keshav memorial college
-
24 నుంచి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ
జింఖానా, న్యూస్‌లైన్: రాఘవ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ నిర్వహించనున్నారు. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజి ఈ టోర్నీకి వేదిక కానుంది. 2000 కన్నా తక్కువ రేటింగ్ కలిగిన వారి కోసం ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. టోర్నీలో పాల్గొనేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది ఆటగాళ్లకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతి, 15 మంది నాన్ రేటింగ్ ఆటగాళ్లకు నగదు బహుమతిని ప్రదానం చేయనున్నారు. ఆటగాళ్లకు ఉచిత భోజన సదుపాయంతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పించనున్నట్లు టోర్నీ నిర్వాహక కార్యదర్శి, రాఘవ్స్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అయిన శ్యామ్ సుందర్ తెలిపారు. ప్రతిభావంతులను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎంట్రీ ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు 22లోగా తమ ఎంట్రీలను రిజిష్టర్ చేసుకోవాలి. మరిన్నివివరాలకు శ్యామ్ సుందర్ (9866966904)ను సంప్రదించవచ్చు. -
ఖోఖో విజేత కేశవ మెమోరియల్ కాలేజి
ఎల్బీస్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ జూనియర్ కాలేజి అండర్-19 బాలుర ఖోఖో టోర్నమెంట్ టైటిల్‌ను కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి జట్టు కైవసం చేసుకుంది. హైదరాబాద్ జిల్లా జూనియర్ కాలేజి గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ మెమోరియల్ హైస్కూల్ మైదానంలో బుధవారం జరిగిన ఫైనల్లో కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి జట్టు 15-2తో భవాన్స్ జూనియర్ కాలేజి (సైనిక్‌పురి) జట్టుపై గెలిచింది. కేశవ్ మెమోరియల్ జట్టులో ఎల్లప్ప, సురేష్, సాగర్ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అంతకుముందు సెమీఫైనల్లో కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి 15-0తో కూకట్‌పల్లికి చెందిన న్యూ గవర్నమెంట్ కాలేజిపై, భవాన్స్ జూనియర్ కాలేజి 8-0తో గవర్నమెంట్ కాలేజి (సికింద్రాబాద్)పై గెలిచాయి.