
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగ భర్తీ ప్రక్రియలో ముందడుగు పడింది. ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలను ఇప్పటికే ఒకట్రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఆయా శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరింది. శనివారం బోర్డు సమావేశంలో దాదాపు అన్ని శాఖల ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించగా సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే గ్రూప్–1లో ఇంటర్వ్యూలు రద్దు చేసినందున దీనికి సంబంధించిన జీవో సోమవారం ఉదయానికి వస్తే సాయంత్రానికి 503 గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావొచ్చని సమాచారం.
చదవండి👉 ఇక పరీక్షలన్నీ సకాలంలోనే..
Comments
Please login to add a commentAdd a comment