
పాలిటెక్నిక్ విద్యార్థిని అదృశ్యం
హైదరాబాద్: యూసుఫ్‌గూడ స్టేట్ హోమ్ ఆవరణలోని సర్వీస్ హోమ్‌లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. ఈ మేరకు సర్వీస్ హోమ్ అధికారులు మంగళవారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోని (16) అనే బాలిక నగరంలో పాలిటెక్నిక్ చదువుతుంది. అయితే ఆమె సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సదరు విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.