తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాల విడుదల | TSPSC Released Group 4 Results Updates | Sakshi
Sakshi News home page

TSPSC: తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాల విడుదల

Published Fri, Feb 9 2024 9:37 PM | Last Updated on Fri, Feb 9 2024 9:37 PM

TSPSC Released Group 4 Results Updates - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో గ్రూప్‌-4 ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును కమిషన్‌ ప్రకటించింది. https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో ర్యాంకులు చూసుకోవాలని అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ సూచించింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కమిషన్‌ తెలిపింది.

గతేడాది తెలంగాణలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కిందటి ఏడాది జులైలో గ్రూప్‌-4 పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. అందులో 7,62,872 మంది పేపర్-1 రాశారు. 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు. టీఎస్‌పీఎస్సీ ఫైనల్ కీ కూడా విడుద‌ల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement