ఎల్బీస్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ జూనియర్ కాలేజి అండర్-19 బాలుర ఖోఖో టోర్నమెంట్ టైటిల్‌ను కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి జట్టు కైవసం చేసుకుంది. హైదరాబాద్ జిల్లా జూనియర్ కాలేజి గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ మెమోరియల్ హైస్కూల్ మైదానంలో బుధవారం జరిగిన ఫైనల్లో కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి జట్టు 15-2తో భవాన్స్ జూనియర్ కాలేజి (సైనిక్‌పురి) జట్టుపై గెలిచింది.
కేశవ్ మెమోరియల్ జట్టులో ఎల్లప్ప, సురేష్, సాగర్ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అంతకుముందు సెమీఫైనల్లో కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి 15-0తో కూకట్‌పల్లికి చెందిన న్యూ గవర్నమెంట్ కాలేజిపై, భవాన్స్ జూనియర్ కాలేజి 8-0తో గవర్నమెంట్ కాలేజి (సికింద్రాబాద్)పై గెలిచాయి.
ఖోఖో విజేత కేశవ మెమోరియల్ కాలేజి
Published Thu, Dec 12 2013 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement