group-1 notification
-
గ్రూప్–1 కొత్త నోటిఫికేషన్.. 563 ఖాళీల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సోమవారం సాయంత్రం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. 503 గ్రూప్–1 ఉద్యోగ నియామకాల కోసం 2022 ఏప్రిల్ 26న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. తాజా నోటిఫికేషన్ మేరకు 18 శాఖల్లో 563 పోస్టులకు సంబంధించిన ప్రిలిమ్స్ రాత పరీక్ష కోసం ఈ నెల 23 నుంచి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటిల్లో పొరపాట్లు సవరించుకునేందుకు మార్చి 23వ తేదీనుంచి 27వ తేదీ సాయంత్రం 5 వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. మెయిన్ పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లు వివరించింది. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష సమయం కంటే 4 గంటల ముందు వరకు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివిధ కారణాలతో 2022లో విడుదల చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్ రద్దు చేయగా... అప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా మళ్లీ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని, ఫీజు మాత్రం చెల్లించక్కర్లేదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ (ఆప్టికల్ మార్కింగ్) లేదా సీబీఆర్టీ (కంప్యూటర్ బేస్డ్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపింది. పోస్టుల వారీగా అర్హతలు, పరీక్షల నిర్వహణ, మార్కులు, సిలబస్ తదితర పూర్తిస్థాయి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పెరిగిన పోస్టుల సంఖ్య మహిళలకు హారిజాంటల్ (సమాంతర) పద్ధతి (ప్రత్యేకంగా ఎలాంటి రోస్టర్ పాయింట్ మార్కింగ్ లేకుండా)లో రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో మహిళలకు కేటగిరీల వారీగా పోస్టులను ప్రత్యేకంగా రిజర్వ్ చేయలేదు. కానీ మొత్తంగా 33 1/3 (33.3) శాతం ఉద్యోగాలను మాత్రం కేటాయించనుంది. ఈ క్రమంలో మల్టీజోన్ల వారీగా పోస్టులు, అదేవిధంగా జనరల్ కేటగిరీతో పాటు కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా ఉన్న పోస్టులను కమిషన్ వెల్లడించింది. తాజా నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య 60 పెరగడం గమనార్హం. పరిస్థితులపై చర్చించి రద్దు నిర్ణయం గ్రూప్–1 ఉద్యోగ నియామకాల విషయంలో నెలకొన్న పరిస్థితులపై టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూలంకషంగా చర్చించామని, 2022 ఏప్రిల్ 26న జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికొలస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా భారీ సంఖ్యలో గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ 2022 ఏప్రిల్ 26న నోటిఫికేషన్ జారీ చేసింది. అవకతవకలకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ కోసం అప్పటి ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసింది. 503 ఉద్యోగాల కోసం ఏకంగా 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించింది. అదే ఏడాది చివర్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు అవకాశం కల్పించే లక్ష్యంతో 1:50 నిష్పత్తిలో అర్హుల జాబితాను విడుదల చేసింది. 2023 ఏడాది ఆగస్టులో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో అభ్యర్థులు కఠోర దీక్షతో సన్నద్ధతను ప్రారంభించారు. కానీ గతేడాది మార్చిలో పలు టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. గ్రూప్–1 ప్రశ్నపత్రాలు సైతం బయటకు వెళ్లాయని తేలడంతో ప్రిలిమినరీ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. 2023 జూన్ 11న మరోమారు ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే రెండోసారి టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్ష నిర్వహణలో లోపాలు జరిగాయని నిర్ధారిస్తూ హైకోర్టు పరీక్ష రద్దుకు ఆదేశించింది. దీనిపై టీఎస్పీఎస్సీ సుప్రీకోర్టును ఆశ్రయించింది. అ తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం, కా>ంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపట్టడం, కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయడం, కొత్తగా మరో 60 గ్రూప్–1 ఖాళీలను గుర్తించడం లాంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకున్నాయి. తాజాగా గ్రూప్–1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించడంతో గత కొంతకాలంగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించినట్లు కమిషన్ తెలిపింది. అయితే గత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్పీఎస్సీ..ఏ కారణాలతో రద్దు చేసిందీ పూర్తిస్థాయిలో వివరించలేదు. ప్రిలిమ్స్ మూడోసారి..! రికార్డు స్థాయిలో గ్రూప్–1 ఉద్యోగ ఖాళీలు ఉండడంతో గతంలో నిరుద్యోగులు ఎన్నో ఆశలతో దరఖాస్తు చేసుకున్నారు. కానీ కఠోర దీక్షతో అభ్యర్థులు పడిన శ్రమ వృథా ప్రయాసే అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్ వెలువడి దాదాపు రెండు సంవత్సరాలు కాగా.. అభ్యర్థులు ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలు రాయడం గమనార్హం. కాగా కొత్త నోటిఫికేషన్ జారీతో మూడోసారి ప్రిలిమ్స్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
15 రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే పదిహేను రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. గ్రూప్–1లో 60 కొత్త ఖాళీల భర్తీ చేపడతామని తెలిపారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీపరీక్షలకు సిద్ధం కావాలని, ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో.. 441 మంది సింగరేణి కార్మీకుల వారసులకు కారుణ్య నియామక పత్రాలను సీఎం అందజేశారు. అనంతరం మాట్లాడారు. గత ప్రభుత్వంలో సింగరేణి తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, తాము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా, అంబేడ్కర్ సాక్షిగా నియామక పత్రాలను అందజేస్తున్నామన్నారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మీకుల పాత్రను ఎవరూ తగ్గించలేరని, పారీ్టలు విఫలమైన సమయంలోనూ కార్మీకులు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. సింగరేణి అండగా నిలిచింది రాష్ట్రంలోని గత ప్రభుత్వం సింగరేణిని ఖాయిలా పడేలా చేసిందని, కేంద్రం కూడా సింగరేణికి అనేక అడ్డంకులు సృష్టించిందని సీఎం ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం కాంగ్రెస్‌కు అండగా నిలిచి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిందన్నారు. సింగరేణిలో 80శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించే అంశంపై చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కారుణ్య నియామకాల వయసు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, కోవ లక్షి్మ, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, సింగరేణి ఎండీ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు మరో శుభవార్త
సాక్షి, అమరావతి: ఇప్పటికే 897 పోస్టులతో గ్రూప్–2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్–1 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 81 గ్రూప్–1 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. గురువారం గ్రూప్–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మరో నోటిఫికేషన్ విడుదల అవ్వడం పట్ల ఉద్యోగార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్–1 అభ్యర్థులు తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ఆధారంగా జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ పేర్కొంది. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని, ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మార్చి 17న ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు సర్వీస్ కమిషన్ పేర్కొంది. డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది. కమిషన్ ప్రకటించిన గ్రూప్–1 విభాగంలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్ ట్యాక్స్ కమిషనర్స్ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్స్, ఆర్టీవో, గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు సైతం ఆఫ్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహించనున్నారు. మొత్తం పోస్టులు, వేతనం, అర్హతలతో కూడిన పూర్తి సమాచారం కమిషన్ వెబ్సైట్ https://psc. ap.gov.in లో ఉంచినట్టు కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. కాగా, ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతినిచ్చిన మరికొన్ని పోస్టులకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేసింది. వివాదరహితంగా పోస్టుల భర్తీ గతంలో ఉండే అనేక న్యాయపరమైన వివాదాలను, చిక్కులను పరిష్కరించి ప్రభుత్వం సర్వీస్ కమిషన్‌లో సంస్కరణలు తీసుకొచ్చింది. దాంతో గతేడాది ఏపీపీఎస్సీ ఇచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి వివాదాలకు తావులేకుండా 11 నెలల కాలంలో పూర్తి పారదర్శకంగా మెయిన్స్, ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసింది. గ్రూప్–1 పరీక్షలు, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక సమర్థవంతంగా నిర్వహించి, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాన్ని అంచనా వేసి ఎంపిక చేశారు. ఈ నియామకాలు అతి తక్కువ సమయంలోనే కమిషన్ పూర్తి చేసింది. ఇదే తరహాలో ఇప్పుడు ప్రకటించిన నోటిఫికేషన్లలో ఇచ్చిన పోస్టులు సైతం సమర్థవంతంగా, సత్వరం భర్తీ చేసేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. -
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
-
ఏపీలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
సాక్షి, అమరావతి :రాష్ట్రంలో గ్రూప్–1 కేడర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్లో గ్రూప్–1 పోస్టులతో పాటు అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్–1 పోస్టులు 92 ఉండగా అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పోస్టులు 17 ఉన్నాయి. ఇక గ్రూప్–1 పోస్టుల దరఖాస్తుకు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు, ఎఎంవిఐ పోస్టులకు నవంబర్ 2 నుంచి 22 వరకు గడువు విధించారు. పూర్తి వివరాలను కమిషన్ వెబ్సైట్ psc.ap.gov.in/ లో చూడొచ్చని కార్యదర్శి పేర్కొన్నారు. గ్రూప్–1 సహా అత్యున్నత కేడర్ పోస్టులకు ఇంటర్వ్యూలు ఇలా ఉండగా.. ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్–1 సహా ఇతర అత్యున్నత కేడర్ పోస్టులకు రాత పరీక్షలతో పాటు ఇంటర్వ్యూలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూల విధానాన్ని పునరుద్ధరించింది. ఈ అత్యున్నత పోస్టులన్నింటికీ ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేలా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గరిష్ట వయో పరిమితి రెండేళ్లకు పెంచుతూ గతంలో జారీచేసిన జీఓ 105 అమలును మరో రెండేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. గతంలో 34ఏళ్ల వయోపరిమితిని 42ఏళ్లకు పెంచి జీఓ 105 జారీచేశారు. తాజా ఉత్తర్వులతో ఈ 42ఏళ్ల గరిష్ట వయోపరిమితి 2023 సెప్టెంబర్ 30వరకు అమల్లో ఉంటుంది. -
వచ్చే నెలలో గ్రూప్–1, 2 నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం సూచించిన మేరకు ఖాళీ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ పి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. మంగళవారం గ్రూప్–1 తుది ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో 110 గ్రూప్–1 పోస్టులు, 182 గ్రూప్–2 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగాల భర్తీకి 16 నోటిఫికేషన్లు విడుదల చేయగా.. వాటిలో మూడింటిని పూర్తి చేశామని తెలిపారు. ఇంకా 13 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు, ఇతర ప్రక్రియలను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. 2 వేల వరకు వివిధ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. 670 జూనియర్ అసిస్టెంట్, 119 ఏఈ పోస్టులకు ఈ నెలాఖరున పరీక్షలు ఉంటాయన్నారు. ఈ పోస్టులకు 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు. అత్యంత పారదర్శకంగా నిపుణులైన ఉద్యోగులను రాష్ట్రానికి అందించేలా కమిషన్ చర్యలు చేపడుతుందన్నారు. పోస్టులకు ఎంపిక ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా కమిషన్ ముందుకు వెళ్తుందన్నారు. గ్రూప్–1 కేడర్‌లోనూ సీపీటీ పరీక్ష గ్రూప్–1 కేడర్ పోస్టులకు కూడా ఇకనుంచి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ) నిర్వహించనున్నట్టు సవాంగ్ తెలిపారు. ఈ–గవర్నెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లతో పరిపాలనలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అందుకు అనుగుణంగా అధికారులు కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రూప్–1 పోస్టులకు సంబంధించి సీపీటీ సిలబస్‌లో మార్పులు చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రొబేషనరీ ఖరారుకు ఎంపికైన వారికి డిపార్ట్మెంటల్ టెస్ట్ కూడా నిర్వహించే ప్రతిపాదన ఉందన్నారు. గ్రూప్–1 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నామని, తుది నిర్ణయమేదీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యున్నత పోస్టులకు ఎంపికైన వారికి అందుకు తగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే రాత పరీక్షలతో పాటు ఇతర రకాల పరీక్షలు కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోందన్నారు. యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాల కమిషన్లతో దీనిపై చర్చిస్తున్నామని తెలిపారు. కేరళలో ఇంతకుముందు జరిగిన వివిధ రాష్ట్రాల కమిషన్ల భేటీలో దీనిపై చర్చ జరిగిందని, వచ్చేనెల 8న విశాఖపట్నంలో ఆలిండియా కమిషన్ల సమావేశం ఉంటుందని అందులోనూ చర్చిస్తామని తెలిపారు. గవర్నర్‌కు వివరణలు పంపించాం గ్రూప్–1పై ఇటీవల కొందరు అభ్యర్థులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సవాంగ్ సమాధానమిస్తూ.. ఈ అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున బయటకు స్పందించలేమన్నారు. సంబంధిత అంశాలపై గవర్నర్ కార్యాలయానికి వివరణలు పంపించామన్నారు. తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనడం వాస్తవం కాదని, వీటిపై ఇంతకుమించి స్పందించలేమని పేర్కొన్నారు. అన్ని ఫైళ్లను కోర్టు ముందుంచామన్నారు. సమాధాన పత్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచడమనే విధానం ఏపీపీఎస్సీలో లేదని, యూపీఎస్సీలో కూడా లేదని వివరించారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి వయోపరిమితి సడలించాలని అభ్యర్థుల నుంచి వస్తున్న వినతిపై స్పందిస్తూ దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు విజయకుమార్, ప్రొఫెసర్ పద్మ రాజు, డాక్టర్ సుధాకర్‌రెడ్డి, సలాంబాబు, రమణా రెడ్డి, పి.సుధీర్, ఎన్.సోనీవుడ్, ఎన్.సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి అరుణకుమార్ పాల్గొన్నారు. -
TS: అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షపై స్పష్టత ఇచ్చింది. ఇదివరకే గ్రూప్–1 నోటిఫికేషన్లో వెల్లడించినట్లుగా ప్రిలిమ్స్ పరీక్షను జూలై/ఆగస్టు నెలల్లో నిర్వహించాల్సి ఉండగా, వివిధ కారణాలతో అక్టోబర్‌కు వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన కమిషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరీక్ష తేదీ ఖరారుకు సంబంధించి చర్చ జరిగింది. వివిధ రకాల పరీక్షలున్న సమయంలో గ్రూప్–1 పరీక్ష నిర్వహించొద్దని, తేదీని కొన్నిరోజులు వాయిదా వేయాలని పలువురు టీఎస్పీఎస్సీకి వినతులు, లేఖలు సమర్పించారు. ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో పోలీసు ఉద్యోగాల అర్హత పరీక్షలు, జాతీయ స్థాయిలో యూపీఎస్సీ, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ ఉద్యోగ అర్హత పరీక్షలు కూడా ఉన్నాయి. గ్రూప్–1 ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భారీ స్పందన వచ్చినందున సన్నద్ధతకు మరిం త సమయం ఇవ్వాలంటూ కోరడంతో కమిషన్ సానుకూలంగా స్పందించింది. మరోవైపు రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారి గ్రూప్–1 నియామకాలు జరగనున్నాయి. వివిధ శాఖల్లో 503 గ్రూప్–1 పోస్టులకు ఏకంగా 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. అక్టోబర్ 16న ప్రిలిమ్స్ నిర్వహించనున్న నేపథ్యంలో మెయిన్ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన తేదీలను ప్రిలిమ్స్ పరీక్షల తర్వాత కమిషన్ వెల్లడించనుంది. -
గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా మంగళవారం గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి.. కార్యదర్శి అనితారామచంద్రన్, కమిషన్ సభ్యులతో కలిసి నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగాల భర్తీలో ఉన్నత శ్రేణి ఉద్యోగాలంటే గ్రూప్–1 ఉద్యోగాలే. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ శాఖల్లో 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. సోమవారం 16 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడగా...తాజాగా గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పావువంతు ఎంపీడీఓ పోస్టులే.. టీఎస్పీఎస్సీ తాజాగా విడుదల చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్లో 503 పోస్టులలో దాదాపు పావు వంతు అంటే 121 పోస్టులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కొలువులే. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రకియలో భాగంగా కొత్త మండలాలు ఏర్పాటు కావడంతో ఎంపీడీఓ పోస్టుల సంఖ్య పెరిగింది. ఆ తర్వాత స్థానంలో వరుసగా డీఎస్పీ (91) సీటీవో (48), డిప్యూటీ కలెక్టర్ (42), మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–2 (41), అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (40), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ (38) పోస్టులున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ పోస్టుల్లో 95 శాతం స్థానిక అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నారు. యూనిఫాం ఉద్యోగాల కనిష్ట, గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాలుగా, ఇతర ఉద్యోగాల వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలుగా నిర్దేశించారు. ఓటీఆర్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ మే 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆన్లైన్ పద్ధతిలో మే 31వ తేదీ వరకు స్వీకరిస్తారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. గ్రూప్–1 ఉద్యోగాలను రెండు అంచెల్లో భర్తీ చేస్తారు. ఇంటర్వ్యూలను తొలగించడంతో ఈ మేరకు పరీక్ష విధానంలో మార్పులు చేశారు. ప్రిలిమ్స్ (ఆబ్జెక్టివ్ టైప్), మెయిన్స్ (రాత పరీక్ష) ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్‌ను జూలై/ఆగస్టులో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో వెల్లడించింది. అదేవిధంగా మెయిన్స్ పరీక్షలను నవంబర్/డిసెంబర్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. తొలిసారిగా ఉర్దూలో.. ఈడబ్ల్యూఎస్ కోటా కూడా ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తారు. ఉద్యోగ ఖాళీల సంఖ్యకు 50 రెట్ల అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల్లో అవకాశం కల్పిస్తారు. ప్రతి మల్టీ జోన్ వారీగా, రిజర్వేషన్లు, కమ్యూనిటీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, స్పోర్ట్స్ కోటాల వారీగా ఎంపిక ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్తో పాటు ఉర్దూ బాషలో నిర్వహించనున్నారు. గ్రూప్–1 పరీక్ష ఉర్దూ బాషలో నిర్వహించడం ఇదే తొలిసారి. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా తొలిసారిగా అమలు కానున్నాయి. ఇ–ప్రశ్నపత్రం: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో ముద్రించిన ప్రశ్నపత్రాల స్థానంలో ఎలక్ట్రానిక్ ప్రశ్నపత్రం (ఇ– క్వశ్చన్పేపర్)ను ప్రవేశ పెట్టనున్నారు. అభ్యర్థుల ఎంపిక విధా నంలో సాంకేతిక మూల్యాంకనం (డిజిటల్ ఎవాల్యూయేన్) ప్రవేశపెడుతున్నారు. మరిన్ని వివరాలు, పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను కమిషన్ వెబ్సైట్లో పొందుపర్చారు. వయోపరిమితి సడలింపు ఇలా... గ్రూప్–1 ఉద్యోగార్థుల గరిష్ట వయోపరిమితి జనరల్ పోస్టులకు 44 సంవత్సరాలు, యూనిఫాం పోస్టులకు 31 సంవత్సరాలుగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తించదు. మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్లు, ఎన్సీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంది. దరఖాస్తు రుసుం రూ.200 గ్రూప్–1 ఉద్యోగ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజును రూ.200గా నిర్ణయించారు. పరీక్ష ఫీజు కింద అదనంగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికోద్యోగులు, డిక్లరేషన్ సమర్పించే నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ ఫీజులను ఆన్లైన్ పద్ధతిలోనే చెల్లించాల్సి ఉంటుంది. ♦ప్రిలిమ్స్ పరీక్షను రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు వరుస క్రమంలో 12 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. ♦ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు సంబంధించి స్పష్టమైన తేదీలను కమిషన్ త్వరలో ప్రకటిస్తుంది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ♦గ్రూప్–1 ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద 2 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో తెలిపింది. మొత్తంగా 29 రకాల క్రీడలకు సంబంధించి కోటా అమలు చేయనుంది. చదవండి: (రూ.50వేలకు ఆశపడి.. రూ.80లక్షలు పోగొట్టుకున్నాడు..) -
గ్రూప్–1 నోటిఫికేషన్.. రేపే గుడ్‌న్యూస్..!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగ భర్తీ ప్రక్రియలో ముందడుగు పడింది. ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలను ఇప్పటికే ఒకట్రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆయా శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరింది. శనివారం బోర్డు సమావేశంలో దాదాపు అన్ని శాఖల ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించగా సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే గ్రూప్–1లో ఇంటర్వ్యూలు రద్దు చేసినందున దీనికి సంబంధించిన జీవో సోమవారం ఉదయానికి వస్తే సాయంత్రానికి 503 గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావొచ్చని సమాచారం. చదవండి👉 ఇక పరీక్షలన్నీ సకాలంలోనే.. -
వచ్చే వారం గ్రూప్–1 నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగ నియామకాల కసరత్తు వేగవంతమైంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన 503 గ్రూప్–1 ఉద్యోగాలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నిర్దేశించిన పోస్టులకు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలు టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పిం చగా ఒకట్రెండు శాఖలకు సంబంధించిన ప్రతిపాదనల్లో సందేహాలు తలెత్తడంతో వాటి నివృత్తికి కమిషన్ సవరణ ప్రతిపాదనలు కోరినట్లు తెలిసింది. ఆయా శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించిన వెంటనే టీఎస్పీఎస్సీ సమావేశమై కోరం ఆమోదంతో ఉద్యోగ ప్రకటన జారీ చేయనుందని, ఈ ప్రక్రియకు ఎంతో సమయం పట్టదని టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం సైతం టీఎస్పీఎస్సీ యంత్రాంగం గ్రూప్–1 ఉద్యోగ ప్రకటనపై పలు సమీక్షలు నిర్వహించి ప్రక్రియ పూర్తికి కసరత్తు చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగ నియామకాలు జరగలేదు. దీంతో కమిషన్ నుంచి ప్రకటన వస్తే రాష్ట్రంలో అదే తొలి ప్రకటన కానుంది. (చదవండి: ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా!) -
మీ తప్పులకు మేము బలవ్వాలా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అడ్డగోలు నిబంధనలు విధిస్తూ, వాటిని తరచూ మార్పు చేస్తూ తమ జీవితాలతో చెలగాటమాడుతోందని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఏపీపీఎస్సీ తప్పులకు తాము బలవ్వాలా అని నిలదీస్తున్నారు. ఇప్పటికే మే 26న జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు సంబంధించి కమిషన్ నిర్ణయంతో అన్యాయం జరిగిందని పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతేడాది డిసెంబర్ 31న విడుదల చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్లో నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్‌ను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. అయితే.. పరీక్షకు వారం ముందు అనుమతించబోమని ప్రకటించింది. నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్‌కు అనుమతి ఇవ్వకుండా పరీక్ష నిర్వహించడంతో నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు. అలాగే పరీక్షలో ఆంగ్లం నుంచి తెలుగులో అనువాదం చేసి ఇచ్చిన ప్రశ్నలు తప్పులతడకలుగా ఉండడంతో తీవ్రంగా నష్టపోయారు. వీటిపైనా అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. డీఏవో పరీక్షకూ షరతులు జూలై 7న నిర్వహించే డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) ప్రిలిమ్స్ పరీక్షకు కూడా క్యాలిక్యులేటర్ అనుమతిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్న ఏపీపీఎస్సీ శుక్రవారం అనుమతి ఇవ్వబోమని వెబ్‌నోట్ విడుదల చేసింది. నోటిఫికేషన్లో ఒకటి పేర్కొని పరీక్ష సమయంలో మరో నిర్ణయం తీసుకోవడం అన్యాయమని అభ్యర్థులు అంటున్నారు. క్యాలిక్యులేటర్‌ను అనుమతించబోమని నోటిఫికేషన్లో ముందే పేర్కొని ఉంటే దానికనుగుణంగా సన్నద్ధమయ్యేవారమని చెబుతున్నారు. ఇదంతా పరిశీలిస్తే.. సకాలంలో పరీక్షలు నిర్వహించకుండా కాలయాపన చేసేందుకు, అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కేలా కావాలనే ఇలా చేస్తుందనే అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నిష్పత్తి పైనా.. కాగా.. ఏపీపీఎస్సీ ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాలు కూడా అభ్యర్థులకు శాపంగా మారుతున్నాయి. గతంలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసేవారు. కానీ.. ప్రభుత్వం జీవో నెంబర్ 5 ద్వారా అభ్యర్థుల నిష్పత్తిపై నిర్ణయాన్ని ఏపీపీఎస్సీకి అప్పగించింది. ఏ నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేస్తారో ఏపీపీఎస్సీ ముందుగా వెల్లడించడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గతంలోని నోటిఫికేషన్ పోస్టులకు అదనంగా 400 పోస్టులు జత చేసి 1:50 నిష్పత్తిలో ఎంపికకు అవకాశం కల్పించారని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగాల సంఖ్య పెరగకపోయినా కనీసం మెయిన్స్‌కు అవకాశం కల్పించాలని నిరుద్యోగులు వేడుకుంటున్నా కమిషన్ వారి మొర ఆలకించడం లేదు. గతంలో గ్రూప్–1కు మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ ఉండగా ఇప్పుడు అన్నింటికీ ప్రిలిమ్స్‌ను తప్పనిసరి చేసింది. దీంతో అభ్యర్థులు ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు శిక్షణా కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆప్టిట్యూడ్ ప్రశ్నలపైనా అదే తీరు యూపీఎస్సీ తరహా అంటూనే ఏపీపీఎస్సీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. గతంలో యూపీఎస్సీ.. సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను ప్రవేశపెట్టింది. దీనిలో పూర్తిగా అర్థమెటిక్ అంశాలు ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన పరీక్షలో అర్థమెటిక్ అవసరం లేదని, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ థింకింగ్ అంశాలు ఉంటే చాలని పలువురు అభిప్రాయపడ్డారు. అర్థమెటిక్ అంశాల వల్ల తమకు నష్టం జరుగుతుందని నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఆందోళనలు చేశారు. దీంతో యూపీఎస్సీ సీ–శాట్ పేపర్‌ను కేవలం క్వాలిఫైయింగ్ పేపర్‌గా మార్చింది. కానీ ఇప్పుడు ఏపీపీఎస్సీ అదే ఆప్టిట్యూడ్ ప్రశ్నలను గ్రూప్–1లో ప్రవేశపెట్టడంతో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. తెలుగులో ప్రశ్నలు ఇవ్వకుండా.. కొన్ని కేటగిరీల పోస్టులకు ఆంగ్ల మాధ్యమంలోనే ప్రశ్నలు అడుగుతామని, తెలుగు మాధ్యమంలో ప్రశ్నలు ఉండవని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రకటించడం కూడా వివాదాస్పదంగా మారింది. దీనివల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారు. యూపీఎస్సీ, బ్యాంకింగ్ నియామక సంస్థలే అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రశ్నలు అడుగుతుండగా ఏపీపీఎస్సీ దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. మరోపక్క కొన్ని కేటగిరీల్లో ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగు మాధ్యమంలోనూ ప్రశ్నలు అడుగుతున్నా అనువాదంలో అనేక తప్పులు ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారు. ఇటీవల ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ తెలుగు మాధ్యమ ప్రశ్నల్లో ఏకంగా 36 ప్రశ్నలు తప్పులతడకలుగా ఉండడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కమిషన్ చైర్మన్ తీరుపై నిరసన కాగా.. గతంలో ఎన్నడూ లేని వివాదాలు ప్రస్తుత చైర్మన్ పి.ఉదయభాస్కర్ హయాంలోనే ఏపీపీఎస్సీని చుట్టుముడుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా నియమితులైన ఈయన ప్రభుత్వ పెద్దల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. గతంలో గ్రూప్–2లో పేపర్ లీకేజీ ఆరోపణల వివాదంపై పలువురిపై అక్రమంగా కేసులు పెట్టించారని, ఇప్పటికీ విచారణకు రావాల్సిందిగా సీఐడీ నుంచి నోటీసులు వస్తున్నాయని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత చైర్మన్ హయాంలో తమకు న్యాయం జరగదని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని కోరుతున్నారు. -
మళ్లీ ‘మెయిన్స్’ నిర్వహించాల్సిందే
గ్రూప్-1 పరీక్షలపై ‘సుప్రీం’ ఆదేశం గైర్హాజరైన 7 వేల మందికి నిరాకరణ ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి ఏపీపీఎస్సీ నివేదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2011లో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌లోని 314 పోస్టులకు తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ ‘కీ’లో దొర్లిన ఆరు తప్పులపై గత ఏడాది అక్టోబర్ 7న అత్యున్నత న్యాయస్థానం ఇదే తీర్పు ఇచ్చింది. ఆ ఆరు ప్రశ్నలను తొలగించాలని, మిగతా ప్రశ్నలనే పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల తాజా జాబితా రూపొందించి మెయిన్స్ నిర్వహించాలని పేర్కొంది. ఈ తీర్పుపై ఏపీపీఎస్సీ సివిల్ అప్పీల్ దాఖలు చేయగా మెయిన్స్ మళ్లీ నిర్వహించాల్సిందేనని ‘సుప్రీం’ సోమవారం పునరుద్ఘాటించింది. అయితే గతంలో నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు గైర్హాజరైన వారిని ఈసారి పరీక్షకు అనుమతించాల్సిన అవసరం లేదని తీర్పులో పేర్కొంది. జస్టిస్ హెచ్.ఎల్.గోఖలే, జస్టిస్ జె.చలమేశ్వర్లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. రెండు పరీక్షలొద్దు...: ప్రిలిమ్స్, మెయిన్స్‌తోపాటు ఇంటర్వ్యూలు కూడా పూర్తయిన గ్రూప్-1 నోటిఫికేషన్‌లోని 314 పోస్టులకు మళ్లీ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తే తమ తప్పేమీ లేని అభ్యర్థులు కూడా మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తుందని, అందువల్ల అంతే ప్రమాణాలు కలిగిన మరో ప్రశ్నపత్రం ద్వారా కొత్తగా అర్హులైన వారికి పరీక్ష నిర్వహిస్తామని కోర్టుకు ఏపీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్‌సాల్వే, జి.వివేకానంద్ విన్నవించారు. అయితే ఒక పరీక్ష ద్వారా కొంద రిని, రెండో పరీక్ష ద్వారా మరికొందరిని ఎంపిక చేయడాన్ని ధర్మాసనం సమ్మతించలేదు. వివాదాస్పద ఆరు ప్రశ్నలను తొలగించాక రూపొందించిన నూతన మెరిట్ జాబితాకు కొత్తగా అర్హత సాధించిన 209 మందిని కలిపితే మొత్తం 16,113 మంది అర్హులని ఏపీపీఎస్సీ తేల్చింది. అయితే వీరిలో గైర్హాజరైన 7 వేల మందికి పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. వెంటనే మెయిన్స్ నిర్వహించాలి: అభ్యర్థులు సుప్రీం తీర్పు మేరకు వెంటనే మళ్లీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షను నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యం చేస్తే మొత్తం నోటిఫికేషనే ఆగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. తీర్పు ప్రకారం మళ్లీ మెయిన్స్ నిర్వహించకుండా రివ్యూ పిటిషన్ వేసేందుకు ఏపీపీఎస్సీ యోచన చేస్తోందన్నారు. మరోవైపు ఇప్పటికే గ్రూప్-1 ఇంటర్వ్యూలకు హాజరై పోస్టింగుల కోసం నిరీక్షిస్తున్నవారు తాజా తీర్పుతో ఖిన్నులయ్యారు.