ఫైనల్లో తనిష్క్ | tanishq entered in finals badminton tournment | Sakshi
Sakshi News home page

ఫైనల్లో తనిష్క్

Published Fri, Jan 10 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM

tanishq entered in finals badminton tournment

జింఖానా, న్యూస్‌లైన్: అఖిల భారత బీఎస్‌ఎన్‌ఎల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు తనిష్క్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో తనిష్క్ 21-10, 21-18తో అమిత్ కులకర్ణి (మధ్యప్రదేశ్)పై విజయం సాధించాడు.
 
 మరో సెమీస్‌లో సర్వజిత్ (పశ్చిమ బెంగాల్) 21-18, 21-13తో వికాస్ సింగ్‌పై గెలిచి ఫైనల్స్‌కు చేరుకున్నాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో అస్సాంకు చెందిన మనాలి సిన్హా-సుమిత్ర జోడి విజేతగా నిలిచింది. మనాలి-సుమిత్ర జోడి 21-2, 21-3తో నవీన్ నాయర్ -సర్వజిత్ కౌర్ (ఉత్తరప్రదేశ్) జంటను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.
 
 దీంతో పాటు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మనాలి సిన్హా (అస్సాం) 21-1, 21-1తో స్రవంతి (ఆంధ్రప్రదేశ్)పై, సుమిత్ర (అస్సాం) 21-13, 21-11తో అమృత భట్టాచార్య (పశ్చిమ బెంగాల్ )పై గెలిచి ఫైనల్స్‌కు చేరుకున్నారు. వెటరన్ సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీనివాస రావు 21-10, 20-22, 23-21తో గౌతమ్ ఛటర్జీ (పశ్చిమ బెంగాల్)పై, దినేష్ యాదవ్ (మధ్యప్రదేశ్) 21-10, 21-16తో జాన్ మతాయ్ (ఛత్తీస్‌గఢ్)ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అనిల్ కుమార్-తనిష్క్ (ఆంధ్రప్రదేశ్) జోడి 21-10, 21-6తో పటేల్-జాన్మతి (ఛత్తీస్‌గఢ్) జోడిపై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.
 
 మిగతా ఫలితాలు
 చందన్ సింగ్-వికాస్ సింగ్ (ఉత్తరాఖండ్) జోడి 21-14, 22-20తో సర్వజిత్ బౌమిక్-సుదీప్ (పశ్చిమ బెంగాల్) ద్వయంపై, అభిజిత్ దత్త-హతిబరూవ (అస్సాం) జంట 21-12, 21-16తో సపన్ కుమార్-విమల్ వివేక్ (బీహార్)జోడిపై, అమిత్ కులకర్ణి-అమిత్ సక్సేనా (మధ్యప్రదేశ్) జోడి 21-14, 21-12తో రాజేష్-శ్రీజిత్ (కేరళ) ద్వయంపై విజయం సాధించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement