నిధా రెహమాన్ (ఫైల్)
సాక్షి, హిమాయత్‌నగర్: డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చి మరో ఐదు నిమిషాల్లో మళ్లీ వస్తానంటూ చెప్పి బయటకు వచ్చిన యువతి అనంతలోకాలకు వెళ్లిపోయింది. శుక్రవారం రాత్రి నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ కోఠి ఈడెన్ గార్డెన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడిపిస్తున్న యువతి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల సమాచారం మేరకు ఇందుకు సబంధించిన వివరాలిలా ఉన్నాయి.
చదవండి: జగిత్యాల: వరద కాల్వలోకి దూకి తల్లి కుమార్తెల ఆత్మహత్య
డీఆర్‌డీఏ పరివార్ ప్రాంతంలో నివాసం ఉండే నిధా రెహమాన్(34) అబిడ్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లింది. వెంటనే మరో ఐదు నిమిషాల్లో వస్తా అని ఇంట్లోని తల్లిదండ్రులకు చెప్పి.. యూసఫ్‌గూడలో ఉండే కాబోయే భర్త పఠాన్ షవాజ్ నవాబ్‌ఖాన్‌ను కలిసేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. కింగ్ కోఠి ఈడెన్ గార్డెన్ రోడ్డులో తన ముందు వేగంగా వెళ్తున్న ఓ లారీని తప్పించబోయే క్రమంలో బైక్ స్కిడ్ అయ్యింది.
చదవండి: పెళ్లికి నిరాకరణ.. యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి
వెనుకే వస్తున్న వాటర్ ట్యాంకర్ వెనక చక్రాల కింద పడటంతో.. తలభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. యువతిని గుర్తించలేని విధంగా రోడ్డుపై పడి ఉండటంతో స్థానికులు నారాయణగూడ పోలీసులకు సమచారం ఇచ్చారు. నైట్ డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ కొండపల్లి నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్ సాయంతో యువతి మృతుదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం మృతుదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
నెల రోజుల్లో పెళ్లి...
యూసఫ్‌గూడలో నివాసం ఉండే పఠాన్ షవాజ్ నవాబ్‌ఖాన్ మృతురాలు ప్రేమలో ఉన్నారు. ఇటీవల రెండు కుటుంబాల వారు వివాహానికి కూడా ఒప్పుకున్నారు. మరో నెల రోజుల్లో వివాహం కూడా ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నవాబ్‌ఖాన్‌ను కలిసేందుకు వెళ్తున్న సమయంలోనే ఇంతటి ఘోరం జరిగిందని నవాబ్‌ఖాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment