clash with wife
-
భార్యకు చెప్పి.. భర్త ఆత్మహత్య
సాక్షి, బంజారాహిల్స్: ఆత్మహత్య చేసుకుంటానని భార్యతో చెప్పి వెళ్లిన వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్‌గూడ కార్మికనగర్‌లో నివసించే పులివడ్ల భాస్కర్(40) అపోలో ఆస్పత్రిలో హౌస్ కీపింగ్ విభాగంలో పని చేస్తుంటాడు. మద్యానికి బానిసై రోజూ భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నెల 18వ తేదీన భార్య కవిత గ్యాస్‌కు డబ్బులు కావాలంటూ భాస్కర్‌ను అడిగింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ భాస్కర్ బయటికి వెళ్లగానే.. ఆందోళన చెందిన కవిత తన మామకు ఫోన్ చేసింది. అందరూ కలిసి భాస్కర్ కోసం గాలించగా రహ్మత్‌నగర్ నిమ్స్‌మే గ్రౌండ్లో చెట్టుకు ఉరేసుకొని వేలాడుతూ భాస్కర్ కనిపించాడు. వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొద్ది రోజులుగా భార్యతో గొడవ పడుతున్నాడని.. మద్యానికి బానిసయ్యాడని తండ్రి రత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భార్య భోజనానికి రాలేదని.. ప్రొఫెసర్ ఆత్మహత్య
ఆయనో కాలేజీలో ప్రొఫెసర్. అయితే ఎప్పుడు ఆయన మూడ్ ఎలా ఉంటుందో ఆయనకే తెలియదు. చిన్నచిన్న విషయాలకు కూడా ఉత్తినే కోపం తెచ్చుకుంటారు. అలాగే చిన్న కారణంతో ఏకంగా ప్రాణాలు తీసుకున్నారు. బెంగళూరు కేఆర్ పురంలోని ఈస్ట్ వెస్ట్ కాలేజిలో ప్రొఫెసర్‌గా పనిచేసే సునీల్ దొడ్డన్నయ్య (32) తన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఇదిరానగర్ ప్రాంతంలోని లాల్ బహదూర్ శాస్త్రి నగర్లో నివాసం ఉంటారు. అందరూ కలిసి భోజనం చేద్దామనుకున్నారు. కానీ భార్య మాత్రం పది నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దాంతో ప్రొఫెసర్ గారికి ఎక్కడలేని కోపం వచ్చి, తన బెడ్రూంలోకి వెళ్లి తలుపు తాళం వేసుకున్నట్లు ఆయన తండ్రి దొడ్డన్నయ్య పోలీసులకు తెలిపారు. అయితే ఇంతకుముందు కూడా కోపం వచ్చినప్పుడల్లా అలాగే చేసేవారు కాబట్టి తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, మర్నాటి ఉదయం కూడా ఎంత పిలిచినా పలకకపోవడం, తలుపు కొట్టినా పట్టించుకోకపోవడంతో భయపడి తలుపు బద్దలుకొట్టి చూడగా, అప్పటికే సునీల్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. ఆయన గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లేదని పోలీసులు తెలిపారు.