జింఖానా, న్యూస్‌లైన్: రాఘవ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ నిర్వహించనున్నారు. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజి ఈ టోర్నీకి వేదిక కానుంది. 2000 కన్నా తక్కువ రేటింగ్ కలిగిన వారి కోసం ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. టోర్నీలో పాల్గొనేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది ఆటగాళ్లకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతి, 15 మంది నాన్ రేటింగ్ ఆటగాళ్లకు నగదు బహుమతిని ప్రదానం చేయనున్నారు.
ఆటగాళ్లకు ఉచిత భోజన సదుపాయంతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పించనున్నట్లు టోర్నీ నిర్వాహక కార్యదర్శి, రాఘవ్స్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అయిన శ్యామ్ సుందర్ తెలిపారు. ప్రతిభావంతులను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎంట్రీ ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు 22లోగా తమ ఎంట్రీలను రిజిష్టర్ చేసుకోవాలి. మరిన్నివివరాలకు శ్యామ్ సుందర్ (9866966904)ను సంప్రదించవచ్చు.
24 నుంచి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ
Published Sun, Dec 15 2013 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement
Advertisement