Husband Goes Missing After 3 Months Of Marriage In Yousufguda, Details Inside - Sakshi
Sakshi News home page

Hyderabad: 3 నెలల కిందట పెళ్లి.. నెల రోజులుగా గొడవలు.. ఉన్నట్టుండి భర్త మాయం!

Published Wed, Mar 15 2023 1:48 PM | Last Updated on Wed, Mar 15 2023 5:39 PM

Husband Goes Missing After 3 Months Of Marriage Yousufguda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన భర్త అదృశ్యమయ్యాడని ఓ నవ వధువు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యూసుఫ్‌గూడ బస్తీలో నివసించే సోను(24) ప్రైవేట్‌ ఉద్యోగి కాగా,  భార్య షేక్‌ రోషణి(24) ఈవెంట్‌ మేనేజర్‌గా పని చేస్తోంది. ఈ నెల 5న ఆఫీసుకు వెళ్లిన సోను ఇంటికి తిరిగి రాలేదు. దీంతో రోషణి అతనికి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది

ఇదిలా ఉండగా,  ఈ ఏడాది జనవరిలో తమకు పెళ్లైందని, నెల రోజులుగా తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని భార్య తెలిపింది. ఈ కారణంగా తన భర్తకు గుంటూరు జిల్లా మాచర్లలో నివసించే తల్లిదండ్రులు రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారంటూ ఆమె బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను అన్ని ప్రాంతాల్లో వెతికానని, తన భర్త జాడ తెలియరాలేదని చెప్పింది. తన అత్తమామల వద్దే భర్త ఉండి ఉంటాడంటూ ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement