yousufguda
-
హైదరాబాద్ యూసుఫ్ గూడాలో అగ్నిప్రమాదం
-
యూసఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువతి రోడ్డు పడిపోయింది. అదే సమయంలో వస్తున్న ఓ బస్సు సదరు యువతిపై నుంచి వెళ్లటంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను అస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించారు. మృతురాలికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. -
సింగోటం రాముని చంపింది వీడే..
-
సింగోటం రాము హత్య కేసులో సంచలన నిజాలు
-
సింగోటం రాము హత్యకు కారణాలు..
-
హైదరాబాద్ యుసుఫ్ గూడలో దారుణ హత్య
-
హైదరాబాద్ యూసుఫ్ గూడలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన
-
జనవరిలో పెళ్లి.. నెల రోజులుగా గొడవలు.. ఉన్నట్టుండి భర్త మాయం!
సాక్షి, హైదరాబాద్: తన భర్త అదృశ్యమయ్యాడని ఓ నవ వధువు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యూసుఫ్‌గూడ బస్తీలో నివసించే సోను(24) ప్రైవేట్ ఉద్యోగి కాగా, భార్య షేక్ రోషణి(24) ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తోంది. ఈ నెల 5న ఆఫీసుకు వెళ్లిన సోను ఇంటికి తిరిగి రాలేదు. దీంతో రోషణి అతనికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది ఇదిలా ఉండగా, ఈ ఏడాది జనవరిలో తమకు పెళ్లైందని, నెల రోజులుగా తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని భార్య తెలిపింది. ఈ కారణంగా తన భర్తకు గుంటూరు జిల్లా మాచర్లలో నివసించే తల్లిదండ్రులు రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారంటూ ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను అన్ని ప్రాంతాల్లో వెతికానని, తన భర్త జాడ తెలియరాలేదని చెప్పింది. తన అత్తమామల వద్దే భర్త ఉండి ఉంటాడంటూ ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హరర్ మూవీలు చూపించి.. అమెరికా అల్లుడి వికృత చేష్టలు
సాక్షి, బంజారాహిల్స్: ఎన్ఆర్ఐ భర్త మోసం చేయడంతో బాధిత యువతి ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా మంగళవారం యూసుఫ్‌గూడ ఎల్ఎననగర్లోని అత్తింటి ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళ్తే... యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌కు చెందిన మారి మహేష్ 2022 మే 26న రామేశ్వరిని వివాహం చేసుకున్నాడు. అదే ఏడాది జూన్ 18న యూఎస్ఏలోని టెక్సాస్‌కు తీసుకెళ్లాడు. అయితే ఆ మర్నాటి నుంచే నీ వల్ల కట్నం తక్కువగా వచ్చింది మరొకరిని చేసుకుంటే ఎక్కువ కట్నం వచ్చేదంటూ గొడవ పడుతున్నాడు. రామేశ్వరిని వదిలించుకోవాలని పలుమార్లు ఆమెపై దాడి చేశాడు. హరర్ మూవీలు చూపించేవాడు. బలవంతంగా హుక్కా తాగించేవాడు. ఆ తర్వాత రెండు నెలలకే గత ఆగస్టు 18న రామేశ్వరితో పాటు ఇండియాకు వచ్చిన మహేష్ ఆమెను దోమల్‌గూడలోని పుట్టింట్లో వదిలేసి ఆ తెల్లవారే అమెరికా వెళ్లిపోయాడు. ఆమెకు తెలియకుండానే రానుపోనూ టికెట్లు బుక్ చేసుకున్నాడు. తనను తీసుకెళ్లాలని ఫోన్ చేస్తే టికెట్ దొరకడం లేదంటూ బుకాయించాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు గత అక్టోబర్ 23న అమెరికాకు టికెట్ బుక్ చేసి రామేశ్వరిని భర్త వద్దకు పంపించారు. రామేశ్వరి ఫ్లైట్ ఎక్కగానే ఈ విషయమై ఆమె తండ్రి మహేందర్ అల్లుడికి ఫోన్ చేయగా తనకు ఏం సంబంధం లేదని ఆమె ఎవరో తనకు తెలియదంటూ అసభ్యంగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఆమె అమెరికా వెళ్లాక కూడా ఘర్షణ పడటమేగాక విడాకుల నోటీసుపై సంతకం కూడా పెట్టించాడు. ఈ విషయమే రామేశ్వరి తల్లిదండ్రులు మహేష్ తల్లిదండ్రులతో మాట్లాడటానికి ప్రయత్నించగా తమపై దాడి చేయడానికి వచ్చారంటూ మహేష్ తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బనాయించారు. పోలీసుల సూచన మేరకు బాధితురాలు ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పది రోజులు గడిచినా మహేష్‌ను, ఆమె తల్లిదండ్రులను పోలీసులు పిలవకపోవడంతో రామేశ్వరి తన తల్లిదండ్రులతో కలిసి అత్తమామను కలవడానికి వెళ్లగా ఇంటికి తాళం వేసి బయటికి గెంటేశారు. తన ఇంటికి తనను రావొద్దని చెప్పడానికి వారి ఏం హక్కు ఉందంటూ బాధితురాలు అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని, తక్షణం మహేష్‌ను అమెరికా నుంచి పిలిపించాలని కోరింది. (చదవండి: అంతం చేసింది అత్త కొడుకే..) -
వీళ్లు మాములోళ్లు కాదు.. వయ్యారంగా వచ్చి.. చీరలు దోచి
సాక్షి, హైదరాబాద్: కంచిపట్టు చీరలు చూపించాలని కొందరు, సాదాసీదా చీరలు చూపించాలని మరి కొందరు మహిళలు రెండు గ్రూపులుగా చీరల దుకాణానికి వచ్చి సేల్స్‌మెన్ దృష్టి మరల్చి చీరలతో ఉడాయించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌లో వయ్యారి వీవ్స్ పేరుతో చీరల షోరూం కొనసాగుతోంది. ఈ నెల 17న సాయంత్రం కొందరుమహిళలు రెండు గ్రూపులుగా ఈ షాప్‌నకు వచ్చారు. ఒక గ్రూపు మహిళలు కంచిపట్టు చీరలు చూపించాలని సేల్స్‌మెన్‌ను కోరగా ఆయన వాటిని చూపిస్తుండగా కొద్దిసేపటికే మరోగ్రూపు మహిళలు అక్కడికి వచ్చి సాదా చీరలు చూపించాలని కోరారు. సదరు సేల్స్‌మెన్ అటువైపు వెళ్లగానే కంచిపట్టు చీరలు చూస్తున్న మహిళలు వాటిని చాకచక్యంగా దొంగిలించారు. సేల్స్‌మెన్ ఇటు వచ్చిన కొద్దిసేపటికే సాదా చీరలు చూస్తున్న మహిళల బృందం సేల్స్‌మెన్ కళ్లు గప్పి చీరల్ని మూటలో వేసుకున్నారు. ఈ బృందం వెళ్లిపోయిన తర్వాత చీరలు చూడగా స్టాక్ తక్కువగా కనిపించడంతో సీసీ ఫుటేజ్ పరిశీలించగా సేల్స్‌మెన్ దృష్టి మరల్చి ఈ రెండు బృందాలు చీరలు దొంగిలించినట్లు గుర్తించారు. దీంతో షోరూం యజమాని తిరుమల రఘురాం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలకు ప్రోత్సాహాన్ని ఇస్తోంది: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు మంగళవారం యూసుఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నేషనల్ జూనియర్, సబ్ జూనియర్, మాస్టర్ మెన్, ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ పోటీలకు 26 రాష్ట్రాల నుంచి 800 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రీడాకారులకు చేయూతను అందిస్తుందని చెప్పారు. క్రీడలలో పాల్గొనడం వలన ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా ఉంటామని చెప్పారు. ఈ చాంపియన్ షిప్ ఏర్పాటు చేసిన నిర్వహకులు, క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. క్రీడలను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశం తో ప్రభుత్వం క్రీడా పాలసీని తీసుకొచ్చిందని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో క్రీడా మైదానాలు ఉండే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ జరగడం ఎంతో సంతోషిదగ్గ విషయం అన్నారు. ఇలాంటి పోటీల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. -
సీడబ్ల్యూసీ ఎదుట కరాటే కల్యాణి .. ‘అవమానించిన వారిని వదిలేది లేదు’
సాక్షి, హైదరాబాద్: అక్రమ దత్తత ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి కరాటే కల్యాణి బుధవారం యూసుఫ్‌గూడ మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రాంగణంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కార్యాలయంలో చంటిబిడ్డతో సహా అధికారుల ఎదుట హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు సీడబ్ల్యూసీ అధికారులు ఆమెను ప్రశ్నించి సమాచారం రాబట్టారు. అనంతరం కరాటే కల్యాణి విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంగా, ఎదుగుతున్న తనను కావాలని కొందరు అసత్య ఆరోపణలతో బయటకు లాగారన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. నిరాధార ఆరోపణలు చేసి తనను అవమానించిన వారిని వదిలేది లేదని, న్యాయపరంగా వారిపై పోరాడతానన్నారు. అధికారులు తన వాదనను నమ్మారని, తాను తప్పు చేయలేదని చెప్పడానికి అది చాలన్నారు. రెండు రోజులుగా ఫోన్ స్విచ్చాఫ్ అయిందని, తాను ఎక్కడికీ పారిపోలేదన్నారు. ఇంతవరకు తాను చంటిబిడ్డను దత్తత తీసుకోలేదని, భవిష్యత్‌లో తీసుకుంటానా లేదా అనే విషయాలు త్వరలో వెల్లడిస్తానన్నారు. చదవండి: ఓటీటీలో సామ్, నయన్‌ల మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే? నిబంధనలు పాటించాల్సిందే.. పిల్లలను దత్తత తీసుకోవాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సీడబ్ల్యూసీ అధికారులు కరాటే కల్యాణికి స్పష్టం చేశారు. ఆమె వద్ద ఉన్న పాపను చిన్నారి తల్లి స్వప్నకు అప్పగించారు. పాప తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారైనందున భవిష్యత్‌లో దత్తత తీసుకోవాలంటే రంగారెడ్డి వెల్ఫేర్ అధికారులను సంప్రదించాలని స్పష్టం చేసినట్టు సమా చారం. ప్రస్తుతం కల్యాణి వద్ద ఉంటున్న 11 ఏళ్ల బాలుడికి సంబంధించిన తల్లిదండ్రుల వివరాలు కూడా సీడబ్ల్యూసీకి అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విచారణలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శైలజతో పాటు సభ్యులు లలిత, ప్రమోద తదితరులు పాల్గొన్నారు. -
భార్యకు చెప్పి.. భర్త ఆత్మహత్య
సాక్షి, బంజారాహిల్స్: ఆత్మహత్య చేసుకుంటానని భార్యతో చెప్పి వెళ్లిన వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్‌గూడ కార్మికనగర్‌లో నివసించే పులివడ్ల భాస్కర్(40) అపోలో ఆస్పత్రిలో హౌస్ కీపింగ్ విభాగంలో పని చేస్తుంటాడు. మద్యానికి బానిసై రోజూ భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నెల 18వ తేదీన భార్య కవిత గ్యాస్‌కు డబ్బులు కావాలంటూ భాస్కర్‌ను అడిగింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ భాస్కర్ బయటికి వెళ్లగానే.. ఆందోళన చెందిన కవిత తన మామకు ఫోన్ చేసింది. అందరూ కలిసి భాస్కర్ కోసం గాలించగా రహ్మత్‌నగర్ నిమ్స్‌మే గ్రౌండ్లో చెట్టుకు ఉరేసుకొని వేలాడుతూ భాస్కర్ కనిపించాడు. వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొద్ది రోజులుగా భార్యతో గొడవ పడుతున్నాడని.. మద్యానికి బానిసయ్యాడని తండ్రి రత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమ పేరుతో ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి.. యువకుడి అఘాయిత్యం
సాక్షి, హైదరాబాద్: : మైనర్ బాలికను మాయమాటలతో మోసం చేసిన లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు సమీపంలోని తాహెర్ విల్లా కాలనీలో పని చేస్తున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్ కోనేటి రమేష్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించాడు. గత నెల 21న సదరు బాలికను రమేష్ ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి లైంగికి దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి గత నెల 23న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమేష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిదితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: వివాహితుడితో ప్రేమ.. సరిగ్గా ఎంగేజ్మెంట్కు ముందు! -
భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సాగర్ కె చంద్ర డైరెక్షన్లో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి లీడ్ రోల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23న(బుధవారం) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఇందుకోసం యూసఫ్ గూడ పోలిస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. సాయంత్రం జరగబోయే ఈ ఈవెంట్ నేపథ్యంలో ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది నగర పోలీస్ శాఖ. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రేపు మధ్యాహ్నం 2గం నుంచి రాత్రి 11గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో మైత్రీవనం నుంచి యూసఫ్ గూడ చెక్‌పోస్ట్ వైపు వాహనాలకు అనుమతి నిరాకరిస్తారు. సవేరా ఫంక్షన్ హాల్, క్రిష్ణ కాంత్ పార్క్, కళ్యాణ్ నగర్, సత్యసాయి నిగమాగమం, కృష్టానగర్ మీదుగా వాహనాల మళ్లింపు ఉంటుంది. #HYDTPinfo Commuters, please make note of traffic restrictions/diversions in view of the Pre-Release Event of the Telugu movie "Bheemla Nayak" at 1st TSSP Bn. Grounds, Yousufguda on 23.02.2022.@JtCPTrfHyd pic.twitter.com/lUn348As8R — Hyderabad Traffic Police (@HYDTP) February 22, 2022 pic.twitter.com/xihE3KATJj — Hyderabad Traffic Police (@HYDTP) February 22, 2022 అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్ గూడా వైపు వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమగమం వైపు మళ్లిస్తారు. సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం, ప్రభుత్వ పాఠశాలల్ని పార్కింగ్ ప్రదేశాలుగా గుర్తించారు. వాహనదారులు ఈ రూట్లలో ప్రయాణించి.. అసౌకర్యానికి గురికాకూడదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్లు చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 21వ తేదీనే ఈ ఈవెంట్ జరగాల్సిన ఉండగా.. ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ఈవెంట్‌ను వాయిదా వేశారు. దీంతో 21వ తేదీతో ఇచ్చిన పాసులకు అనుమతి ఉండదని, కేవలం 23వ తేదీతో ఉన్న పాసులకు మాత్రమే అనుమతి ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు సమాచారం. -
కూతురు మృతి.. అంతదూరం నుంచి రాలేమన్న తల్లిదండ్రులు
సాక్షి, బంజారాహిల్స్: కరోనా మహమ్మారి వల్ల కడచూపుకూడా దక్కడం లేదు. తల్లిదండ్రులు చనిపోతే తమ పిల్లలు, కన్నవాళ్లు చనిపోతే తల్లిదండ్రులు చివరి చూపు చూసుకునేందుకు కూడా వీల్లేకుండా పోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఖానాపురానికి చెందిన శీలం అరుణ శ్రీ(31) బ్యూటీషియన్‌గా పనిచేస్తూ యూసుఫ్‌గూడ సమీపంలోని యాదగిరి నగర్లో గత ఏడు సంవత్సరాలుగా ఉంటోంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురై శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసింది. తల్లిదండ్రులు స్వగ్రామంలో ఉండగా పోలీసులు వారికి సమాచారం అందించారు. అయితే కరోనా వ్యాపిస్తుండటంతో రాకపోకలకు కూడా తమకు తీవ్ర ఇబ్బందికారంగా ఉందని.. వచ్చివెళ్లేందుకు డబ్బులు కూడా లేవని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. మీరే అంత్యక్రియలు చేయాలని కోరారు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో భద్రపరిచినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖరరెడ్డి తెలిపారు. చదవండి: జూబ్లీహిల్స్: ఓయో రూమ్‌లో వ్యభిచారం.. -
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
-
ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: యూసఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యవతి దుర్మరణం పాలైంది. వివరాలు... సాయిదీపికా రెడ్డి అనే యువతి ఓ రియల్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. విధుల్లో భాగంగా మంగళవారం యాక్టివాపై పంజాగుట్ట నుంచి యూసఫ్‌గూడకు బయల్దేరింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయిదీపిక అక్కడిక్కడే మృతి చెందింది. కాగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఇక ప్రమాదానికి కారణమైన బస్సు కొండాపూర్ డిపోనకు చెందినదిగా తెలుస్తోంది. ఘటనకు కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
తెల్లారితే పెళ్లి.. మరో యువతితో వరుడు..
సాక్షి, హైదరాబాద్: తెల్లారితే పెళ్ళి పీటలెక్కాల్సిన వరుడు అంతకుముందే మరో యువతిని పెళ్లి చేసుకొని ఉడాయించాడు. దీంతో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజమండ్రికి చెందిన వెంకట దుర్గాప్రసాద్(29) యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి అద్దెకుంటున్నాడు. అమ్మాయిలను మాటలతో మభ్యపెట్టి ప్రేమలోకి దింపుతూ కాలం గడుపుతున్నాడు. నాలుగేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో నివసిస్తున్న యువతి(24)తో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె ప్రేమిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ యువతి తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమించిన యువకుడితో పెళ్లి కుదుర్చుకుంది. ఇందుకుగాను 20 రోజుల క్రితం నిశ్చితార్థం చేశారు. ఈ నెల 22వ తేదీన పెళ్లిజరగాల్సి ఉంది. రూ.3 లక్షలు కట్నం కూడా ఇచ్చారు. తీరా తెల్లారి పెళ్లి అనగా వెంకట దుర్గాప్రసాద్ అసలు రంగు బయటపడింది. ఆరు నెలలుగా మరో యువతితో ప్రేమలో పడ్డాడని ఆమెతోనే పది రోజుల క్రితం పెళ్లి జరిగిందని తెలుసుకొని బాధిత యువతి ఖంగుతినింది. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పరారీలో ఉన్న దుర్గా ప్రసాద్‌ను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పట్టపగలు యువతి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: పట్టపగలే ఓ ప్రేమోన్మాది యువతిని గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. బంగారు నగలు కట్ చేసే కట్టర్‌తో దాడికి తెగబడి ప్రాణాలు తీశాడు. సోమవారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతడు ఓ పోలీసు అధికారి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలానికి చెందిన అగ్గిరాముడు, అన్నపూర్ణ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. అగ్గిరాముడు మధురానగర్‌లో ఇస్త్రీ షాపు నిర్వహించడంతోపాటు ఓ ఇంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తూ జవహర్ నగర్లో కుటుంబంతో సహా అద్దెకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె వెంకటలక్ష్మి (19) ఏడో తరగతి వరకు చదివింది. కొన్నాళ్లు ఇళ్లల్లో పని చేసింది. రెండు నెలల నుంచి జవహర్ నగర్‌లోని జోడి ఫ్యాషన్ జ్యువెలరీస్ వన్ గ్రామ్ గోల్డ్ స్టోర్స్‌లో పని చేస్తోంది. ఈ షాపు యజమాని జ్యోత్స్న నాలుగు రోజుల క్రితం వేరే ఊరికి వెళ్లడంతో వెంకటలక్ష్మి దుకాణం నిర్వహిస్తోంది. సోమవారం కూడా స్టోర్స్ తెరిచిన వెంకటలక్ష్మి మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో యజమానురాలికి ఫోన్ చేసింది. షాపు వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, తనను వేధిస్తున్నారని చెప్పింది. తర్వాత 3.30 గంటల సమయంలో ఓ యువకుడు షాప్‌లోకి వచ్చాడు. అక్కడే ఉన్న బంగారు నగలు కట్ చేసే కట్టర్‌తో వెంకటలక్ష్మిపై దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. రక్తపు మడుగులో విగతజీవిగా పడున్న వెంకటలక్ష్మిని స్థానికులు కొద్దిసేపటి తర్వాత గమనించారు. వీరి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల నుంచి వేధింపులు ఆరు నెలలుగా సాగర్ అనే యువకుడు తనను వేధిస్తున్నట్లు వెంకటలక్ష్మి తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఓసారి సాగర్ ఇలానే చేసినట్లు ఆమె పలువురి వద్ద వాపోయినట్లు తెలిసింది. ప్రేమను నిరాకరించిన కారణంగానే అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగానే కుట్ర పన్ని సాగర్ గత నాలుగైదు రోజులుగా ఆమెను వెంటాడుతూ, ప్రతి కదలికను గుర్తించినట్లు తెలిసింది. దుకాణంలో ఒంటరిగా ఉందని, మధ్యాహ్నం వేళల్లో వినియోగదారుల రద్దీ కూడా ఉండదన్న ఉద్దేశంతో ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ హత్యలో సాగర్‌కు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. వారు బయట కాపు కాయగా.. దుకాణంలోకి వెళ్లిన సాగర్ ఘాతుకానికి తెగబడినట్లు సమాచారం. గొంతు కోసిన తర్వాత సాగర్ ఆమె మెడలో ఉన్న చున్నీతో ఉరి వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు మధురానగర్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. గతంలోనూ అతడు తమ కూతురిని బెదిరించాడని వెంకటలక్ష్మి కుటుంబీకులు తెలిపారు. రోదిస్తున్న వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అన్ని కోణాలను పరిగణలోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నాం. స్థానికుల సమాచారంతోపాటు ఘటనా స్థలంలో ఉన్న సీసీఫుటేజీలు, వీధిలోని ఫుటేజీలను సేకరించి విశ్లేషిస్తున్నాం. బాధితురాలి సెల్‌ఫోన్ కాల్‌డేటా సైతం పరిశీలిస్తున్నాం. – ఏఆర్ శ్రీనివాస్, వెస్ట్‌జోన్ డీసీపీ -
నడుస్తు నడుస్తూనే కిందపడి వ్యక్తి మృతి
-
కూతురుని లవ్ చేశాడని..
-
కుమార్తెను ప్రేమిస్తున్నాడని..
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేయడమేగాక ఇంట్లో బంధించి తీవ్రంగా కొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌కు చెందిన మహేందర్, భరత్‌నగర్ కాలనీకి చెందిన వెంకటేష్ యాదవ్ కుమార్తెను ప్రేమిస్తున్నాడు. ఈ నెల 21న అఖిల్, సాయి అనే ఇద్దరు యువకులు మహేందర్‌ను బలవంతంగా కారులో వెంకటేష్ ఇంటికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు. మల్లేష్, సాయి, వెంకటేష్ అతడిని తీవ్రంగా కొట్టడంతో మహేందర్ సృహతప్పి పడిపోవడంతో 22వ తేదీ తెల్లవారుజామున యూసుఫ్‌గూడ రహదారిపై పడేసి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అతని తండ్రి బాలమణి కుమారుడిని కేర్ ఆసుపత్రిలో చేర్చించాడు. బుధవారం కోలుకున్న మహేందర్ తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తమ పరిధిలోకి రాదంటూ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు పంపగా, వారు తమ పరిధి కాదంటూ జూబ్లీహిల్స్ కు పంపారు. చివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యూసుఫ్‌గూడలో అర్ధరాత్రి రౌడీల హల్చల్
-
సినిమాల్లో అవకాశం కోసం వ్యభిచారం
- పోలీసులకు చిక్కిన ఇంజినీరింగ్ యువతి సాక్షి, బంజారాహిల్స్ : వెండితెర మీద వెలిగిపోవాలన్న కోరిక.. ఎలాగైనా సినిమాల్లో రాణించాలనే తపన.. వీటికి ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి. వాటి నుంచి బయటపడి కలల లోకాన్ని చేరుకునేందుకు ఆమె తప్పుడు మార్గాన్ని ఎంచుకొని పోలీసులకు చిక్కింది. ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న యువతి వ్యభిచార గృహంలో పోలీసులకు దొరికిపోయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్ఎన్ నగర్లో నాగభాస్కర్ అలియాస్ విక్కి కొంత కాలంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. పి.సాయి దుర్గాప్రసాద్ అలియాస్ కార్తీక్, పి.ధర్మ అనే ఇద్దరు ఆయనకు అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. అందంగా ఉన్న అమ్మాయిలను ఎంచుకొని వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని అడిగినంత డబ్బు ఇచ్చి వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు. ఈ నేపథ్యంలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఓ అందమైన అమ్మాయి తనకు సినిమాల్లో నటించాలని కోరిక ఉందని దుస్తులు, మేకప్, ఖర్చుల కోసం డబ్బులు లేవని చెప్పడంతో వీరు ఆమెను ట్రాప్ చేశారు. సినిమా షూటింగ్ కోసమంటూ అందమైన ఫొటోలు తీశారు. విషయం ముందుగానే చెప్పి ఆ ఫొటోలను కొందరు యువకులకు పోస్ట్ చేసి బేరం పెట్టారు. ఇంకేముంది చాలా మంది ఆమె కావాలన్నారు. రెండు రోజుల క్రితం ఎల్ఎన్నగర్లోని వ్యభిచార గృహంపై దాడి చేసిన సమయంలో ఆమె పోలీసులకు చిక్కింది. ఆమె వివరాలు రాబట్టగా ఇంజినీరింగ్ చదువుతున్నట్లు తేలింది. ఆమెతో పాటు ముంబైకి చెందిన మరో మోడల్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని నింబోలి అడ్డాలోని బాలికల పునరావాస కేంద్రానికి తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకుడు విక్కీ పరారీలో ఉండగా అసిస్టెంట్లు కార్తీక్, ధర్మాలను ఐపీసీ సెక్షన్ 370, 370ఏ, పీటా యాక్ట్ కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.