భార్యకు చెప్పి.. భర్త ఆత్మహత్య  | Man Commits Suicide After Clash With Wife At Yousufguda | Sakshi
Sakshi News home page

భార్యకు చెప్పి.. భర్త ఆత్మహత్య 

Published Wed, Apr 20 2022 8:59 AM | Last Updated on Wed, Apr 20 2022 9:08 AM

Man Commits Suicide After Clash With Wife At Yousufguda - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: ఆత్మహత్య చేసుకుంటానని భార్యతో చెప్పి వెళ్లిన వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్‌గూడ కార్మికనగర్‌లో నివసించే పులివడ్ల భాస్కర్‌(40) అపోలో ఆస్పత్రిలో హౌస్‌ కీపింగ్‌ విభాగంలో పని చేస్తుంటాడు. మద్యానికి బానిసై రోజూ భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నెల 18వ తేదీన భార్య కవిత గ్యాస్‌కు డబ్బులు కావాలంటూ భాస్కర్‌ను అడిగింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది.

తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ భాస్కర్‌ బయటికి వెళ్లగానే.. ఆందోళన చెందిన కవిత తన మామకు ఫోన్‌ చేసింది. అందరూ కలిసి భాస్కర్‌ కోసం గాలించగా రహ్మత్‌నగర్‌ నిమ్స్‌మే గ్రౌండ్‌లో చెట్టుకు ఉరేసుకొని వేలాడుతూ భాస్కర్‌ కనిపించాడు. వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొద్ది రోజులుగా భార్యతో గొడవ పడుతున్నాడని.. మద్యానికి బానిసయ్యాడని తండ్రి రత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement