ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఎం. కాశీనాథ్ గౌడ్ స్మారక ఖోఖో టోర్నమెంట్‌లో జూనియర్ విభాగం టైటిల్‌ను యూసుఫ్‌గూడ గవర్నమెంట్ హైస్కూల్(జీహెచ్‌ఎస్) జట్టు కైవసం చేసుకుంది. బడీ చౌడీలోని హెల్త్ లీగ్ క్లబ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో యూసుఫ్‌గూడ జీహెచ్‌ఎస్ జట్టు 10-5 స్కోరుతో మనోరంజిత మెమోరియల్ హైస్కూల్ జట్టుపై విజయం సాధించింది. సెమీఫైనల్లో యూసుఫ్‌గూడ జీహెచ్‌ఎస్ జట్టు 7-0తో కేవీ హైస్కూల్ (గోల్కొండ) జట్టుపై, మనోరంజిత మెమోరియల్ హైస్కూల్ హెల్త్ లీగ్ క్లబ్ జట్టుపై గెలిచాయి.
హెల్త్ లీగ్ క్లబ్ జట్లు ముందంజ
సీనియర్ పురుషుల విభాగంలో తొలి రౌండ్‌లో హెల్త్ లీగ్ క్లబ్ (ఎ)(బి) జట్లు విజయాలను సాధించాయి. హెల్త్ లీగ్ క్లబ్ (ఎ) జట్టు 8-2తో కేవీ హైస్కూల్ (సీఆర్‌పీఎఫ్-బార్కాస్) జట్టుపై గెలిచింది.
రెండో మ్యాచ్‌లో హెల్త్ లీగ్ క్లబ్ (బి) 7-4తో శ్రీహనుమాన్ వ్యాయామ శాల(హెచ్‌వీఎస్) (ఎ) జట్టుపై గెలిచింది. కేవీ హైస్కూల్ (గోల్కొండ) 2-1తో నయాబజార్‌పై, హైదరాబాద్ జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ క్లబ్ జట్టు 9-4తో యూసుఫ్‌గూడ జీహెచ్‌ఎస్ జట్టుపై నెగ్గాయి. అంతకు ముందు ఈ పోటీలను ప్రముఖ వ్యాపార వేత్త ప్రీత్‌పాల్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ నరేందర్ గౌడ్, ఓయూ ప్రొఫెసర్ బి.సునీల్ కుమార్, రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ధన్‌కిషన్ తదితరులు పాల్గొన్నారు.
యూసుఫ్‌గూడ జీహెచ్‌ఎస్‌కు టైటిల్
Published Mon, Jan 27 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement
Advertisement