు. విద్యార్హత పదో తరగతి అయినా పీజీలు చేసిన వాళ్లు సైతం పరీక్షకు హాజరుకావడం గమనార్హం. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. టీఎన్పీఎస్సీ చైర్మన్ నవనీత కృష్ణన్ నేతృత్వంలో 4,755 మంది చీఫ్ సూపర్వైజర్లు, 70,230 మంది సూపర్వైజర్లు, 4500 మంది తనిఖీ అధికారులు, 950 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది పరీక్ష సరళిని పర్యవేక్షించారు. ప్రతి కేంద్రంలో పరీక్ష నిర్వహణను వీడియో తీశారు. కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించారు. పరీక్ష ఫలితాలు అక్టోబరు చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అన్నకు బదులు తమ్ముడు ఓ కేంద్రంలో అన్నకు బదులుగా పరీక్ష రాయడానికి వచ్చిన తమ్ముడ్ని ఇన్విజిలేటర్ పట్టుకున్నాడు. సేలం కంకణాపురం నాచ్చియప్ప పాఠశాల కేంద్రంలో సత్యనారాయణ (30) పరీక్ష రాయడానికి వచ్చాడు. తనిఖీల అనంతరం అతడ్ని లోపలకు అనుమతించారు. అయితే ఇన్విజిలేటర్ పళనిస్వామికి అనుమానం కలిగింది. అతడ్ని మరోమారు పరిశీలించారు. అతడి హాల్‌టికెట్‌లో ఉన్న ఫొటోను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతం గదమాయించడంతో అసలు విషయం బయటపడింది. అన్నదమ్ముళ్లు ఒకేలా ఉండడంతో అన్న తిరు వెంగడానికి బదులు తమ్ముడు సత్యనారాయణ పరీక్ష రాయడానికి వచ్చి పట్టుబడ్డాడు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. కన్యాకుమారి జిల్లాలో గందరగోళం ఏర్పడింది. నాగుర్ కోవిల్లో ఉన్న కేంద్రాన్ని కన్యాకుమారి రోడ్డు అని పేర్కొనడంతో 200 మంది అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు ప్రత్యేక వాహనాల్ని ఏర్పాటు చేసి అభ్యర్థులను సకాలంలో సంబంధిత కేంద్రానికి చేర్చారు.