సాక్షి, హైదరాబాద్: గ్రూప్–4 పరీక్షకు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగే ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 9 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు శుక్రవారం టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మొత్తం 2,878 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్–2 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది.
ప్రతి పరీక్ష కేంద్రంలో ఇద్దరు పోలీసు అధికారులకు డ్యూటీలు కేటాయించారు. ప్రధానంగా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేందుకు ఒక మహిళా కానిస్టేబుల్, జనరల్ కానిస్టేబుల్ ఉంటారని తెలిపింది. వీరు అభ్యర్థుల హాల్‌టికెట్లు, ఫొటో గుర్తింపు కార్డును పరిశీలించిన అనంతరం అభ్యరి్థని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే హాలులోకి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు చేరుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment