
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువతి రోడ్డు పడిపోయింది. అదే సమయంలో వస్తున్న ఓ బస్సు సదరు యువతిపై నుంచి వెళ్లటంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను అస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించారు. మృతురాలికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.