Telangana State Public Service Commission (TSPSC)
-
మూడోసారి గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్–1 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆదివారం జరగనున్న ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని.. ఉదయం 10 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని కమిషన్ స్పష్టం చేసింది. గుర్తింపు కార్డు చూపిస్తేనే అభ్యర్థులను అనుమతించనుంది. రెండుసార్లు రద్దు.. కమిషన్ తొలిసారిగా 2022 ఏప్రిల్‌లో గూప్–1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కమిషన్‌ను ప్రక్షాళన చేపట్టడంతోపాటు కొత్తగా 60 గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్ కోఆర్డినేటర్... గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను పకడ్బందీగా నిర్వహించే చర్యల్లో భాగంగా ప్రతి జిల్లాకు అదనపు కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారిని నోడల్ అధికారులుగా.. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్ కోఆర్డినేటర్‌ను ప్రభుత్వం నియమించింది. బయోమెట్రిక్ హాజరు కోసం ప్రత్యేక వ్యవస్థను కమిషన్ ఏర్పాటు చేసింది. 897 కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, లోకల్ రూట్ ఆఫీసర్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను ఇప్పటికే నియమించారు.ప్రతి కేంద్రానికి ఒక సిట్టింగ్ స్వా్కడ్ బృందం ఉంటుంది. ప్రతి 3 నుంచి 5 కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ స్వా్క డ్ బృందం ఉంటుంది. ప్రతి వంద మంది అభ్యర్థులకు ఒక చెకింగ్ అధికారిని నియమించారు. గ్రూప్–1 పరీక్షా కేంద్రం చుట్టూ బందోబస్తు ఏర్పాటుతోపాటు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కమిషన్ తెలిపింది.గ్రూప్–1 అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలుసాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఆదివారం నిర్వహిస్తున్న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో కాలంగా కష్టపడి పరీక్షకు సిద్ధమైన అభ్య ర్థులు సమయానికి కేంద్రాలకు చేరుకుని ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయాలని సూచించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు గ్రూప్–1 ప్రిలిమ్స్ అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆదివారం ప్రత్యేక బస్సులు నడపనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 897 పరీక్ష కేంద్రాలకు బస్సులను నడపాల ని అధికారులను యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు శనివారం సాయంత్రం నుంచే ఎంజీబీఎస్, జేబీ ఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ పాయింట్లనుంచి బస్సు సర్వీసులు నడిపింది. -
జిల్లా కేటగిరీ పోస్టులకు 1:3 నిష్పత్తి!
సాక్షి, హైదరాబాద్: నోటిఫికేషన్లో నిర్దేశించిన పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగా అత్యధిక సంఖ్యలో కొలువులున్న జిల్లాస్థాయి ఉద్యోగ కేటగిరీలో ప్రాథమిక అర్హుల జాబితా ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించనుంది. జిల్లాస్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో గ్రూప్–4 ఉద్యోగాలు పెద్దసంఖ్యలో ఉన్నా యి. దాదాపు 9 వేల ఉద్యోగాలుండగా... వీటి భర్తీకి 1:3 నిష్పత్తి ఫార్మూలానే అమలు చేయనున్నారు. దీంతో పాటు జిల్లాస్థాయిలోకి వచ్చే ఇతర పోస్టులకూ ఇదే ఫార్ములా అమలు చేయనున్నట్టు సమాచారం. ఈ పద్ధతిలో ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయడంతో అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని కమిషన్ భావిస్తోంది. ఇక జోనల్, మలీ్టజోనల్ స్థాయి ఉద్యోగాలను మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఈ అంశాలపై మథనం చేస్తున్న కమిషన్ అతి త్వరలో నిర్ణయం తీసుకొని ఆమేరకు అమలు చేయనున్నట్టు తెలిసింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. పెండింగ్‌లో ఉన్న అర్హత పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇప్పటివరకు నిర్వహించిన అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు ‘కీ’లు, జవాబుపత్రాల ‘కీ’, మెజారిటీ పరీక్షలకుగాను జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)లను కూడా కమిషన్ విడుదల చేసింది. జీఆర్ఎల్కు సంబంధించి ఇప్పుడు ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయాల్సి ఉంది. దీనికోసం అంతర్గత ప్రక్రియను అధికారులు వేగవంతం చేసినట్టు సమాచారం. ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలో టీఎస్పీఎస్సీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ, చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం జిల్లాస్థాయి, జోనల్‌స్థాయి, మలీ్టజోనల్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా... ఇప్పటివరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకాల బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ)లు ప్రాథమిక జాబితాల ఎంపికలో 1:2 నిష్పత్తిని నిర్ధారించుకుని ఉద్యోగాల భర్తీ పూర్తి చేశాయి. దాదాపు 33వేల ఉద్యోగాలను ఇదే పద్ధతిలో భర్తీ చేశారు. నోటిఫికేషన్లో నిర్ధేశించిన పోస్టులు, భర్తీ ప్రక్రియ పరిశీలిస్తే దాదాపు 15శాతం కొలువులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఒక్కో అభ్యరి్థకి రెండు, అంతకేంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం, అన్ని రకాల పోస్టులకు సంబంధించి ధృవపత్రాల పరిశీలనకు హాజరుకావడం, ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొలువు ఎంచుకోవడం, సరైన అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా మిగిలిపోయినట్టు అధికారవర్గాలు భావిస్తున్నాయి. దీంతో అర్హుల ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించాలని నిర్ణయించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం: టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. పెండింగ్‌లో ఉన్న అర్హత పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇప్పటివరకు నిర్వహించిన అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు ‘కీ’లు, జవాబుపత్రాల ‘కీ’, మెజారిటీ పరీక్షలకుగాను జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)లను కూడా కమిషన్ విడుదల చేసింది. జీఆర్ఎల్కు సంబంధించి ఇప్పుడు ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయాల్సి ఉంది. దీనికోసం అంతర్గత ప్రక్రియను అధికారులు వేగవంతం చేసినట్టు సమాచారం. ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలో టీఎస్పీఎస్సీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ, చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం జిల్లాస్థాయి, జోనల్‌స్థాయి, మలీ్టజోనల్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా... ఇప్పటివరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకాల బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ)లు ప్రాథమిక జాబితాల ఎంపికలో 1:2 నిష్పత్తిని నిర్ధారించుకుని ఉద్యోగాల భర్తీ పూర్తి చేశాయి. దాదాపు 33వేల ఉద్యోగాలను ఇదే పద్ధతిలో భర్తీ చేశారు. నోటిఫికేషన్లో నిర్ధేశించిన పోస్టులు, భర్తీ ప్రక్రియ పరిశీలిస్తే దాదాపు 15శాతం కొలువులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఒక్కో అభ్యరి్థకి రెండు, అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం, అన్ని రకాల పోస్టులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావడం, ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొలువు ఎంచుకోవడం, సరైన అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా మిగిలిపోయినట్టు అధికారవర్గాలు భావిస్తున్నాయి. దీంతో అర్హుల ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించాలని నిర్ణయించారు. -
గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ అనుమతి
-
నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-4 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–4 ఉద్యోగ నియామకాలకు లైన్‌క్లియర్ అయింది. మొత్తం 9,168 గ్రూప్–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లోని 80 వేల ఉద్యోగాల భర్తీ చేపడతామన్న ప్రభుత్వం ఇప్పటికే 50 వేల ఉద్యోగ నియామకాలకు అనుమతులు ఇచి్చంది. కొన్నింటికి నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. ఇందులో అత్యధికం పోలీసుశాఖకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువగా ఉన్నవి గ్రూప్–4 ఉద్యోగాలే. మరో 9,096 పోస్టులు గురుకుల నియామకాల బోర్డు పరిధిలో ఉన్నాయి. శాఖల వారీగా ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన 9,168 గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలు ముందుగా టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. శాఖల వారీగా మంజూరు చేసిన పోస్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లకు అనుగుణంగా ఈ ప్రతిపాదనలు సమర్పిస్తారు. ఆ ప్రతిపాదనలను టీఎస్పీఎస్సీ పూర్తిస్థాయిలో పరిశీలిస్తుంది. అన్ని అంశాలు లోపాలకు తావులేకుండా ఉన్నట్టు సంతృప్తి చెందిన తర్వాత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ప్రస్తుతం గ్రూప్–4 కేటగిరీలో భర్తీకి అనుమతించిన మొత్తం 9,168 పోస్టులకు ఒకే నోటిఫికేషన్ వెలువనున్నట్టు సమాచారం. ఈ పోస్టుల్లో వివిధ ఉద్యోగాలు కలిపి సగానికిపైగా మున్సిపల్, రెవెన్యూ శాఖల పరిధిలోనే ఉండటం గమనార్హం. గ్రూప్–4 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఇక సాధన మొదలుపెట్టి కొలువు దక్కించుకునేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రా>వు శుక్రవారం ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. విధుల వారీగా పోస్టుల లెక్కలివీ.. 1) జూనియర్ అకౌంటెంట్లు: 429 2) జూనియర్ అసిస్టెంట్లు: 6,859 3) జూనియర్ ఆడిటర్: 18 (డైరెక్టర్ స్టేట్ ఆడిట్) 4) వార్డ్ ఆఫీసర్: 1,862 (మున్సిపల్ శాఖ) మొత్తం పోస్టులు : 9,168 -
గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 75% హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 2,86,051 మంది హాజరైనట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ పద్ధతిలో హాజరును స్వీకరించినట్లు తెలిపింది. స్వరాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న పరీక్ష కావడంతో ఎక్కడా అవకతవకలకు అవకాశం లేకుండా టీఎస్పీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించింది. ప్రతి జిల్లాకు ఒక కోఆర్డినేటర్‌తోపాటు సిట్టింగ్ స్క్వాడ్లు, 61 మంది లైజనింగ్ అధికారులు, జిల్లా అధికారుల ద్వారా పరీక్ష నిర్వహించింది. 8 పని దినాల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్... అభ్యర్థుల ఓఎంఆర్ జవాబుపత్రాలను స్కానింగ్ చేసి వెబ్సైట్లో అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఇందుకు 8 పనిదినాలు పడుతుందని భావిస్తోంది. ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాకే ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనుంది. ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినందుకు టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి కలెక్టర్లు, అధికారులను అభినందించారు. అభ్యర్థిని సకాలంలో పరీక్షా కేంద్రానికి చేర్చిన పోలీసులు మెదక్ జోన్: మెదక్ జిల్లా కేంద్రంలోని గీతా జూనియర్ కాలేజీలో కిషన్ అనే అభ్యర్థి పరీక్ష రాయాల్సి ఉండగా అతను పొరపాటున అక్కడికి 2 కి.మీ. దూరంలోని సాధన జూనియర్ కళాశాలకు వచ్చాడు. అప్పటికే సమయం ఉదయం 10:13 గంటలు కావడం.. అభ్యర్థులను 10:15 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించే అవకాశం లేకపోవడంతో ఆ యువకుడు ఆందోళన చెందుతూ కనిపించాడు. దీంతో అక్కడే ఉన్న డీఎస్పీ సైదులు, సీఐ మధు తమ ఎస్కార్ట్ వాహనంలో కిషన్‌ను సకాలంలో గీతా కాలేజీకి పంపారు. ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సైరన్ మోగిస్తూ 2 కి.మీ. దూరంలోని గీత కాలేజీకి ఒకటిన్నర నిమిషంలోనే తీసుకెళ్లాడు. గ్రూప్–1 పరీక్ష రాసిన ఖైదీ ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జాదవ్ రమేశ్ అనే యువకుడు నిర్మల్ జిల్లా కోర్టు అనుమతితో ఆదివారం గ్రూప్–1 ప్రిలిమ్స్ రాశాడు. ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న కేసులో అరెస్టయిన రమేశ్ 45 రోజులుగా జిల్లా జైలులో ఖైదీగా ఉన్నాడు. ఆదిలాబాద్‌లో.. పరీక్ష రాసి బయటకు వస్తున్న ఖైదీ జాదవ్ రమేశ్‌తో పోలీసులు చిన్నారికి ఏసీపీ లాలింపు.. ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్ రోడ్‌లోని ఏఎస్ఎం మహిళా డిగ్రీ కళాశాల కేంద్రానికి 2 నెలల పసిబిడ్డతో వచ్చి ఓ తల్లి పరీక్ష రాస్తుండగా ఆ చిన్నారి ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది. అప్పుడే పరీక్ష కేంద్రాన్ని సందర్శించేందుకు మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్‌తో కలసి వచ్చిన వరంగల్ ఏసీపీ కలకోట్ల గిరికుమార్ ఆ చిన్నారిని ఎత్తుకొని∙కాసేపు లాలించారు. ప్రశాంతంగా పరీక్ష రాయాలని... బిడ్డను క్షేమంగా చూసుకుంటామని పాప తల్లికి చెప్పారు. అక్కడే ఉన్న ఏఎస్సై స్వరూపరాణికి బిడ్డను అప్పగించారు. వరంగల్‌లో.. చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తున్న ఏసీపీ గిరికుమార్ ఆభరణాలు తొలగిస్తేనే ప్రవేశం.. అభ్యర్థులు ఆభరణాలు ధరించి రాకూడదని టీఎస్పీఎస్సీ నిబంధన విధించినా కొన్నిచోట్ల మహిళలు గాజులు, కమ్మలు, చైన్లు, కాళ్ల పట్టీలతో కేంద్రాలకు చేరుకున్నారు. ఇందుకు ఎగ్జామ్ సెంటర్ల నిర్వాహకులు అభ్యంతరం తెలపడంతో వారు ఆభరణాలను తొలగించడం కనిపించింది. కాగా, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాదె రుక్మారెడ్డి పరీక్ష కేంద్రంలో ఒంటి గంటకు ముగించాల్సిన పరీక్షకు.. పది నిమిషాలు ఆలస్యంగా పేపర్లు తీసుకున్నారని కొందరు అభ్యర్థులు ఆరోపించారు. -
TS: అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షపై స్పష్టత ఇచ్చింది. ఇదివరకే గ్రూప్–1 నోటిఫికేషన్లో వెల్లడించినట్లుగా ప్రిలిమ్స్ పరీక్షను జూలై/ఆగస్టు నెలల్లో నిర్వహించాల్సి ఉండగా, వివిధ కారణాలతో అక్టోబర్‌కు వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన కమిషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరీక్ష తేదీ ఖరారుకు సంబంధించి చర్చ జరిగింది. వివిధ రకాల పరీక్షలున్న సమయంలో గ్రూప్–1 పరీక్ష నిర్వహించొద్దని, తేదీని కొన్నిరోజులు వాయిదా వేయాలని పలువురు టీఎస్పీఎస్సీకి వినతులు, లేఖలు సమర్పించారు. ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో పోలీసు ఉద్యోగాల అర్హత పరీక్షలు, జాతీయ స్థాయిలో యూపీఎస్సీ, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ ఉద్యోగ అర్హత పరీక్షలు కూడా ఉన్నాయి. గ్రూప్–1 ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భారీ స్పందన వచ్చినందున సన్నద్ధతకు మరిం త సమయం ఇవ్వాలంటూ కోరడంతో కమిషన్ సానుకూలంగా స్పందించింది. మరోవైపు రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారి గ్రూప్–1 నియామకాలు జరగనున్నాయి. వివిధ శాఖల్లో 503 గ్రూప్–1 పోస్టులకు ఏకంగా 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. అక్టోబర్ 16న ప్రిలిమ్స్ నిర్వహించనున్న నేపథ్యంలో మెయిన్ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన తేదీలను ప్రిలిమ్స్ పరీక్షల తర్వాత కమిషన్ వెల్లడించనుంది. -
గ్రూప్–1 నోటిఫికేషన్.. రేపే గుడ్‌న్యూస్..!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగ భర్తీ ప్రక్రియలో ముందడుగు పడింది. ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలను ఇప్పటికే ఒకట్రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆయా శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరింది. శనివారం బోర్డు సమావేశంలో దాదాపు అన్ని శాఖల ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించగా సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే గ్రూప్–1లో ఇంటర్వ్యూలు రద్దు చేసినందున దీనికి సంబంధించిన జీవో సోమవారం ఉదయానికి వస్తే సాయంత్రానికి 503 గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావొచ్చని సమాచారం. చదవండి👉 ఇక పరీక్షలన్నీ సకాలంలోనే.. -
జూలై మొదటి వారంలో గ్రూప్–2 ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ఇంటర్వ్యూలను జూలై మొదటి వారంలో ప్రారంభిస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇంటర్వ్యూల ప్రక్రియను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టంచేశారు. అలాగే ఉపాధ్యాయ నియామకాల ఎంపిక చేపట్టామని, ఆ జాబితాను విద్యాశాఖకు పంపించామని పేర్కొన్నారు. చక్రపాణి నేతృత్వంలోని కమిషన్ ప్రతినిధి బృందం బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ 2017–18 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను ఆయనకు అందజేసింది. టీఎస్పీఎస్సీ చేపడుతున్న సంస్కరణలపైనా గవర్నర్‌కు నివేదిక సమర్పించింది. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీలో సిబ్బంది నియామకం, భవనాల కేటాయింపు వంటి అంశాలపై చర్చ జరిగింది. టీఎస్పీఎస్సీలో వార్షిక కేలండర్ అమలు, గ్రూప్–1 నోటిఫికేషన్ తదితర అంశాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రూప్–2 నియామకాలకు సంబంధించిన వివరాలపైనా ఆరా తీశారు. గ్రూప్–1కు సంబంధించి జోన్లవారీగా పోస్టుల విభజనకు సర్కారు కసరత్తు చేస్తోందని ఆయనకు వివరించినట్టు తెలిసింది. రెండు నెలలపాటు ఇంటర్వ్యూలు... ఎలాంటి వివాదాలు, అభియోగాలు లేకుండా సమగ్రమైన పద్ధతిలో ఎప్పటికప్పుడు నియామకాలు పూర్తిచేస్తున్నందున టీఎస్పీఎస్సీని గవర్నర్ అభినందించారని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రూప్–2లో 1,032 పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంపికైనవారి జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా జాబితాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసి, జూలై మొదటివారంలో ఇంటర్వ్యూలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 2,064 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉన్నందున ఈ ప్రక్రియ పూర్తికావడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు చేపట్టిన నియామకాలకు సంబంధించిన వివరాలను గవర్నర్‌కు అందజేసినట్టు వెల్లడించారు. మొత్తం 39,659 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, అందులో 3,186 పోస్టులకు ఆయా శాఖల నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. 128 గ్రూప్–2 పోస్టులు మినహా 36,474 పోస్టులను నోటిఫై చేశామని, అందులో 26,259 పోస్టులను భర్తీ చేసినట్లు వివరించారు. 3,494 పోస్టుల మెరిట్ æజాబితాలను విడుదల చేశామని, అవి సర్టిఫికెట్ల పరిశీలన వంటి వివిధ దశల్లో ఉన్నాయని చక్రపాణి తెలిపారు. గవర్నర్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో టీఎస్పీఎస్సీ సభ్యులు సి.విఠల్, సాయిలు, మతీనుద్దీన్ ఖాద్రీ, కమిషన్ కార్యదర్శి వాణిప్రసాద్ తదితరులు ఉన్నారు. -
తెలుగులో ఏఈఈ జనరల్ స్టడీస్ పేపరు
హైదరాబాద్ : ఏఈఈ పరీక్షల్లో భాగంగా జనరల్ స్టడీస్ పేపర్ తెలుగులో ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్పీఎస్పీ ఛైర్మన్ ప్రొ. గంటా చక్రపాణి వెల్లడించారు. ఆదివారం జరగనున్న ఈ ఏఈఈ ఆన్లైన్ పరీక్షపై శుక్రవారం హైదరాబాద్‌లో టీఎస్పీఎస్పీ ఛైర్మన్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ ప్రొ. గంటా చక్రపాణి తెలిపారు. ఆదివారం నిర్వహించే ఈ ఆన్ లైన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయి.