ఒక్కరోజు రోడ్డు
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల కురిసిన వర్షాలకు నగర రోడ్లు ఎంతగా ఛిద్రమయ్యాయో ప్రతి వాహనదారుడికి అనుభవమే. అలాంటి రోడ్లలో ఈ చిత్రంలో కనిపిస్తున్నది కూడా ఒకటి. శ్రీనగర్ కాలనీలోని సందీప్తి గ్యాస్ గోడౌన్ నుంచి యూసుఫ్‌గూడ ఆర్‌బీఐ చౌరస్తా వరకు ఉన్న ఈ రోడ్డు మొన్నటి వర్షాలకు పూర్తిగా గుంతలు పడింది. దీంతో అధికారులు ఈనెల 7న అర్ధరాత్రి తారు రోడ్డు వేశారు. అయితే వాహనదారుల ఆనందం ఒక్కరోజుకే పరిమితమైంది.
9వ తేదీ ఉదయానికి ఇలా గుంతలు పడి, కంకర తేలి ప్రమాదకరంగా మారింది. గుంతలుగా ఉన్నప్పుడు నెమ్మదిగా, జాగ్రత్తగా వాహనాలు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు రోడ్డు బాగుందని కాస్త వేగంగా వచ్చినవారు ఈ కంకరపై జారిపడి గాయాల పాలవుతున్నారు. నగరంలో రోడ్ల నాణ్యతకు ఈ మార్గం అద్దం పడుతోంది.