TSPSC Group 4 Notification 2022 Released for 9168 Vacancies, Check Details - Sakshi
Sakshi News home page

తెలంగాణ: గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే..

Published Thu, Dec 1 2022 4:56 PM | Last Updated on Thu, Dec 1 2022 5:29 PM

Telangana: TSPSC released group 4 Notification December 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌. గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ను గురువారం అధికారికంగా రిలీజ్‌ చేసింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌. 

మొత్తం 9,168 పోస్టులకుగానూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. అగ్రికల్చర్‌, కో ఆపరేటివ్ శాఖలో 44 పోస్టులు,  పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్ మెంట్‌లో 2, బీసీ వెల్ఫేర్‌లో 307,  పౌర సరఫరాల శాఖలో 72,  ఆర్ధిక శాఖలో 255 మున్సిపల్, అర్బన్ డెవల్మెంట్ లో 2, 701 పోస్టులు,  ఉన్నత విద్యా శాఖలో 742 పోస్టులు,  రెవెన్యూ శాఖలో 2,077 ఎస్సీ వెల్ఫేర్ లో 474 పోస్టులకుగానూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

లేబర్ డిపార్ట్మెoట్ లో 128 పోస్టులు,  ట్రైబల్ వెల్ఫేర్ లో 221 పోస్టులు,  హోమ్ శాఖలో 133 పోస్టులు,  పాఠశాల విద్యా శాఖలో 97 పోస్టులు ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ నెల 23 నుంచి జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది టీఎస్‌పీఎస్సీ. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement