
నిందితుడు రమేష్
సాక్షి, హైదరాబాద్: : మైనర్ బాలికను మాయమాటలతో మోసం చేసిన లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు సమీపంలోని తాహెర్ విల్లా కాలనీలో పని చేస్తున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్ కోనేటి రమేష్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించాడు.
గత నెల 21న సదరు బాలికను రమేష్ ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి లైంగికి దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి గత నెల 23న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమేష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిదితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: వివాహితుడితో ప్రేమ.. సరిగ్గా ఎంగేజ్‌మెంట్‌కు ముందు!
Comments
Please login to add a commentAdd a comment