Telangana Government Given Permission To Fill Group 4 Posts - Sakshi
Sakshi News home page

Group 4 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్‌

Published Fri, Nov 25 2022 7:10 PM | Last Updated on Sat, Nov 26 2022 8:00 AM

Telangana government has given permission for Group 4 posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌–4 ఉద్యోగ నియామకాలకు లైన్‌క్లియర్‌ అయింది. మొత్తం 9,168 గ్రూప్‌–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లోని 80 వేల ఉద్యోగాల భర్తీ చేపడతామన్న ప్రభుత్వం ఇప్పటికే 50 వేల ఉద్యోగ నియామకాలకు అనుమతులు ఇచి్చంది. కొన్నింటికి నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. ఇందులో అత్యధికం పోలీసుశాఖకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువగా ఉన్నవి గ్రూప్‌–4 ఉద్యోగాలే. మరో 9,096 పోస్టులు గురుకుల నియామకాల బోర్డు పరిధిలో ఉన్నాయి. 

శాఖల వారీగా ప్రతిపాదనలు 
రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన 9,168 గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలు ముందుగా టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. శాఖల వారీగా మంజూరు చేసిన పోస్టులకు సంబంధించి రోస్టర్‌ పాయింట్లు, రిజర్వేషన్లకు అనుగుణంగా ఈ ప్రతిపాదనలు సమర్పిస్తారు. ఆ ప్రతిపాదనలను టీఎస్‌పీఎస్సీ పూర్తిస్థాయిలో పరిశీలిస్తుంది. అన్ని అంశాలు లోపాలకు తావులేకుండా ఉన్నట్టు సంతృప్తి చెందిన తర్వాత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.

ప్రస్తుతం గ్రూప్‌–4 కేటగిరీలో భర్తీకి అనుమతించిన మొత్తం 9,168 పోస్టులకు ఒకే నోటిఫికేషన్‌ వెలువనున్నట్టు సమాచారం. ఈ పోస్టుల్లో వివిధ ఉద్యోగాలు కలిపి సగానికిపైగా మున్సిపల్, రెవెన్యూ శాఖల పరిధిలోనే ఉండటం గమనార్హం. గ్రూప్‌–4 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఇక సాధన మొదలుపెట్టి కొలువు దక్కించుకునేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రా>వు శుక్రవారం ట్విట్టర్‌ వేదికగా పిలుపునిచ్చారు. 

విధుల వారీగా పోస్టుల లెక్కలివీ.. 
1) జూనియర్‌ అకౌంటెంట్లు: 429 
2) జూనియర్‌ అసిస్టెంట్లు: 6,859 
3) జూనియర్‌ ఆడిటర్‌: 18 (డైరెక్టర్‌ స్టేట్‌ ఆడిట్‌) 
4) వార్డ్‌ ఆఫీసర్‌: 1,862 (మున్సిపల్‌ శాఖ) 
మొత్తం పోస్టులు                :    9,168

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement