institute of preventive medicine
-
నవంబర్ 7న ఎఫ్ఎస్వో అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబర్ 7న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు వెంటనే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, అర్హత పరీక్షను సీబీఆర్టీ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. హాల్టికెట్లలో నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధం కావాలని సూచించింది. -
కల్తీ కనిపిస్తే ‘కాల్’చేయండి: హరీశ్
సాక్షి,హైదరాబాద్: ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేవారిని ఉపేక్షించకూడదని ఆయన అధికారులను ఆదేశించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), ఆహార భద్రత విభాగం, ల్యాబ్‌ల పనితీరు వాటి పురోగతిపై హరీశ్‌రావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆహార కల్తీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుం టుందని, ఇందులో భాగంగా రూ. 2.4 కోట్లతో నాలుగు అత్యాధునిక ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్ వాహనా లను సమకూర్చుకుందన్నారు. ఐపీఎంలో రూ.10 కోట్లతో అత్యాధునిక పరికరాలతో ఆహార నాణ్యత నిర్ధారణ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఆహార కల్తీని అరికట్టేందుకు జిల్లాల్లో టాస్క్ ఫోర్స్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేయ డంతోపాటు స్పెషల్ డ్రైవ్ వీక్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని, త్వరగా పరిష్కారం అయ్యేలా చొరవ చూపి కల్తీ చేసే వారి ఆట కట్టించాలని సూచించారు. ఆహార కల్తీపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా ఆహార కల్తీ జరిగినట్లు, నాణ్యత లేనట్లు సమాచారం ఉంటే 040–21111111 నంబర్‌కి కాల్ చేయవచ్చని లేదా ఃఅఊఇఎఏMఇ ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు అందించ వచ్చని తెలిపారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు పెంచేందుకు శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరిం చాలన్నారు. ఏరియా ఆస్పత్రులకు బ్లడ్ బ్యాంకులు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయాలని, తలసేమియా బాధితులకు ఉచితంగా రక్తం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశిం చారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, పాల్గొన్నారు. -
ఇకపై వైరస్ నిర్ధారణ ఇక్కడే!
హైదరాబాద్‌లో రెండు ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు సాక్షి, హైదరాబాద్: వైరస్ కారక జబ్బుల గుట్టు తెలుసుకునేందుకు ఇకపై పుణె, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పుణె తరహాలో త్వరలోనే రెండు వైరాలజీ లేబొరేటరీలు హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్నాయి. నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో ఒకటి, ఉస్మానియా వైద్య కళాశాలలో రెండోది ఏర్పాటు చేస్తున్నారు. ఆరు నెలల్లో ఐపీఎం వైరాలజీ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. దీనికి ఎన్ఆర్హెచ్ఎం నుంచి రూ.3 కోట్లు వెచ్చిస్తున్నారు. ఉస్మానియా వైద్య కళాశాలలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైరాలజీ లేబొరేటరీ ఏర్పాటు చేయడానికి ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్) ముందుకొచ్చింది. రోగ నిర్ధారణతో పాటు ప్రయోగాలు చేసుకునేందుకు ఈ ల్యాబ్‌లు ఉపయోగపడతాయి. ఐదు జిల్లాల్లో అదనపు ల్యాబ్‌లు: రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మైక్రోబయాలజీ లేబొరేటరీలు రోగుల సంఖ్యకు అవి సరిపోవడంలేదు. దీంతో విజయనగరం, పశ్చిమగోదావరి, నెల్లూరు, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో అదనపు ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.