హైదరాబాద్‌లో రెండు ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: వైరస్ కారక జబ్బుల గుట్టు తెలుసుకునేందుకు ఇకపై పుణె, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పుణె తరహాలో త్వరలోనే రెండు వైరాలజీ లేబొరేటరీలు హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్నాయి. నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో ఒకటి, ఉస్మానియా వైద్య కళాశాలలో రెండోది ఏర్పాటు చేస్తున్నారు. ఆరు నెలల్లో ఐపీఎం వైరాలజీ ల్యాబ్ అందుబాటులోకి రానుంది.
దీనికి ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నుంచి రూ.3 కోట్లు వెచ్చిస్తున్నారు. ఉస్మానియా వైద్య కళాశాలలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైరాలజీ లేబొరేటరీ ఏర్పాటు చేయడానికి ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్) ముందుకొచ్చింది. రోగ నిర్ధారణతో పాటు ప్రయోగాలు చేసుకునేందుకు ఈ ల్యాబ్‌లు ఉపయోగపడతాయి.
ఐదు జిల్లాల్లో అదనపు ల్యాబ్‌లు: రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మైక్రోబయాలజీ లేబొరేటరీలు రోగుల సంఖ్యకు అవి సరిపోవడంలేదు. దీంతో విజయనగరం, పశ్చిమగోదావరి, నెల్లూరు, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో అదనపు ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.