సాక్షి, హైదరాబాద్: గతంలో నోటిఫికేషన్ వస్తే భర్తీ ప్రక్రియ ఏళ్లు పట్టేదని.. ఇప్పుడు రెండు నెలల్లో పూర్తి చేస్తున్నామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒకట్రెండు సమస్యలకు వ్యవస్థనే తప్పు పట్టడం సరికాదన్నారు. గ్రూప్-4 ఫలితాలకు ఇంకా సమయం ఉందని జనార్థన్‌రెడ్డి అన్నారు.
కాగా, ఈ పరీక్షను జూలై 1వ తేదీన నిర్వహించిన విషయం తెల్సిందే. మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్-1కు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
చదవండి: ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో మంత్రి మల్లారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment