narayanaguda
-
నారాయణగూడలో ఘనంగా సదర్ పండుగ వేడుకలు (ఫోటోలు)
-
ప్రేమ పేరుతో వల.. బాలికపై లైంగిక దాడి
హిమాయత్‌నగర్: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన ఓ మైనర్ బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్లో సుల్తాన్‌బజార్ ఏసీపీ కె.శంకర్, ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్, అడ్మిన్ ఎస్సై జి.నరేష్ కుమార్‌తో కలిసి కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఆగాపురాకు చెందిన షేక్ అర్బాస్(23) బైక్ మెకానిక్. ఇన్‌స్ట్రాగామ్‌లో 13 ఏళ్ల మైనర్ బాలికను పరిచయం చేసుకున్నాడు. ప్రతిరోజూ చాటింగ్ చేస్తూ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. ఈ నెల 24న పాఠశాలకు వచి్చన బాలికను తనతో పాటు గుల్బర్గాకు తీసుకెళ్లాడు. దీంతో బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అఘాపురాకు చెందిన షేక్ అర్బాస్ బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారన్న విషయం తెలుసుకున్న నిందితుడు భయంతో బాలికను తన కుటుంబ సభ్యులకు అప్పగించి పరారయ్యాడు. బాలికను భరోసా సెంటర్‌కు తరలించి, వాగ్మూలం రికార్డ్ చేసిన పోలీసులు నిందితుడు రెండు రోజుల పాటు బాలికతో లాడ్జీలో ఉండి లైంగిక దాడికి పాల్పడ్డాడని గుర్తించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, శుక్రవారం నాంపల్లి రైల్వేస్టేషన్లో షేక్ అర్బాస్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు. -
ప్రేమపేరుతో అత్త కూతుర్ని మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని..
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ బాలికను మహరాష్ట్రకు తీసుకెళ్లిన యువకుడిని నారాయణగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై నరేష్ కథనం మేరకు. వివరాలిలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన లక్ష్మణ్ దమాయ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. అతని కుమారుడు కరణ్ పరియార్ హిమాయత్‌నగర్‌లోని మెమోస్‌లో పనిచేస్తున్నాడు. స్థానికంగా 9వ తరగతి చదువుతున్న తన అత్త కుమార్తెను అతను ప్రేమిస్తున్నాడు. అదను చూసుకుని కరణ్ పరియార్ సదరు బాలికను మహారాష్ట్రలోని కళ్యాణ్ నగరానికి తీసికెళ్లాడు. ఓ గది అద్దెకు తీసుకుని వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కరణ్ పరియార్ అన్న రాము పరియార్ ఫేస్బుక్లో తండ్రిపై, అన్నపై కేసు నమోదు అయ్యిందని, ఏ క్షణానైనా అరెస్ట్ చేయవచ్చునని పోస్ట్ చేశారు. ఫేస్బుక్ పోస్ట్ వైరల్ కావడంతో కరణ్ పరియార్ తన సోదరుడు రాముకు ఫోన్ చేసి తాము కళ్యాణ్‌లో ఉన్నట్లు తెలిపాడు. ఎస్సై నరేష్ సూచన మేరకు సమీపంలోని ఉల్లాస్‌నగర్ పీఎస్‌లో లొంగిపోయాడు. అప్పటికే ఎస్సై అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కరణ్ పరియార్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: (Hyderabad: అపార్ట్ మెంట్లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..) -
నెల రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి.. కాబోయే భర్తను కలిసేందుకు వెళ్తుండగా..
సాక్షి, హిమాయత్‌నగర్: డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చి మరో ఐదు నిమిషాల్లో మళ్లీ వస్తానంటూ చెప్పి బయటకు వచ్చిన యువతి అనంతలోకాలకు వెళ్లిపోయింది. శుక్రవారం రాత్రి నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ కోఠి ఈడెన్ గార్డెన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడిపిస్తున్న యువతి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల సమాచారం మేరకు ఇందుకు సబంధించిన వివరాలిలా ఉన్నాయి. చదవండి: జగిత్యాల: వరద కాల్వలోకి దూకి తల్లి కుమార్తెల ఆత్మహత్య డీఆర్డీఏ పరివార్ ప్రాంతంలో నివాసం ఉండే నిధా రెహమాన్(34) అబిడ్స్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లింది. వెంటనే మరో ఐదు నిమిషాల్లో వస్తా అని ఇంట్లోని తల్లిదండ్రులకు చెప్పి.. యూసఫ్‌గూడలో ఉండే కాబోయే భర్త పఠాన్ షవాజ్ నవాబ్‌ఖాన్‌ను కలిసేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. కింగ్ కోఠి ఈడెన్ గార్డెన్ రోడ్డులో తన ముందు వేగంగా వెళ్తున్న ఓ లారీని తప్పించబోయే క్రమంలో బైక్ స్కిడ్ అయ్యింది. చదవండి: పెళ్లికి నిరాకరణ.. యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి వెనుకే వస్తున్న వాటర్ ట్యాంకర్ వెనక చక్రాల కింద పడటంతో.. తలభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. యువతిని గుర్తించలేని విధంగా రోడ్డుపై పడి ఉండటంతో స్థానికులు నారాయణగూడ పోలీసులకు సమచారం ఇచ్చారు. నైట్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ కొండపల్లి నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్ సాయంతో యువతి మృతుదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం మృతుదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నెల రోజుల్లో పెళ్లి... యూసఫ్‌గూడలో నివాసం ఉండే పఠాన్ షవాజ్ నవాబ్ఖాన్ మృతురాలు ప్రేమలో ఉన్నారు. ఇటీవల రెండు కుటుంబాల వారు వివాహానికి కూడా ఒప్పుకున్నారు. మరో నెల రోజుల్లో వివాహం కూడా ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నవాబ్‌ఖాన్‌ను కలిసేందుకు వెళ్తున్న సమయంలోనే ఇంతటి ఘోరం జరిగిందని నవాబ్ఖాన్ తెలిపారు. -
నాకిక ఓపిక లేదు.. ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ మిస్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: నాకేదో చెప్పాలనిపిస్తోంది.. చెప్పలేకపోతున్నా. మమ్మీ, డాడీ క్షమించండి ఇలా చెప్పకుండా చేస్తున్నందుకు.. నాకు ఏమీ అవసరం లేదు. నాకిక ఓపిక లేదు.. యాసిడ్ అటాక్ ఫేస్ చేశా.. రేప్ ఇష్యూ ఫేస్ చేశా.. పబ్లిక్ నుంచి వచ్చే కామెంట్స్ ఫేస్ చేశా.. మా అమ్మకు అందరూ కాల్స్ చేస్తున్నారు. నాకు అవసరం లేదు. ఇన్ని డేస్ నాకు జరిగిన ఘనకార్యాలు, పురస్కారాలు చాలు. నేను నిజంగా చనిపోవాలి అనుకుంటున్నా’అంటూ ఇన్‌స్టా లైవ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించింది మిస్ తెలంగాణ–2018 విన్నర్ హాసిని. చదవండి: కడతేర్చి.. కట్టుకథ చెప్పాడు.. చివర్లో బండారం ఇలా బయటపడింది నిమిషాల వ్యవధిలో చేరుకున్న పోలీసులు కృష్ణా జిల్లాకు చెందిన కాలక నాగభవాని అలియాస్ హసిని ఆరేళ్ల కింద హైదరాబాద్ వచ్చింది. చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఇటీవల హాసిని హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. బుధవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ప్రారంభించకముందే తన స్నేహితుడుకి తాను చనిపోతున్న విషయాన్ని ఫోన్లో తెలిపింది. ఫ్లాట్ తలుపులు తెరిచి ఉంచి బెడ్రూంలోని తన చున్నీతో ఫ్యాన్‌కు ముడి వేసింది. చిన్న స్టూల్ వేసుకుని ఏడుస్తూ తన ఇన్‌స్టా ఐడీలో లైవ్‌లో మాట్లాడుతూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ లోపు జగిత్యాలలో నివాసం ఉండే హాసిని ఫ్రెండ్ షన్నూ డయల్ 100కు ఫోన్ చేసి వివరాలు చెప్పి అడ్రస్ తెలిపాడు. బుధవారం రాత్రి జాయింట్ సీపీ, నార్త్‌జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డి సమాచారం అందుకున్నారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు చెప్పడంతో వారు హుటాహుటిన అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అప్పటికే స్పృహ కోల్పోయి ఉన్న హాసినిని హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి తరలిం చి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండటంతో ఉదయం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. -
‘దాడి చేస్తే శిక్ష తప్పదు.. ఓ సెల్ ఏర్పాటు చేశాం’
సాక్షి, హైదరాబాద్: ప్రాణాలకు పణంగా పెట్టి కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నారాయణగూడలోని ఐపీఎంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన శనివారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తనకు ఏ దేవుడు లేడు.. వైద్యుడే దేవుడు అన్నాడు. అలాంటి వైద్యులపై కొందరు మూర్ఖులు, శాడిస్టులు దాడి చేస్తున్నారు. (చదవండి: గ్రేటర్ టెన్షన్..!) వైద్యులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డాక్టర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. వాళ్ల కుటుంబాల్ని పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్లపై దాడి చేసిన పేషంట్లను శిక్షించేందుకు ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేశాం. కరోనా సోకినవారిలో కొందరు తలసేమియా వంటి వ్యాధులతో బాధ పడుతున్నారు. వారికి రక్తం అవసరం. రక్తం కొరత రాకుండా బ్లడ్ డొనేట్ చేసేందుకు చాలామంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే టీఎన్జీవో ఆధ్వర్యంలో రెండు వందల మందికి పైగా రక్తదానం చేశారు’అని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్‌లు) -
‘నాన్నా.. నా శవాన్ని తీసుకెళ్లండి’
సాక్షి, కాచిగూడ : ఓ హాస్టల్ నుంచి యువతి అదృశ్యమైంది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే యువతి హాస్టల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు నా శవాన్ని తీసికెళ్లు.. నాన్నా..అంటూ సూసైడ్ నోట్ రాయడంతో... ఒక్కసారిగా హాస్టల్ యాజమాన్యం అప్రత్తమైంది. ఎస్ఐ లిఖితరెడ్డి తెలిపిన మేరకు.. నిజామాబాద్ జిల్లా నబీపేటకు చెందిన మౌనిక(19) హిమాయత్‌నగర్‌లో ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్లో ఉంటూ కేశవమెమోరియల్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇదే హాస్టల్ ప్రాంగణంలో ఉండే బాయ్స్ హాస్టల్లో చదువుతున్న మణిరత్నం అనే యువకుడితో కొద్దిరోజులుగా వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 26న ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. 27వ తేదీ ఉదయం 6.30గంటలకు హాస్టల్ రికార్డ్స్‌లో సంతకం చేసి బయటకు వచ్చిన మౌనిక.. ఓ ఆటోలో ప్రయాణించి సచివాలయం సిగ్నల్ వద్ద దిగింది. అక్కడ నుంచి కాలినడకన ట్యాంక్‌బండ్ చిల్డ్రన్‌పార్క్ వైపు వెళ్లింది. ఇదంతా ఆయా పరిధిలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైంది. అదే సమయంలో మణిరత్నం కూడా కనిపించకుండా పోవడంతో.. ఇద్దరూ కలసి వెళ్లిపోయారా లేక ఏదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి తండ్రి శ్రీనివాస్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్ నేతృత్వంలో ఎస్.ఐ. లిఖితరెడ్డి రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. చదవండి : వీడిన ప్రియాంకా రెడ్డి మర్డర్ మిస్టరీ.. ఆ నలుగురే హైదరాబాద్‌లో ప్రియాంక.. కాంచీపురంలో రోజా.. బిడ్డా.. ఈ అడ్డాలు డేంజర్ -
శునకాల రాకతో సందడి
-
హైదరాబాద్‌లో ఐదుగురి అరెస్ట్.. భారీ నగదు లభ్యం
-
హైదరాబాద్‌లో ఐదుగురి అరెస్ట్.. భారీ నగదు లభ్యం
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు దేశంలోని చాలా ప్రాంతాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెద్ద మొత్తాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టి ప్రతిరోజు భారీ స్థాయిలో నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. తాజా పెద్ద నోట్ల రద్దు ప్రభావం హైదరాబాద్‌లోనూ కనిపించింది. నగరంలో పోలీసుల ముమ్మర తనిఖీలలో భాగంగా గురువారం రాత్రి దాదాపు కోటి రూపాయల నగదు లభ్యమైంది. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. నగరంలోని నారాయణగూడలో పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. కొందరు అనుమానిత వ్యక్తులతో పాటు వారు ప్రయాణిస్తున్న వాహనాలను పరిశీలించారు. ఇందులో భాగంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి రూ.95 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన వ్యక్తులు, రామంతపూర్‌కు చెందిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 శాతం కమిషన్ పేరుతో కమీషన్ మార్పిడికి రాగా తమ తనిఖీలలో ఈ నగదు లభ్యమైందని పోలీసులు వివరించారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. ఆ వ్యక్తుల వద్ద లభ్యమైన నగదులో కొత్త వెయ్యి రూపాయల నోట్లు ఎక్కువ మొత్తంలో ఉండగా, వంద రూపాయల నోట్లు, కొన్ని రద్దు చేసిన పాత నోట్లు ఉన్నట్లు సమాచారం. నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫుట్‌పాత్‌పై పురుడుపోసిన ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్ : మిట్టమధ్యహ్నం భానుడు నడినెత్తిన నిప్పులు కురిపిస్తుండగా ఓ నిండు చూలాలు భర్తతో కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతోంది. అంతలోనే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. ఒక్క అడుగూ ముందుకు నడవలేకపోయింది. బాధను బిగబడుతూ ఉన్నచోటనే కూలబడింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఆ మహిళ దగ్గరికి వచ్చారు. ఆసుపత్రికి తీసుకెళ్లే టైమ్ లేదు. చుట్టుపక్కనవాళ్లనడిగి చీరలు తెప్పించి ఫుట్ పాత్ చూట్టూ చీరలు అడ్డంగా కట్టి, మహిళా కానిస్టేబుళ్లే పురుడుపోశారు. పుట్టిన పండంటి మగబిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుని, అప్పటికప్పుడు తెప్పించిన వస్త్రాల్లో చుట్టి పడుకోబెట్టారు. అనంతరం బాబును, తల్లిని ఆంబులెన్స్ లో కోఠిలోని ప్రసూతి వైద్యశాలకు తరలించారు. హైదరాబాద్ లోని నారాయణగూడా శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న ఫుట్ పాత్ పై మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుందీ సంఘటన. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. వారి వివరాలు తెలియాల్సిఉంది. -
పరిశ్రమలకు పెట్టింది పేరు..
నిజాం పాలనా కాలంలోనే హైదరాబాద్ గొప్ప పరిశ్రమలకు పెట్టింది పేరు. ఆరో నిజాం హయాం నుంచి ఎన్నో ఫ్యాక్టరీలు నగరంలో వెలిశాయి. ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు ఎంతోమందికి ఉపాధి కల్పించాయి. ఆనాడు వెలిసిన ప్రముఖ పరిశ్రమల్లో కొన్ని.. 1874లో మొదటి స్పిన్నింగ్ మిల్లు ఏర్పాటైంది. 1876లో ఫిరంగుల ఫ్యాక్టరీ, 1876లో ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. 1885లో బాలాపూర్ వద్ద ప్రైవేట్ పేపర్ ఫ్యాక్టరీ, 1903లో నారాయణగూడలో ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ, 1910లో రెండు మద్యం తయారీ పరిశ్రమలు (డిస్టిలరీ), 1910లో ఐరన్, సోడా ఫ్యాక్టరీలు, 1911లో మింట్ సమీపంలో పవర్ ప్లాంట్, 1916లో దక్కన్ బటన్ పరిశ్రమ, 1919లో వీఎస్టీ ఫ్యాక్టరీ, 1921లో కెమికల్ ల్యాబ్, 1927లో దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ, 1929లో డీబీఆర్ మిల్స్, 1941లో గోల్కొండ సిగరెట్ కంపెనీలు ఏర్పాటు చేశారు. -
'గే'ల మధ్య గొడవ, యువకుడి మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ నారాయణగూడలో ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య (గే) వాగ్వివాదం చోటుచేసుకుంది. అది కాస్తా శ్రుతిమించటంతో ఓ వ్యక్తిని మరో వ్యక్తి భవనం పైనుంచి తోసేశాడు. ఈ ఘటనలో అతను మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సింహ అనే రిటైర్డ్ ఉద్యోగి ఆబిడ్స్ నుంచి ఓ యువకుడిని తీసుకుని నారాయణగూడ ప్రాంతానికి సోమవారం అర్ధరాత్రి సమయంలో వచ్చాడు. అక్కడ ఏంజరిగిందో తెలియదు గానీ, ఇద్దరి మధ్య గొడవ మొదలై, అది ముదిరింది. కాసేపటి తర్వాత నర్సింహ తనతో పాటు వచ్చిన యువకుడిని మేడపైనుంచి కిందకు తోసేశాడు. దాంతో అతడు మరణించాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘జీవితంలో ఫెయిలయ్యాను..’
సూసైడ్ నోట్ రాసిపెట్టి యువకుడి ఆత్మహత్య మృతుడు కరీంనగర్ జిల్లావాసి.. శామీర్‌పేట్‌లో ఘటన శామీర్‌పేట్: సూసైడ్ నోట్ రాసిపెట్టి ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కరీంనగర్ జిల్లావాసి. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఎస్ఐ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మంచిర్యాలలోని శ్రీరాంపురం నివాసి ఆదిత్యపవన్(23) కొన్నాళ్ల క్రితం స్వస్థలంలో బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. నారాయణగూడలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఓ కోచింగ్ సెంటర్లో చేరాడు. శుక్రవారం కరీంనగర్ వెళ్తున్నానని అతడు హాస్టల్లో చెప్పి బయలుదేరాడు. ఇదిలా ఉండగా శనివారం శామీర్‌పేట్ మండల కేంద్రంలోని శివగంగా బోర్వెల్ కార్యాలయం వెనుక అటవీ ప్రాంతంలో ఓ యువకుడు మృతదేహంగా పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా అతడు మంచిర్యాలలోని శ్రీరాంపురం నివాసి ఆదిత్యపవన్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి సమీపంలో ఓ పురుగులమందు డబ్బా పడి ఉంది. దీంతో ఆదిత్యపవన్ పరుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. మృతుడి జేబులో సూసైడ్ నోట్ లభించింది. ‘నేను జీవితంలో ఫెయిల్ అయ్యాను.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్న’ అని ఆదిత్యపవన్ తన తల్లిదండ్రులకు రాశాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
6 నుంచి జాతీయ ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ఈనెల 6 నుంచి 14 వరకు నారాయణగూడలోని వైఎం సీఏలో నిర్వహిస్తున్నట్లు వైఎంసీఏ చైర్మన్ బి.జె.వినయ్ స్వరూప్ తెలిపారు. సెక్రటరీ లియోనార్డ్, కన్వీనర్ నార్మన్ ఐజాక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.ఎస్.ప్రేమ్ కుమార్‌తో కలిసి వినయ్ వివరాలను వెల్లడించారు. దాదాపు 40 మంది అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నీలో తొలిసారిగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంటర్ లాకింగ్ సర్ఫేస్ మ్యాట్‌లో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహిళల విభాగంలో పోటీలు రౌండ్ రాబిన్ పద్ధతిలో 6 నుంచి 10 వరకు, పురుషుల విభాగంలో లీగ్ పద్ధతిలో 10 నుంచి 14 వరకు మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. పురుషుల జట్టు విజేతకు రూ. 60 వేలు, రన్నరప్‌కు రూ. 40 వేలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 30 వేల చొప్పున నగదు బహుమతులను అందజేస్తారు. మహిళల విభాగంలో వరుసగా రూ. 50 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేల నగదు బహుమతులు ఇస్తారు. మహిళల జట్లు: సౌత్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, చత్తీస్‌గఢ్, కేరళ విద్యుత్ జట్లు; ఫురుషుల జట్లు: ఆర్మీ, ఓఎన్జీసీ, వైఎంసీఏ, కేరళ విద్యుత్ బోర్డు, ఏఓసీ, ఐఓబీ, ఆర్సీఎఫ్, కొచిన్ కస్టమ్స్. -
నారాయణగూడ వద్ద రూ. 60 లక్షలు స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అందులోభాగంగా మంగళవారం నారాయణగూడ వద్ద తనిఖీలలో భాగంగా ఓ కారు నుంచి రూ.60 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తమ స్వస్థలం ముంబై అని, వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చామని సదరు వ్యక్తులు పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే నగదుకు సంబంధించి సరైన పత్రాలు వెల్లడించకపోవడంతో పోలీసులు ఆ ముగ్గురుని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే నగదు, కారును కూడా స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. -
జాబితా రభస
తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓటర్ల ధర్నా మాడ్గుల, న్యూస్‌లైన్: సమాచారం ఇవ్వకుండా అర్హులైన 150 మంది పేర్లను ఓటరు జాబితానుంచి తొలగించారని ఆరోపిస్తూ మాడ్గుల మండలం అవురుపల్లి ఓటర్లు సర్పంచ్ నారాయణగౌడ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అధికారుల చర్యని నిరసిస్తూ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని బయటకు పంపించి,దాన్ని మూసివేసి అక్కడే ధర్నాకు దిగారు. సిబ్బంది ద్వారా ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ శ్రీనివాసురెడ్డి తాను పోలింగ్ బూత్‌ల పరిశీలనలో ఉన్నానని, 12 గంటలకు వస్తానని చెప్పారు. దీంతో అప్పటి వరకు ఓటర్లు కార్యాలయం ముందే బైఠాయించారు. కాసేపటికి తాను వచ్చేందుకు వీలుకాదని వినతి పత్రాన్ని డీటికి ఇచ్చి వెళ్లాలని తహశీల్దార్నుంచి సమాధానం వచ్చింది. దీంతో ఆందోళనకు దిగినవారు మరింత ఆగ్రహానికి గురై అక్కడే వంటావార్పు చేపట్టారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఈ క్రమంలో 4 గంటలకు తహశీల్దార్ శ్రీనివాసురెడ్డి కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఓటర్లు ఆయనతో వాగ్వివాదానికి దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన నుంచి సానుకూల సమాధానం రాకపోవడంతో సర్పంచ్ నారాయణగౌడ్ తహశీల్దార్ కార్యాలయం పైకి ఎక్కి కిందకు దూకడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన కానిస్టేబుల్ ప్రభాకర్‌రెడ్డి సర్పంచ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓటరు జాబితాలో తమ పేర్లను చేర్చేవరకు తాము కదిలే ప్రసక్తే లేదని తహశీల్దార్ చుట్టూ బైఠాయించి ఆయనను నిర్భందించారు. ఈ విషయం తెలుసుకున్న మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం డిప్యూటీ కలెక్టర్, నియోజకవర్గ ఎన్నికల అధికారి అమరేందర్ 6.15 గంటలకు కార్యాలయానికి వచ్చారు.ఆయనకు సర్పంచ్ నారాయణగౌడ్, భాదితులు తమకు జరిగిన అన్యాయం వివరించారు.భాద్యులైన తహశీల్దార్, వీఆర్వోలను సస్పెండ్ చేయాలని వారు ఫిర్యాదు చేశారు. గ్రామంలో గ్రామసభ పెట్టి ఉన్నతాధికారులతో విచారణ చేయించి, అర్హులైన వారి పేర్లను జాబితాలో యదావిధిగా చేర్చుతామని ఎంజీఎల్‌ఐ డిప్యూటీ కలెక్టర్, ఎన్నికల అధికారి అమరేందర్ హామీ ఇవ్వడంతో వారు శాంతించి, వెనుదిరిగారు. ఈ ధర్నాకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకట్రాంరెడ్డి, టీడీపీ జిల్లా నాయకులు రవితేజ, కృష్ణారెడ్డి, మండల ప్రధానకార్యదర్శి జగ్పాల్రెడ్డిలు సంఘీభావం ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘసేవకులు నర్సింహ్మాగౌడ్, కాంగ్రెస్ నాయకులు యాదయ్యగౌడ్తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై వైరస్ నిర్ధారణ ఇక్కడే!
హైదరాబాద్‌లో రెండు ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు సాక్షి, హైదరాబాద్: వైరస్ కారక జబ్బుల గుట్టు తెలుసుకునేందుకు ఇకపై పుణె, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పుణె తరహాలో త్వరలోనే రెండు వైరాలజీ లేబొరేటరీలు హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్నాయి. నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో ఒకటి, ఉస్మానియా వైద్య కళాశాలలో రెండోది ఏర్పాటు చేస్తున్నారు. ఆరు నెలల్లో ఐపీఎం వైరాలజీ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. దీనికి ఎన్ఆర్హెచ్ఎం నుంచి రూ.3 కోట్లు వెచ్చిస్తున్నారు. ఉస్మానియా వైద్య కళాశాలలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైరాలజీ లేబొరేటరీ ఏర్పాటు చేయడానికి ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్) ముందుకొచ్చింది. రోగ నిర్ధారణతో పాటు ప్రయోగాలు చేసుకునేందుకు ఈ ల్యాబ్‌లు ఉపయోగపడతాయి. ఐదు జిల్లాల్లో అదనపు ల్యాబ్‌లు: రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మైక్రోబయాలజీ లేబొరేటరీలు రోగుల సంఖ్యకు అవి సరిపోవడంలేదు. దీంతో విజయనగరం, పశ్చిమగోదావరి, నెల్లూరు, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో అదనపు ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. -
24 నుంచి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ
జింఖానా, న్యూస్‌లైన్: రాఘవ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ నిర్వహించనున్నారు. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజి ఈ టోర్నీకి వేదిక కానుంది. 2000 కన్నా తక్కువ రేటింగ్ కలిగిన వారి కోసం ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. టోర్నీలో పాల్గొనేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది ఆటగాళ్లకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతి, 15 మంది నాన్ రేటింగ్ ఆటగాళ్లకు నగదు బహుమతిని ప్రదానం చేయనున్నారు. ఆటగాళ్లకు ఉచిత భోజన సదుపాయంతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పించనున్నట్లు టోర్నీ నిర్వాహక కార్యదర్శి, రాఘవ్స్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అయిన శ్యామ్ సుందర్ తెలిపారు. ప్రతిభావంతులను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎంట్రీ ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు 22లోగా తమ ఎంట్రీలను రిజిష్టర్ చేసుకోవాలి. మరిన్నివివరాలకు శ్యామ్ సుందర్ (9866966904)ను సంప్రదించవచ్చు.